Pentagon Documents: గ్రహాంతరవాసులు ఘటికులే - భూమిపై లైంగిక సంబంధాలు, ఒకరు గర్భవతి కూడా, అమెరికా వెల్లడి!
గ్రహాంతరవాసుల కోసం శాస్త్రవేత్తలు వేరే గ్రహాల్లో అన్వేషిస్తుంటే.. వాళ్లు మాత్రం కూల్‌గా భూమి మీదకు వచ్చి మనుషులలో లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారట.
Sexual Encounters Between Aliens and Humans | మన విశ్వంలో మానవజాతి ఒక్కటేనా? ఇంకా ఎవరైనా జీవిస్తున్నారా? మనకన్నా మేధావులు వేరే గ్రహాల్లో జీవిస్తున్నారా? అనే సందేహాలతో శాస్త్రవేత్తలు కోట్లు వెచ్చిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఇప్పటికే చాలాసార్లు గ్రహాంతరవాసులు భూమిని సందర్శించారని, వారి UFO (గ్రహాంతరవాసుల వాహనం) వల్ల కొందరికి గాయాలయ్యాయని అమెరికాకు చెందిన పెంటాగన్ డాక్యుమెంట్లు పేర్కొన్నాయి. మరింత చిత్రమైన విషయం ఏమిటంటే.. UFOల వల్ల మహిళలు లైంగిక దాడికి గురయ్యారని పేర్కొన్నారు. ఓ మహిళైతే ఏకంగా తాను గర్భవతిని కూడా అయ్యానని చెప్పిందని ఆ డాక్యుమెంట్లలో ఉంది.
‘ది సన్’ అనే దినపత్రిక ఇటీవల అమెరికా నుంచి ఈ పత్రాలను సేకరించింది. అందులో పేర్కొన్న కొన్ని ఆశ్చర్యకర విషయాలను వెల్లడించింది. అయితే, ఈ డాక్యుమెంట్లను సాదాసీదా సంస్థ నుంచి సేకరించారని అనుకుంటే పొరపాటే. సమాచార హక్కు చట్టం కింద డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (DIA) స్వయంగా ఈ డాక్యుమెంట్లను ఇవ్వడం గమనార్హం.
Also Read: నగ్న సందేశం, అంతరిక్షంలోకి ‘న్యూడ్’ చిత్రాలను పంపిస్తున్న నాసా, ఎందుకో తెలుసా?
‘పెంటగాన్ నివేదిక’గా పేర్కొంటున్న ఈ డాక్యుమెంట్లలో అనేక చిత్రవిచిత్ర వాదనలు ఉన్నాయి. UFOలు మనుషులను అపహరించాయని, మహిళల గర్భధారణకు కారణమయ్యాయని, లైంగిక చర్యలు, టెలిపతి, టెలిపోర్టేషన్ వంటివి చోటుచేసుకున్నాయని అందులో పేర్కొన్నారు. Anomalous Acute And Subacute Field Effects on Human and Biological Tissues అనే పేరుతో ఈ రిపోర్టును రూపొందించారు. ఇందులో UFOలు, మానవుల మధ్య ఐదు సెక్సువల్ ఎన్‌కౌంటర్లు(లైంగిక సంబంధాలు) ఉన్నాయని పేర్కొన్నారు. UFOలను ప్రత్యక్షంగా చూసేవాళ్లు గాయపడిన ఘటనలు ఉన్నాయని తెలిపారు. UFOలోని ప్రొపల్షన్ సిస్టమ్స్ నుంచి విద్యుదయస్కాంత వికిరణం వల్ల ఈ గాయాలు ఏర్పడినట్లు వెల్లడించారు.
Also Read: వేసవిలో వెచ్చని కోరికలు, అక్రమ సంబంధాలన్నీ ఈ సీజన్లోనే ఎక్కువట, ఎందుకంటే..
UFOను నేరుగా చూసేవారిలో రేడియేషన్ గాయాలు, మెదడు సమస్యలు, నరాలు దెబ్బతినడం వంటి సమస్యలు ఏర్పడతాయని నివేదికలో తెలిపారు. ‘‘మా వద్ద అన్ని ఆధునాతన వ్యవస్థలు ఉన్నాయి. జరిగిన సంఘటనలు లేదా ప్రమాదాలను నివేదికలో కచ్చితంగా నివేదించాం. మెడికల్ డేటాను కూడా సేకరించాం. కొన్ని విచిత్రమైన ఘటనల తర్వాత మానవులు గాయపడినట్లుగా మెడికల్ ఫైల్‌లో 42 కేసులు నమోదయ్యాయి. అయితే, ఇలాంటి కేసులు దాదాపు 300 వరకు ఉన్నాయని, వాటిని నివేదికలో ప్రచురించలేదు’’అని పేర్కొన్నారు. 2004లో అమెరికా నావికా దళం సముద్రంలో రిహార్సల్స్ చేస్తున్న సమయంలో.. వారికి ఒక UFO ప్రత్యక్షమైంది. ఈ ఘటన ఆధారంగా హాలీవుడ్‌లో డాక్యుమెంటరీ చిత్రనిర్మాత డేవ్ సి. బీటీ ‘ది నిమిట్జ్ ఎన్‌కౌంటర్స్’ను నిర్మించారు. అయితే, ఆ డాక్యుమెంటరీల్లో పేర్కొన్న అంశాల్లో.. UFOల వల్ల బాధితులైన వ్యక్తుల వివరాలేవీ పొందుపరిచలేదు. ఈ నేపథ్యం UFO, గ్రహాంతరవాసుల అంశాలు ఇప్పటికీ మిస్టరీనే. కానీ, మనుషులతో అవి లైంగిక సంబంధాలు పెట్టుకున్నాయనే సమాచారాన్ని నమ్మడం కొంచెం కష్టమే కదూ!