Head In Toilet: ఛీ యాక్, టాయిలెట్ రంథ్రంలో ఇరుక్కున్న తల, ఆమె అందులోకి ఎలా దూరింది?
టాయిలెట్ కమోడ్‌లోని రంథ్రంలోకి తలపెట్టిన ఆమె.. అనుకోని చిక్కుల్లో పడింది. అందులో నుంచి బయటపడలేక విలవిల్లాడింది. ఇంతకీ ఆమె అందులో తల ఎందుకు పెట్టింది?
Woman Head Into Toilet | టాయిలెట్ కమోడ్‌లో కూర్చున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఏ పని కోసమైతే వెళ్లారో ఆ పనిని శుభ్రంగా పూర్తి చేసుకోవాలి. అంతేగానీ, మొబైల్ ఫోన్లు తీసుకెళ్లి టైంపాస్ చేసేందుకు ప్రయత్నిస్తే ఈ మహిళ తరహాలోనే చేదు అనుభవాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. ఇంతకీ ఆ మహిళకు ఏమైంది? టాయిలెట్ కమోడ్‌లో ఆమె తల ఎందుకు ఇరుక్కుంది?
అమెరికాలోని వాషింగ్టన్(Washington)లో అత్యవసర సేవల విభాగం 911కు ఓ చిత్రమైన కాల్ వచ్చింది. 40 ఏళ్ల మహిళ తన తల టాయిలెట్ కమోడ్ రంథ్రంలో ఇరుక్కుపోయిందని తెలిపింది. దీంతో ఆశ్చర్యపోయిన 911 సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. మౌంట్ వాకర్ సమీపంలోని వాల్ట్ టాయిలెట్‌లో ఆమె చిక్కుకున్నట్లు తెలుసుకున్నారు. అక్కడికి వెళ్లి చూసేసరికి.. టాయిలెట్ కమోడ్‌ను పక్కకు తొలగించి ఉంది. ఆమె తల, చేయ్యి సెప్టిక్ ట్యాంక్‌కు వెళ్లే గొట్టం రంథ్రంలో చిక్కుకుని ఉన్నాయి. దీంతో అగ్నిమాపక సిబ్బంది ఎంతో శ్రమించి ఆమెను బయటకు తీశారు.
బయటకు వచ్చిన తర్వాత అందులోకి ఎందుకు తల దూర్చావని అధికారులు ప్రశ్నించారు. తన ఫోన్ టాయిలెట్‌లో పడిపోయిందని, చేతుల ద్వారా సాధ్యం కాకపోవడంతో తన కుక్క బెల్టు సాయంతో బయటకు తీసేందుకు ప్రయత్నించానని తెలిపింది. అయితే, ఫోన్ బాగా లోపలికి వెళ్లిపోవడంతో టాయిలెట్ కమోడ్‌ను పూర్తిగా తొలగించి రంథ్రంలోకి తలదూర్చి ఫోన్‌ను అందుకున్నానని చెప్పింది. ఆ తర్వాత అందులో నుంచి బయటకు రాలేక ఇబ్బందిపడ్డానని తెలిపింది. ఈ ఘటనలో ఆమెకు ఎలాంటి గాయాలు కాలేదు.
Also Read: ఓ మై గాడ్, కారు ఢీకోగానే గాల్లో పల్టీలు కొట్టిన బైకర్, వీడియో వైరల్
లక్కీగా ఆమె ఆ ట్యాంక్‌లోని విష వాయువులు కూడా లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే ఆమె శరీరానికి మల వ్యవర్థాలు అంటుకున్నాయి. దీంతో అధికారులు ఆమెను హాస్పిటల్‌కు తరలించాలని భావించారు. కానీ, ఇందుకు ఆమె అంగీకరించలేదు. ఆమెను శుభ్రం చేసిన అనంతరం టైవెక్ సూట్ ఇచ్చారు. అనంతరం ఆమె కాలిఫోర్నియాలోని తన ఇంటికి వెళ్లిపోయింది. అధికారులు ఆ మహిళ వివరాలను గోప్యంగా ఉంచారు. ఏది ఏమైనా టాయిలెట్‌లో ఫోన్ ఉపయోగించడం అంత మంచిది కాదు. పొరపాటున ఫోన్ అందులో పడిందంటే ఇక నరకమే.
Also Read: శీఘ్ర స్కలనానికి ‘కరెంట్ షాక్’, ఈ చికిత్సతో ఏడాదిలోనే ఆ ‘పవర్’, అధ్యయనం వెల్లడి