అన్వేషించండి

Phishing Scam Alert: బ్యాంక్ కస్టమర్లకు హెచ్చరిక, ఈ రెండు నెంబర్ల నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయొద్దు

మీకు ఈ రెండు ఫోన్ నెంబర్ల నుంచి కాల్ వస్తే జాగ్రత్త. ఆ ఫోన్లకు అస్సలు సమాధానం ఇవ్వొద్దు. పొరపాటున ఆ ఫోన్ కాల్‌కు ఆన్సర్ చేస్తే.. మీ వ్యక్తిగత, బ్యాంక్ వివరాలను అస్సలు చెప్పొద్దు.

Phishing Scam | ఇప్పుడు ఆర్థిక లావాదేవీలన్నీ డిజిటల్ కావడంతో ఆన్‌లైన్ నేరాలు, ఫిషింగ్ స్కామ్‌లు పెరిగిపోయాయి. కస్టమర్ల ఫోన్ నెంబర్లకు కాల్ చేసి మరీ నేరగాళ్లు వారి వ్యక్తిగత వివరాలను సేకరిస్తున్నారు. ఆ తర్వాత వారి బ్యాంక్ అకౌంట్లను హ్యాక్ చేసి నగదు కాజేస్తున్నారు. ఈ నేపథ్యంలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తమ ఖాతాదారులకు ఓ హెచ్చరిక జారీ చేసింది. ఫిషింగ్ స్కామ్‌లో చిక్కుకోవద్దంటూ అప్రమత్తం చేసింది.

KYC అప్‌డేట్‌ల కోసం మీ మొబైల్ ఫోన్లకు వచ్చే ఫిషింగ్ లింక్‌లపై క్లిక్ చేయవద్దని తెలిపింది. SBI కస్టమర్లు ఇటీవల ట్విట్టర్ ద్వారా కొన్ని ఫిర్యాదులు చేశారు. ఈ సందర్భంగా SBI స్పందిస్తూ.. ‘‘మా IT భద్రతా బృందం అవసరమైన చర్యలు తీసుకుంటుంది. అనుమానస్పద ఇమెయిల్స్, SMS, కాల్‌లకు స్పందించవద్దని మా ఖాతాదారులందరినీ కోరుతున్నాం. వినియోగదారుడు తమ ID, పాస్‌వర్డ్,  డెబిట్ కార్డ్ నంబర్, PIN, CVV, OTP వంటి వ్యక్తిగత లేదా బ్యాంకింగ్ సమాచారాన్ని కోరే ఎంబెడెడ్ లింక్‌లను క్లిక్ చేయొద్దని మనవి. ఈ ప్రశ్నలను బ్యాంక్ ఎప్పుడూ అడగదనే విషయాన్ని గుర్తుంచుకోండి. కస్టమర్‌లు అలాంటి ఫిషింగ్, స్మిషింగ్, విషింగ్ ప్రయత్నాలను ఇమెయిల్ ద్వారా మాకు నివేదించవచ్చు. మీ ఫిర్యాదులను phishing@sbi.co.inకి ఇమెయిల్ పంపండి లేదా 1930కి హాట్‌లైన్‌కి కాల్ చేయండి’’ అని SBI తెలిపింది. 

మోసగాళ్లు ఏ విధంగా కస్టమర్లను మాయ చేస్తారో తెలుపుతూ RBI కూడా ఓ బ్రోచర్‌ను విడుదల చేసింది. ‘‘మోసగాళ్లు వివిధ యాప్‌లు, SMS, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఆకర్షణీయమైన రుణాలను ఆశ చూపుతూ మోసపూరిత సందేశాలను పంపిస్తారు. విశ్వసనీయత కోసం వారు తమ మొబైల్ నంబర్‌లో ఏదైనా తెలిసిన NBFC ప్రొఫైల్ పిక్చర్‌గా ఉపయోగించుకుంటారు’’ అని RBI పేర్కొంది. మోసగాళ్లు కస్టమర్లకు కాల్ చేసి, బోగస్ అప్రూవల్ లెటర్స్, మోసపూరిత చెక్కుల కాపీలు, వివిధ రుసుములను డిమాండ్ చేస్తారు. కాబట్టి, అస్సలు మోసపోవద్దని RBI తెలిపింది. ఇటీవల SBI కస్టమర్లు ఇలాంటి స్కామ్‌లకు గురయ్యారని పేర్కొంది. 

Also Read: ఛీ యాక్, టాయిలెట్ రంథ్రంలో ఇరుక్కున్న తల, ఆమె అందులోకి ఎలా దూరింది?

