News
News
X

బఠాణీలు పక్కన పెట్టేస్తున్నారా? మీరు ఏం మిస్సవుతున్నారో తెలిస్తే ఆశ్చర్యపోతారు

బఠాణీ తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని న్యూట్రిషనిస్ట్ ల సలహా. ఎందుకు మంచిదో? ఎలా మంచిదో? ఇక్కడ తెలుసుకుందాం.

FOLLOW US: 

పన్నీర్, మటర్ మసాలాలో బఠాణీలు చికాకు కలిగిస్తున్నాయా? వెజ్ పులావులో బఠాణీలు తినడానికి ఇబ్బందిగా ఉందా? వాటిని తీసి పక్కన పెట్టేస్తున్నారా? అయితే, మీరు ఆరోగ్యానికి అవసరమైన పోషకాలను పక్కన పెడుతున్నట్లే. 

కానీ.. ఇలా బఠాణీల విషయంలో విసుగు వద్దు అని నిపుణులు సలహా ఇస్తున్నారు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ. ఎలా తిన్నా ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు. కాస్త కడుపునిండుగా ఉన్న ఫీలింగ్ ను ఇచ్చే ఈ గింజలను పోషకాల పవర్ హౌజులుగా అభివర్ణిస్తున్నారు. ఆరోగ్యమే కాదు అందం కూడా అని అంటున్నారు. బఠాణీలు ఎక్కువగా తీసుకునే వారిలో ఏజింగ్ ప్రాసెస్ నెమ్మదిస్తుందట. మరి వీటిలోని పోషకాల గురించి కాస్త వివరంగా ఇక్కడ తెలుసుకుందాం.

సంవత్సరం పొడుగునా లభించే కూరగాయల్లో ఒకటి పచ్చి బఠాణీ. లెగ్యూమ్ జాతికి చెందిన ఈ వెజిటెబుల్ సోయబీన్, చిక్కుడు వంటి మంచి ప్రొటీన్ కలిగిన ఆహార పదార్థాలు. వీటిని రకరకాలుగా వండుకొని తింటుంటారు. అయితే కొంత మంది భోజనంలో కనిపించిన బఠాణి గింజలను ఏరేస్తూ ఉంటారు . కానీ ఇలా చెయ్యొద్దని నిపుణులు సూచిస్తున్నారు.

ఆకుపచ్చని రత్నం వంటి ఈ వెజిటెబుల్ ను అంత తేలికగా తీసుకోకూడదు. ఇది పోషకాల పవర్ హౌస్ వంటిది. దీనిలో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియెంట్స్ మాత్రమే కాదు, కొమెస్ట్రాల్ అనే క్యాన్సర్ ప్రెటెక్టివ్ న్యూట్రియెంట్ కూడా ఉంటుంది. వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసే విటమిన్ సి, ఇ, జింక్, క్యాటెకిన్, ఎపీ క్యాటకిన్ వంటి యాంటీఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. కాబట్టి మంచి క్యాన్సర్ నివారణి కూడా. శీతాకాలంలో పుష్కలంగా తాజాగా లభిస్తాయి. కానీ సంవత్సరం పొడవునా ఇవి డ్రై ఫాంలో ఫ్రోజెన్ ఫాం లోనూ దొరుకుతాయి. కాబట్టి సంవత్సరమంతా వీటిని తీసుకునే సౌలభ్యం ఉంటుంది. కాబట్టి ఏ కాలమైనా సరే వీటిని ఆహారంలో భాగం చేసుకోవడం మరవద్దు.

