By: ABP Desam | Updated at : 16 Feb 2022 07:31 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
ప్రోటీన్లను తెలుగులో మాంసకృత్తులు అంటాం. ఇవి శరీర నిర్మాణానికి, కండరాలకు, అవయవాల పనిరతీరుకు చాలా అవసరం. అయితే పేరుకు తగ్గట్టు అవి మాంసాహారంలోనే అధికంగా ఉంటాయనుకుంటారు. అంతా. చికెన్, మటన్ తింటేనే ప్రోటీన్లు అధికంగా లభిస్తాయనుకోవడం కేవలం అపోహే అంటున్నారు ఆహారనిపుణులు. మాంసాహారం ద్వారా లభించే ప్రోటీన్ కన్నా అధికంగా కొన్ని శాకాహార వంటల్లో లభిస్తుంది.
ప్రోటీన్లు చాలా ముఖ్యం
శరీరం మెరుగ్గా పనిచేయాలంటే 22 రకాల అమైనో ఆమ్లాలు అవసరం. వాటిలో తొమ్మిందింటిన శరీరం తయారుచేసుకోగలదు. కానీ మిగతావి మాత్రం మనం తినే ఆహారం ద్వారానే చేరాలి. అందుకే మనకు ప్రోటీన్లు అవసరం. ఎందుకంటే ప్రోటీన్లే శరీరంలో అమైనో ఆమ్లాలను తయారుచేస్తాయి. అందుకే మనం ప్రోటీన్ ఆహారం తినమని చెబుతారు. ప్రోటీన్ పేరు ఎత్తితే అందరికి గుడ్లు, చికెన్, మటన్ గుర్తొస్తాయి. శాకాహారులు వాటిని తినరు, మరి వారు ఏం తినాలి?
ఇదిగో ఇవి తినండి...
సోయా గింజల్లో ప్రొటీన్ అధికంగా ఉంటుంది. కాబట్టి సోయా బీన్స్ తో చేసిన ఉత్పత్తులను వాడచ్చు. సోయాపాలు, సోయా మీల్ మేకర్ లాంటివన్నమాట. చికెన్, మటన్ కన్నా ప్రోటీన్లు సోయాలోనే ఎక్కువ. వంద గ్రాముల చికెన్‌లో 28 గ్రాముల ప్రోటీన్లు ఉంటే, మటన్ లో 26 గ్రాములు లభిస్తాయి. అదే సోయాలో అయితే 31 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. సోయా మీల్ మేకర్‌ను బిర్యానీలో భాగం చేసుకోవడం, లేదా కూరల్లో కలిపి వండుకోవడం వంటివి చేస్తే మంచిది.
అలాగే పెసరపప్పు, కందిపప్పు, పచ్చి బఠానీలు, కాలిఫ్లవర్, పనీర్, గుమ్మడి గింజలు, చీజ్, పాలు, పెరుగు వంటి వాటిల్లో కూడా ప్రొటీన్ లభిస్తుంది. వీటిలో కొన్నింటిలో వంద గ్రాములకు 10 గ్రాములు ప్రోటీన్ ఉంటే, మరికొన్నింటిలో 30 గ్రాముల వరకు ప్రోటీన్ లభిస్తుంది. కాబట్టి మాంసాహారం ముట్టని వారు ప్రొటీన్ల కోసం చింతించాల్సిన అవసరం లేదు. మీ రోజువారీ ఆహారంలో పైన చెప్పిన పదార్థాలను భాగం చేసుకోండి. ప్రోటీన్ లోపం తలెత్తకుండా ఉంటుంది.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Also read: తాగిన హ్యాంగోవర్ త్వరగా వదిలించుకోవాలా? వీటితో సాధ్యమే
Also read: పోషకాలతో నిండిన కొర్రల ఎగ్ ఫ్రైడ్ రైస్, మధుమేహులతో పాటూ ఎవరైనా తినొచ్చు
Walking: రోజులో ఒక పావుగంట వెనక్కి నడిస్తే ఈ సమస్యలన్నీ దూరం
Breast Feed: పిల్లలకు పాలివ్వడం వల్ల తల్లికి ఎంత ఆరోగ్యమో - ఆ రోగాలన్నీ దూరం
పాదాలలో ఈ మార్పులు కనిపిస్తే మీకు థైరాయిడ్ వచ్చిందేమో చెక్ కోవాల్సిందే
మూడేళ్లు దాటిన పిల్లల్లో ఈ లక్షణాలు కనిపిస్తే ప్రమాదం - వెంటనే వైద్యుల్ని కలవండి
Cake Recipe: ఇడ్లీ పిండి మిగిలిపోయిందా? ఇలా టేస్టీ కేక్ తయారు చేసేయండి
Harirama Jogaiah Vs Amarnath : నువ్వు రాజకీయాల్లో బచ్చావి, మీరు మానసికంగా బాగుండాలి- హరిరామజోగయ్య వర్సెస్ మంత్రి అమర్నాథ్
Jr NTR: అప్డేట్ ఉంటే భార్య కంటే ముందు మీకే చెప్తా - ఫ్యాన్స్‌కు ఎన్టీఆర్ క్లాస్!
Bandi Sanjay: నాందేడ్ లో బీఆర్‌ఎస్ సభ అట్టర్ ఫ్లాప్, రూ.500 ఇచ్చి జనాన్ని పట్టుకొచ్చి డ్రామాలు: బండి సంజయ్
AP SI Hall Tickets: ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్ష హాల్‌టికెట్లు వచ్చేశాయ్! డైరెక్ట్ లింక్ ఇదే! ఫిబ్రవరి 15 వరకు అందుబాటులో! పరీక్ష ఎప్పుడంటే?