ఈ నెంబర్ల నుంచి కాల్ వస్తే ఆన్సర్ చేయొద్దు: SBI విడుదల చేసిన తాజా ప్రకటన ప్రకారం.. ఈ రెండు నెంబర్ల నుంచి వచ్చే కాల్స్‌ను అస్సలు ఆన్సర్ చేయొద్దని, ఒక వేళ పొరపాటున సమాధానం ఇస్తే, మీ వ్యక్తిగత.. బ్యాండ్ వివరాలను వారికి చెప్పొద్దని తెలిపింది. +91-8294710946 లేదా +91-7362951973 నెంబర్ల నుంచి వచ్చే కాల్‌లను మోసగాళ్లుగా భావించి కాల్ కట్ చేయాలని సూచించింది. అస్సాం CID  నివేదించిన వివరాల ప్రకారం.. ఆ నెంబర్ల నుంచి కాల్ చేసే మోసగాళ్లు KYC అప్‌డేట్ కోసం ఫిషింగ్ లింక్‌పై క్లిక్ చేయాలని కస్టమర్లను కోరుతున్నారని తెలిపింది. కాబట్టి, మీకు బ్యాంక్ నుంచి ఏదైనా కాల్ వస్తే తప్పకుండా తిరస్కరించండి. వారి వలలో చిక్కుకోకుండా జాగ్రత్తపడండి. 

Also Read: ఓ మై గాడ్, కారు ఢీకోగానే గాల్లో పల్టీలు కొట్టిన బైకర్, వీడియో వైరల్

టాప్ హెడ్ లైన్స్

Munagaku Pakodi : మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
మునగాకుతో క్రిస్పీ పకోడీలు.. సాయంత్రం స్నాక్స్‌గా ఇలా చేసుకుని లాగించేయండి
HIV and Pregnancy : HIV ఉన్నా తల్లి కావచ్చు.. బిడ్డకు వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి ప్రాసెస్ ఇదే
HIV ఉన్నా తల్లి కావచ్చు.. బిడ్డకు వైరస్ సోకకుండా ఉండాలంటే ఏం చేయాలి? పూర్తి ప్రాసెస్ ఇదే
Aloe Vera Benefits : చర్మం, జుట్టు సంరక్షణకు కలబంద.. ఇంట్లోనే ఈ DIY చిట్కాలు ఫాలో అవుతూ ఉపయోగించండి
చర్మం, జుట్టు సంరక్షణకు కలబంద.. ఇంట్లోనే ఈ DIY చిట్కాలు ఫాలో అవుతూ ఉపయోగించండి
HIV Emergency Treatment : హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?
హెచ్ఐవీ వస్తుందని డౌట్ ఉందా? 72 గంటల్లో ఈ చికిత్స తీసుకుంటే ఇన్ఫెక్షన్‌ను అడ్డుకోవచ్చా? PEP అంటే ఏమిటి?

వీడియోలు

Hyderabad's Korean Craze Taking Over Youth | హైదరాబాద్‌లో పెరుగుతున్న కొరియన్ కల్చర్ ప్రభావం
Bhuvneshwar Kumar Disastrous T20 Comeback | రీ-ఎంట్రీలో భువి ఘోర రికార్డు
India Women Vs Zimbabwe 2nd ODI | జింబాబ్వేపై భారత మహిళల జట్టు చారిత్రాత్మక విజయం
Team India World Record in T20 | ప్రపంచ క్రికెట్ చరిత్రలోనే తొలిసారి: 200 T20I విజయాలతో టీమ్ ఇండియా వరల్డ్ రికార్డ్
Virosh Couple Clarity on Divorce Rumours | ట్రోల్స్‌కు విజయ్, రష్మిక అదిరిపోయే కౌంటర్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Garividi Lakshmi OTT : ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
ఓటీటీలో గరివిడి లక్ష్మి - మూడు భాషల్లో స్ట్రీమింగ్... థియేటర్లలో మిస్ అయితే...
Meerut Police Half Encounter: యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
యువతిపై దాడి చేసిన ఉన్మాదికి రాప్తాడు తరహా ట్రీట్మెంట్.. మీరట్ పోలీసుల హాఫ్ ఎన్‌కౌంటర్‌లో కాలికి బుల్లెట్ గాయం!
Ekalavya Series OTT : AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
AI హీరో వచ్చేస్తున్నాడు - ఓటీటీలోకి 'ఏకలవ్య' వెబ్ సిరీస్... ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
నేపాల్ లేనిదే రాముడు అసంపూర్ణం అన్న మోదీ! భారత్-నేపాల్ పుణ్యక్షేత్రాల పవిత్ర బంధం
Actor Venkatesh: డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
డ్రగ్స్‌కు నో చెప్పండి.. జీవితానికి ఎస్ చెప్పండి - యువతకు విక్టరీ వెంకటేష్ పిలుపు
Telangana High Court: కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
కూకట్‌పల్లి ట్రక్ పార్క్ భూముల వేలం నిలిపివేయాలి.. హైకోర్టులో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిల్
Union Cabinet Decisions: ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
ఎయిర్‌పోర్ట్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సహా కీలక ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్ ఆమోదం.. 19000 కోట్లు కేటాయింపు
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
తెలంగాణ కాంగ్రెస్‌లో సందీప్‌కు అసలు పరీక్ష.. పార్టీ, ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తారా?
Embed widget