Pressure Cooker : ప్రెజర్ కుక్కర్ పేలిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే
Pressure Cooker Blast : ప్రెజర్ కుక్కర్‌ని ఉపయోగించడంలో మిస్టేక్స్ చేస్తే అవి పేలిపోయే ప్రమాదముంది. కాబట్టి కొన్ని టిప్స్ ఫాలో అయితే ఈ ప్రమాదాల నుంచి తప్పించుకోవచ్చట.

Tips to Avoid Pressure Cooker Explosions : ప్రతి ఇంట్లో ప్రెజర్ కుక్కర్ ఉంటుంది. వివిధ అవసరాలకోసం బ్యాచిలర్స్ నుంచి ఫ్యామిలీ వరకు అందరూ దీనిని వినియోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా త్వరగా ఆహారాన్ని కుక్ చేసుకోవాలనుకున్నప్పుడు కుక్కర్స్ బెస్ట్ ఆప్షన్ అందుకే వీటి వినియోగం ఎక్కువగా ఉంటుంది. అయితే దీనిని సరిగ్గా వినియోగించకుంటే మాత్రం ప్రాణాంతకం అవ్వొచ్చు. ఇటీవల కాలంలో కుక్కర్లు పేలిపోవడం చూస్తూ ఉన్నాము. కుక్కర్ పేలి కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. అందుకే ప్రెజర్ కుక్కర్‌ని వాడేప్పుడు సేఫ్టీ చాలా ముఖ్యం.
కొనేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు
ప్రెజర్ కుక్కర్‌ని కొనేప్పుడే దాని సామర్థ్యం, పరిమాణం, వారెంటీ, వాడుకలో సౌలభ్యం వంటి అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. ఇవి ట్రెడీషనల్ స్టవ్ టాప్‌లు, ఎలక్ట్రిక్ కుక్‌టాప్‌ల కోసం వివిధ మోడల్స్‌లో అందుబాటులో ఉంటాయి. కాబట్టి అన్ని అంశాలు సరి చూసుకొని వీటిని కొనుక్కుంటే మంచిది. మరి దానిని వినియోగించుకునేప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో.. ఎలాంటి టిప్స్ ఫాలో అయితే కుక్కర్ పేలకుండా నిరోధించవచ్చో ఇప్పుడు చూద్దాం.
ప్రమాదాన్ని తగ్గించడానికి.. ప్రెజర్‌ని విడుదల చేసే వాల్వ్‌లు, లాకింగ్ మెకానిజమ్‌లు మంచి కండీషన్లో ఉన్నాయో లేదో కొనేప్పుడే చెక్ చేసుకోవాలి. ప్రెజర్ కుక్కర్‌ని మొదటిసారి వినియోగిస్తుంటే.. మ్యానువల్‌లోని సేఫ్టీ టిప్స్‌ని ఫాలో అవ్వాలి. కుక్కుర్ని కొనే సమయంలో డ్యామేజ్లు, పగుళ్లు ఉన్నాయో లేదో చూసుకోవాలి. సీలింగ్ రింగ్, ప్రెజర్ రిలీజ్ వాల్వ్‌లు శుభ్రంగా, అడ్డంకులు లేకుండా ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. రెగ్యులర్‌గా కుక్కర్‌ను క్లీన్ చేసుకుంటే.. ప్రెజర్ రిలీజ్ వాల్వ్‌లో ఏవి అడ్డుపడకుండా ఉంటాయి.
తగినంత నీరు వేయాలి..
కుక్కుర్ ప్రమాదాల్లో అత్యంత ప్రధానమైన కారణం తగినంత నీరు వేయకపోవడమే. వంటకు తగినంత నీరు పోస్తే.. ప్రెజర్ కుక్కర్ ఒత్తిడి కోసం ఆవిరిపై ఆధారపడుతుంది. మీరు నీరు తగ్గినంత వేయకపోతే ఆవిరి ఉత్పత్తి కాదు. దీనివల్ల కుక్కర్ పేలిపోయే ప్రమాదముంది. కాబట్టి మీరు చేసే వంటకు తగినంతగా.. కుక్కర్‌కి పరిమాణంకి తగ్గట్లు దానిలో నీళ్లు పోయాలి.
ఫిల్ చేయవద్దు..
కొందరు త్వరగా వండుకోవాలనే ఉద్దేశంతో కుక్కర్లో ఓవర్ ఫిల్ చేస్తారు. దీనవల్ల పై భాగంలో తగినంత స్థలం ఉండదు. దీనివల్ల స్టీమ్ విడుదల కాదు. ఇది కుక్కర్‌పై ఒత్తిడి పెంచి.. పేలిపోయే ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి కుక్కర్‌ను ఎప్పుడూ ఓవర్‌ఫిల్ చేయవద్దు.
సమయం..
ప్రతి వంటకు ఓ నిర్థిష్ట సమయం ఉంటుంది. మీకు తెలియకుంటే సెట్టింగ్స్ మ్యానువల్ని చూడొచ్చు. ఆహారాన్ని తయారు చేసే రకాన్ని బట్టి ఈ సమయం మారుతుంది. కాబట్టి విజిల్ రాకుంటే కచ్చితంగా దానిని ఓసారి రీచెక్ చేయండి.
ప్రెజర్
స్టౌవ్ ఆపేసిన వెంటనే కుక్కర్ మూతను ఎప్పుడూ తీయకూడదు. ప్రెజర్ పూర్తిగా బయటకు వచ్చిన తర్వాత అప్పుడు దాని మూత తీయాల్సి ఉంటుంది. ప్రెజర్ పోకుండా మూత తీస్తే కుక్కర్లోని పదార్థాలు ముఖంపైకి వచ్చి గాయాలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
వాల్వ్
బాగానే ఉంది కదా మార్చేది ఏముంది అనుకోకుండా సేఫ్టీ వాల్వ్‌ను రెగ్యులర్‌గా మారుస్తూ ఉండాలి. రిప్లేస్మెంట్ వాల్వ్ ప్రెజర్ కుక్కర్ మోడల్‌కు అనువుగా.. ఉండేలా చూసుకోవాల్సి ఉంటుంది.
ఈ సేఫ్టీ టిప్స్ ఫాలో అవ్వడంతో పాటు.. పిల్లలకు ఈ కుక్కర్‌ను దూరంగా ఉంచడం బెటర్. అలాగే డ్రై ప్లేస్‌లో కుక్కర్‌ని ఉంచితే తుప్పు పట్టకుండా ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకుంటే వంటింట్లో కుక్కర్ ప్రమాదాల్ని ఇట్టే తగ్గించవచ్చు.
Also Read : డబ్బులు, లక్ కలిసి రావాలంటే ఇంట్లో ఈ పెయింటింగ్స్ పెట్టుకోవాలి.. బుద్ధుడి బొమ్మని అక్కడ పెడితే మంచిదట
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

