Potato Peel Benefits : బంగాళదుంపల తొక్కలతో ఎన్ని ప్రయోజనాలో.. ఈ హ్యాక్స్ మీకు తెలుసా?
Potato Peel : కొన్ని కూరగాయలు, పండ్లు తొక్కలు తీసి ఫుడ్‌గా ఉపయోగించుకుంటాము. అయితే అలా తీసేసిన తొక్కలు మనకి కొన్ని ప్రయోజనాలు అందిస్తాయి. అవి ఏమిటంటే..
Kitchen Hacks with Potato Peel : ఆలుగడ్డ కూర వండుకుంటే చాలామంది వాటిపై తొక్కలను తీసేసి కర్రీ చేసుకుంటారు. లేదంటే వాటిని ఉడకబెట్టి తొక్కలు తీసి ఫ్రైలు చేసుకుంటారు. కానీ బంగాళ దుంపలను బాగా కడిగి కర్రీలో తొక్కతో పాటు వేసుకున్నా కూడా చాలా మంచిది. లేదు మేము తొక్క తీసేసి మాత్రం బంగాళా దుంపలు ఉపయోగిస్తాము అనుకుంటున్నారా? అయితే అది కూడా మంచిదే. ఎందుకంటే మీరు ఆలు గడ్డల తొక్కలతో మీరు ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.
బంగాళాదుంపల తొక్కల్లో పోషకాలు, ఖనిజాలు, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. వాటిలోని పోషక విలువలకు ఇవి ప్రధాన కారణం. అందుకే బంగాళా దుంపల తొక్కలను చర్మ, సౌందర్య సాధానాల్లో వినియోగిస్తారు. వీటిని మీరు వివిధ రకాలుగా, వివిధ అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు. ఈ తొక్కలతో ఎలాంటి ప్రయోజనాలు పొందవచ్చో.. ఎలాంటి హ్యాక్స్ చేయవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
కాలిన గాయాలకు చికిత్స
బంగాళదుంప తొక్కల్లో యాంటీ బాక్టీరియల్ ఏజెంట్ ఉంటుంది. ఇది చిన్నపాటి కాలిన గాయాలకు చికిత్సను అందిస్తుంది. వడదెబ్బ వంటి వాటికి సహజమైన నివారణగా బంగాళా దుంప పని చేస్తుంది. వడదెబ్బవల్ల ప్రభావితమైన చర్మాన్ని ఏకకాలంలో తేమగా మార్చగలిగే యాంటీ బ్యాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. కాలిన గాయాల నుంచి తక్షణమే ఉపశమనం అందిస్తుంది.
స్కిన్ కేర్
మొటిమలు సమస్య ఇబ్బంది పెడుతుందా? అయితే మీరు స్కిన్‌కి బంగాళా దుంపల తొక్కలను అప్లై చేయండి. డార్క్ సర్కిల్స్‌ను తగ్గించడంలో కూడా మంచి ఫలితాలు అందిస్తుంది. బంగాళా దుంపల తొక్కలు, రసంతో మీరు మీ ముఖానికి ఎన్నో ప్రయోజనాలు అందిచవచ్చు. కెమికల్స్ లేని సహజమైన నివారణులు కావాలనుకుంటే మీరు వీటిని చర్మానికి అప్పై చేయవచ్చు. ఇది మీకు ఆరోగ్యకరమైన, మెరిసే చర్మాన్ని అందిస్తుంది. అందుకే వీటిని ఎప్పటినుంచో సౌందర్య సాధనాల్లో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా నేరుగా కూడా దీనిని ముఖానికి అప్లై చేయడం వల్ల మెరుగైన ఫలితాలు పొందవచ్చు.
వంటపాత్రలకై..
బంగాళాదుంపల తొక్కల్లోని కాస్ట్ ఐరన్ నాన్‌స్టిక్ లక్షణాలను మెరుగుపరుస్తాయి. అంతేకాకుండా ఐరన్ పాత్రల్లో వండితే అవి తుప్పు పట్టకుండా రక్షణ కవచం ఏర్పరుస్తాయి. బంగాళా దుంపల పీల్స్‌లో ఉండే స్టార్చ్ సహజమైన గ్రీజుగా పనిచేస్తుంది. వంట సామాను ఉపరితలంపై రక్షిత పూతను ఏర్పరుస్తుంది. అంతేకాకుండా బంగాళ దుంపలు వండిన గిన్నెలను శుభ్రం చేయడం కూడా చాలా తేలికగా ఉంటుంది.
కంపోస్ట్కై..
మీరు ఇంట్లో మొక్కలను పెంచుతున్నారా? అయితే మీరు బంగాళాదుంపల తొక్కలను కంపోస్ట్‌గా ఉపయోగించుకోవచ్చు. భాస్వారం, పొటాషియం, నత్రజని వంటి ముఖ్యమైన పోషకాలతో నిండిన ఈ తొక్కలు నేల నాణ్యతను మెరుగుపరుస్తాయి. తద్వారా మొక్కలో ఎదుగుదల బాగా ఉంటుంది. మీ కంపోస్ట్ రోటీన్లో దీనిని భాగం చేయడం వల్ల వ్యర్థాలు కూడా తగ్గుతాయి. మొక్కలకు మంచి పోషకాలు అందుతాయి. గులాబీ చెట్లకు దీనిని కంపోస్ట్ వాడితే పూలు బాగా పూస్తాయని చెప్తారు. అంతేకాకుండా మీరు ఇంటిలో ఏవైనా కూరగాయలు పెంచుకుంటే ఆలుగడ్డలతో తయారు చేసిన కంపోస్ట్ వాడితే మంచి ప్రయోజనాలు పొందుతారు.
Also Read : బరువు తగ్గేందుకు రోజూ రోజ్ టీ తాగాలట.. తయారీ రెసిపీ ఇదే