థ్రిల్లింగ్ వీడియో, గాల్లోనే విమానాలు మార్చుకోడానికి ప్రయత్నించిన పైలట్లు, చూస్తుండగానే ప్రమాదం
ఈ వీడియో చూస్తే తప్పకుండా మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఇంతకీ ఒకరి విమానంలోకి మరొకరు వెళ్లేందుకు ప్రయత్నించిన ఆ పైలట్లు సేఫా, కాదా?
ఇద్దరు పైలెట్లు చరిత్రలో ఎవరూ చేయని సాహసానికి ప్రయత్నించారు. విమానాలు గాల్లో ఉండగానే.. ఒకరి విమానం నుంచి మరొకరి విమానంలోకి మారాలని అనుకున్నారు. అంటే, తమ విమానాలను మార్చుకోవాలని అనుకున్నారు. అయితే, తొలి ప్రయత్నమే బెడిసి కొట్టింది. కేవలం ఒక పైలట్ మాత్రమే ఇంకొక విమానంలోకి విజయవంతంగా ప్రవేశించగలిగాడు. రెండో పైలట్ విఫలమయ్యాడు. దీంతో విమానం కొద్ది దూరం ప్రయాణించి కూలిపోయింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
పైలెట్స్ కజిన్స్ ల్యూక్ ఐకిన్స్, ఆండీ ఫారింగ్‌టన్ మొదటిసారిగా ఈ ప్రయత్నం చేశారు. కేవలం ఐకిన్స్ మాత్రమే ఆండీ విమానంలోకి ప్రవేశించి.. అరిజోనా ఎడారిలో సురక్షితంగా ల్యాండ్ చేశాడు. అయితే ఫారింగ్‌టన్ మాత్రం ఐకిన్స్ విమానంలోకి ప్రవేశించలేకపోయాడు. అయితే, పారాచూట్ సాయంతో సేఫ్‌గా కిందకి దిగాడు.
Also Read: జాగ్రత్త, అంగస్తంభన కోసం ఇలా చేస్తే కళ్లు పోతాయ్! తాజా అధ్యయనం వెల్లడి
ఐకిన్స్, ఫారింగ్టన్‌లకు విమానం నడపడంలో మంచి అనుభవం ఉంది. వీరు మంచి అనుభవం కలిగిన స్కైడైవర్లు కూడా. ఐకిన్స్ ఇప్పటివరకు విమానం నుంచి 21 వేల జంప్‌లు చేశాడు. 8,750 కమర్షియల్ ఫ్లయింగ్ అవర్స్‌తో ఈవెంట్‌లోకి ప్రవేశించాడు. ఫారింగ్టన్ 27 వేల జంప్‌లు.. 6,000 కమర్షియల్ ఫ్లయింగ్ అవర్స్‌ను కలిగి ఉన్నాడు. వీరిద్దరు ఏడాది నుంచి విమానాలను మారేందుకు ప్రాక్టీస్ చేస్తు్న్నారు. ఒకే ఎత్తులో ఎగురుతూ ఫైట్లు మారాలనేది వీరి ప్లాన్. కానీ, గాల్లోకి ఎగిరిన తర్వాత వారి ప్లాన్ వర్కవుట్ కాలేదు.
Also Read: ఫోన్ మాట్లాడుతూ లోకం మరిచింది, రెప్పపాటులో ప్రమాదం - ఇదిగో వీడియో
అయితే, ఐకిన్స్ విజయవంతంగా మరో విమానంలోకి ప్రవేశించగలడంతో మరోసారి ఇది తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకం తమలో కలిగిందని నిర్వాహకులు అంటున్నారు. ఫారింగ్టన్ ఉపయోగించిన విమానం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. ఇద్దరు సురక్షితంగా కిందికి చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. వీరు ఒకరి విమానంలోకి మరొకరు మారేందుకు చేసిన ప్రయత్నం చూస్తే తప్పకుండా మీ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ఆ వీడియోను ఇక్కడ చూడండి.
వీడియో:
This #RedBull #PlaneSwap in Arizona was crazy! Didn't go as planned but luckily everyone is alright! pic.twitter.com/f9cpRclYtT
— Aaron Tevis (@AaronTevis) April 25, 2022