Accident Video: ఓ మై గాడ్, కారు ఢీకోగానే గాల్లో పల్టీలు కొట్టిన బైకర్, వీడియో వైరల్
నాలుగు కూడలి జంక్షన్‌లో అప్రమత్తంగా లేకపోతే ఎంత ప్రమాదకరమనేది ఈ వీడియో చూస్తే తెలుస్తుంది. ఇలా మీరు చేయొద్దు.
Ghaziabad Accident | రోడ్డు మీద ప్రయాణించేప్పుడు పరధ్యానం అస్సలు పనికిరాదు. ముఖ్యంగా నాలుగు కూడలి జంక్షన్లో రోడ్డు దాటుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే.. ఏదో ఒక వాహనం ఢీకొట్టే ప్రమాదం ఉంది. గజియాబాద్‌లోని వేవ్ సిటీ సెంటర్‌లోని కవి నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదమే ఇందుకు నిదర్శనం.
రోడ్డు ఖాళీగా ఉంది కదా అని ఓ వ్యక్తి మీద బైకు మీద నాలుగు కూడలి జంక్షన్‌లో వేగంగా రోడ్డు దాటుతున్నాడు. ఈ క్రమంలో అతడు తనకు ఎడమ వైపు నుంచి వస్తున్న కారును చూసుకోలేదు. ఆ సమయంలో కారు కూడా చాలా వేగంగా ప్రయాణిస్తోంది. దీంతో ఆ కారు బైకును బలంగా ఢీకొట్టింది. ఆ దాటికి బైకర్ గాల్లో సుమారు రెండు పల్టీలు కొట్టి.. కారు మీద పడ్డాడు. చివరిగా రోడ్డుమీద పడ్డాడు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read: ‘బూతే’ భవిష్యత్ - కళాశాలలో ‘పోర్నోగ్రఫీ’ కోర్స్, తరగతిలోనే ‘అశ్లీల’ వీడియోలతో క్లాస్!
బైకును ఢీకొట్టగానే కారు బ్రేక్ వేసినా.. వేగంగా వెళ్తుండటం వల్ల వెంటనే ఆగలేదు. దీంతో బైకును కొద్ది దూరం ఈడ్చుకెళ్లింది. సీసీటీవీ కెమేరాలో రికార్డైన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో ఇద్దరిదీ తప్పుందని నెటిజనులు అంటున్నారు. ముఖ్యంగా నాలుగు కూడలి జంక్షన్‌లో కారు డ్రైవర్ కూడా వేగాన్ని తగ్గించాలి. అలాగే బైకర్ కూడా ప్రధాన రహదారిపై వాహనాల రాకపోకలను గమనిస్తూ వెళ్లి ఉంటే ఈ పరిస్థితి రాకపోయేది. మీరైనా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఇలాంటి ప్రమాదాలకు గురికాకుండా ప్రాణాలు కాపాడుకోండి. ముఖ్యంగా నాలుగు కూడలి జంక్షన్లలో రోడ్డును క్రాస్ చేసేప్పుడు మరింత జాగ్రత్తగా ఉండాలి. ట్రాఫిక్ నియమాలను పాటించాలి. ఈ యాక్సిడెంట్ వీడియో చూసి ఇద్దరిలో ఎవరిది తప్పో చెప్పండి.
Also Read: శీఘ్ర స్కలనానికి ‘కరెంట్ షాక్’, ఈ చికిత్సతో ఏడాదిలోనే ఆ ‘పవర్’, అధ్యయనం వెల్లడి
#Ghaziabad road accident. Bike and car collision. After the collision, the bike rider jumped high from the roof of the car and fell on the road. condition critical pic.twitter.com/MRnESjwege
— Satya Tiwari (@SatyatTiwari) April 22, 2022