News Reels

బాఠాణీల వల్ల లాభాలు

  • బఠాణీల గ్లైసిమిక్ ఇండెక్స్ చాలా తక్కువని నిపుణులు అంటున్నారు. ఇవి ప్రతి రోజు ఆహారంలో తీసుకుంటే డయాబెటిస్ తో బాధపడేవారు షుగర్ లెవల్స్ ని అదుపులో ఉంచుకోవచ్చు. అంతేకాదు వీటిలో ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల డయాబెటీస్ కి చాలా మంచి ఆహారం. అంతేకాదు వీటిలో ఉండే క్యాటకిన్, ఎపీక్యాటకిన్, కెరొటోనాయిడ్, ఆల్ఫాకెరొటినాయిడ్ యాంటి ఏజింగ్ ఎఫెక్ట్స్ కూడా కలిగి ఉంటాయని న్యూట్రిషనిస్టులు అంటున్నారు.
  • బఠాణీల్లో ఉండే విటమిన్ బీ6, సి, ఫోలిక్ ఆసిడ్ స్కిన్ ఫ్రెండ్లీ న్యూట్రియెంట్స్. ఇవి శరీరంలో జరిగే ప్రీరాడికల్ డామేజి నుంచి కూడా శరీరాన్ని రక్షిస్తాయి. చర్మంలో కొల్లాజిన్, ఎలాస్టిన్ ప్రొటీన్ల నష్టాన్ని కూడా నివారిస్తాయి.
  • బఠాణీల ద్వారా చాలా ప్రొటీన్ అందుతుంది శరీరానికి. ఇవి తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్ కలిగి త్వరగా ఆకలి వేయదు. అందువల్ల తక్కువ మోతాదులో ఆహారం తీసుకుంటాం. ఫలితంగా బరువు కూడా తగ్గవచ్చు. శాకాహారులకు చాలా మంచి ప్రొటీన్ కలిగి ఆహారంగా బఠాణీలను చెప్పుకోవచ్చు.
  • ఇందులో ఉండే నియాసిన్ ట్రైగ్లిజరాయిడ్స్ శరీరానికి అవసరమైన మంచి కొవ్వులను పెంచుతుంది. 

Also read: బ్యూటీ పార్లర్‌కు వెళుతున్నారా? ‘బ్యూటీ పార్లర్ స్ట్రోక్ సిండ్రోమ్’ గురించి తెలుసుకుని వెళ్లండి

Published at : 07 Nov 2022 11:00 AM (IST) Tags: green peas matar veg protein phyto nutrients

సంబంధిత కథనాలు

Success of Parachute Oil: ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సెస్‌కు ఎలుకలు కారణమా ! దాని వెనుక అంత కథ ఉందా

Success of Parachute Oil: ప్యారాచూట్‌ ఆయిల్‌ సక్సెస్‌కు ఎలుకలు కారణమా ! దాని వెనుక అంత కథ ఉందా

Weight Loss: బరువు తగ్గి, సన్నబడేందుకు ఈ డైట్ పాటిస్తున్నారా? మీరు డేంజర్లో పడినట్లే!

Weight Loss: బరువు తగ్గి, సన్నబడేందుకు ఈ డైట్ పాటిస్తున్నారా? మీరు డేంజర్లో పడినట్లే!

చర్మం మీద దద్దుర్లా? ఈ ఆయుర్వేద చిట్కాలు ఒకసారి ట్రై చేసి చూడండి

చర్మం మీద దద్దుర్లా? ఈ ఆయుర్వేద చిట్కాలు ఒకసారి ట్రై చేసి చూడండి

Skin Disease: మీ మంచం మీద బెడ్‌షీట్స్‌ను ఉతకడం లేదా? జాగ్రత్త, ఈ భయానక వ్యాధి సోకవచ్చు!

Skin Disease: మీ మంచం మీద బెడ్‌షీట్స్‌ను ఉతకడం లేదా? జాగ్రత్త, ఈ భయానక వ్యాధి సోకవచ్చు!

ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే, ‘ఐరన్’ లోపం ఉన్నట్లే!

ఈ లక్షణాలు మీలో కనిపిస్తున్నాయా? అయితే, ‘ఐరన్’ లోపం ఉన్నట్లే!

టాప్ స్టోరీస్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

ఏప్రిల్ నుంచి విశాఖ కేంద్రంగా ఏపీ సీఎం జగన్ పరిపాలన - మంత్రి గుడివాడ అమర్నాథ్

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

Minister Ambati Rambabu : పవన్ సినిమాల్లోనే హీరో, రాజకీయాల్లో పెద్ద జోకర్ - మంత్రి అంబటి రాంబాబు

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు - విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

IT Politics : ఐటీ ఎదుట హాజరైన మల్లారెడ్డి కుటుంబీకులు -  విచారణ తర్వాత ఫుల్ కాన్ఫిడెన్స్ !

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!

TS New DGP : నూతన డీజీపీ నియామకంపై తెలంగాణ సర్కార్ కసరత్తు, రేసులో ఆ ముగ్గురు!