Utah University: ‘బూతే’ భవిష్యత్ - కళాశాలలో ‘పోర్నోగ్రఫీ’ కోర్స్, తరగతిలోనే ‘అశ్లీల’ వీడియోలతో క్లాస్!
ప్రపంచంలోనే తొలిసారిగా ఈ కళాశాలలో పోర్నోగ్రాఫీ కోర్సును ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా విద్యార్థులు లెక్చరర్‌లతో కలిసి పోర్న్ వీడియోలను విశ్లేషిస్తారు.
యువతకు సెక్స్ ఎడ్యుకేషన్ చాలా అవసరం అన్నప్పుడే.. చాలామంది నోరెళ్లబెట్టారు. నాలుగు గోడల మధ్య జరిగేదాన్ని.. కళాశాల గోడలపై గీసి చూపిస్తారా అని ఎద్దేవా చేసినవాళ్లు కూడా చాలామంది ఉన్నారు. అయితే, అమెరికాలోని ఓ యూనివర్శిటీకి చెందిన కళాశాలలో ఏకంగా ‘హార్డ్‌కోర్ పోర్నోగ్రఫీ’నే కోర్స్‌గా చేర్చారు. ఇందులో భాగంగా ఆ కళాశాలలోని విద్యార్థులంతా లెక్చరర్‌తో కలిసి పోర్న్ వీడియోలను వీక్షిస్తారు. ఎలాంటి లింగబేధాలు లేకుండా విద్యార్థినీ విద్యార్థులంతా కలిసి ఈ వీడియోలను వీక్షిస్తారు. మీకు కూడా ఆ కళాశాలలో జాయిన్ కావాలని ఉందా? అయితే, మీరు ఉటాలోని సాల్ట్‌లేక్ సిటీకి వెళ్లాల్సిందే.
విద్యాలయాలను మనం సరస్వతి నిలయాలుగా భావిస్తాం. విద్యార్థులకు కేవలం విద్యను మాత్రమే బోధించాలని కోరుకుంటాం. ఎలాంటి అశ్లీల, అసభ్యకర కార్యకలాపాలకు తావులేకుండా జాగ్రత్తపడతాం. విద్యార్థులు క్షమశిక్షణతో మెలిగేలా ఉండాలని అనుకుంటాం. అయితే, వెస్ట్‌మిన్‌స్టర్ కళాశాల అందుకు భిన్నం. అక్కడ విద్యార్థులకు చదువుతోపాటు బూతు చిత్రాలు కూడా చూపిస్తారు. ఛీ.. ఛీ.. ఇదే పాడుబుద్ధి అని అనుకుంటున్నారా? అయితే, ఈ కోర్సు కూడా విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశిస్తుందట.
Also Read: రియల్ IT, 33 మందిని చంపేసి ఇంట్లోనే పూడ్చేసిన ‘జోకర్’ - ఇతడి వాంగ్మూలం దడ పుట్టిస్తుంది
‘‘మేము కలిసి అశ్లీల చిత్రాలను చూస్తాం. జాతి, తరగతి, లింగం విబేధాలు లేకుండా ప్రయోగాత్మక, ఒక కళారూపంగా దీనిపై చర్చిస్తాం’’ అని కోర్సుకు సంబంధించిన వివరణలో పేర్కొనడం గమనార్హం. దీనిపై కళాశాల యాజమాన్యం స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వెస్ట్‌మినిస్టర్ కాలేజీ అప్పుడప్పుడు సామాజిక సమస్యలను విశ్లేషించడానికి ఇలాంటి సెలెక్టెడ్ కోర్సులను అందిస్తుంది’’ అని పేర్కొంది. అంటే, విద్యార్థులు తమకు ఇష్టమైతేనే ఈ కోర్సులో చేరవచ్చని, అశ్లీల వీడియోలను విశ్లేషించివచ్చని పేర్కొన్నారు.
Also Read: శీఘ్ర స్కలనానికి ‘కరెంట్ షాక్’, ఈ చికిత్సతో ఏడాదిలోనే ఆ ‘పవర్’, అధ్యయనం వెల్లడి
వెస్ట్‌మిన్‌స్టర్ అనేది ఒక ప్రైవేట్ లిబరల్ ఆర్ట్స్ కళాశాల అని, విభిన్న దృక్కోణాలు, విమర్శనాత్మక ఆలోచనా నైపుణ్యాలను పెంపొందించే కార్యక్రమాల ద్వారా విద్యార్థులకు జీవితం, కెరీర్‌ను తీర్చిదిద్దే సంస్థ అని యాజమాన్యం తెలుపుతోంది. ఇందులో భాగంగా ఇక్కడ అన్నిరకాల కోర్సులను విద్యార్థులకు బోధిస్తోందని వెల్లడించింది. ఈ కళాశాలకు చెందిన ఓ అధ్యాపకురాలు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఇది సంప్రదాయవాదం లేదా మతపరమైన అభ్యాసంపై దాడి కాదు. నేను క్యాథలిక్ కుటుంబం నుంచి వచ్చాను. సెక్స్‌ను ఎందుకు భయానకంగా పరిగణిస్తారనే అంశాన్ని అధ్యయనం చేయడానికి ఇది ఒక ఉత్ప్రేరకం. పోర్న్ చూడటం, ఆ సీన్లు చూసి సరదాగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్లిపోవడం కోసం ఈ కోర్సు ఉద్దేశించినది కాదు’’ అని ఆమె స్పష్టం చేశారు. మరి, దీనిపై మీరు ఏమంటారు?