Healthy Lifestyle: ఫిట్‌గా ఉండాలనుకుంటున్నారా? మీ డైట్ ప్లాన్ ఇలా చేసుకోండి
ఒంటరిగా ఉంటున్నప్పుడు ఏం తింటున్నామో ఏం తాగుతున్నామో అనేది అసలు పట్టించుకోరు. ఫలితంగా అనారోగ్యం కమ్మేస్తుంది.
ఉద్యోగం కోసం వేరే ప్రాంతాలకు వెళ్ళి ఒంటరిగా రూమ్ తీసుకుని జీవించడం చాలా కష్టం. ఇంటి దగ్గర అమ్మ వండి పెడుతుంటే హాయిగా లాగించేస్తూ ఉంటారు. కానీ ఒక్కరిగా ఉన్నప్పుడు మూడు పూటలా వండుకోవాలంటే చాలా మందికి బద్ధకం వచ్చేస్తుంది. ఏదో ఒక పూట తినడం ఆ తర్వాత బయట చెత్త ఏదో ఒకటి తినేసి కడుపు నింపుకోవడం చేస్తారు. కిరాణా షాపింగ్ నుంచి భోజనం ప్రిపేర్ చేసుకునే వరకు అన్నీ పనులు మీరే చేసుకోవాలి. వాటిని ఎక్కడ చేస్తాములే అని బద్ధకించేస్తారు. దీని వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. అలా జరగకుండా మీరు ఆరోగ్యంగా ఉండాలంటే మీ ఒంటరి జీవితం ఫిట్ నెస్ తో సాగిపోవాలంటే ఈ టిప్స్ పాటించండి.
అల్పాహారం ఇలా
కష్టంగా అనిపించే టిఫిన్ మీద ఆధారపడకుండా సింపుల్ గా ఆరోగ్యాన్ని ఇచ్చే అల్పాహారం తీసుకునేందుకు ప్రయత్నించాలి. రాత్రిపూట ఓట్స్ నానబెట్టుకోవడం, గ్రీక్ యోగర్ట్ పర్పైత లేదా అవకాడో పీనట్ బటర్ టోస్ట్ చేసుకోవచ్చు. ఈ టోస్ట్ రోజువారీ ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, పిండి పదార్థాలని శరీరానికి అందిస్తుంది. అది మాత్రమే కాదు చాక్లెట్ వేరుశెనగ బటర్ తో స్మూతీ కూడా తయారు చేసుకోవచ్చు.
భోజనం ముందే ప్లాన్ చేసుకోవాలి
ఫిట్ గా ఉండటం కోసం ఆరోగ్యకరమైన భోజనం ముందే ప్లాన్ చేసుకోవాలి. వారంతాల్లో బిర్యానిలు లాగించేయడం వంటివి అలవాటు చేసుకోవడం తగ్గించాలి. వారంలో మీకు టైమ్ ఉన్నప్పుడు పోషకాలు నిండిన ఆహారం సిద్ధం చేసుకునేందుకు ప్రయత్నించాలి. ఏరోజు ఏం తినాలి అనేది ముందుగా ప్లాన్ చేసి పెట్టుకుంటే వాటికి సంబంధించినవి మీ దగ్గర ఉంటాయి. అనారోగ్యకరమైన ఆహార ఎంపికలు నివారించడం సులభం అవుతుంది. కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా ఉపయోగించాలి. ఆకుకూరతో పప్పు చేసుకుని తింటే మంచిది.
తెలివిగా షాపింగ్ చేయండి
ఒంటరిగా ఉన్నప్పుడు షాపింగ్ కి వెళ్తే ఖాళీ టైమ్ లో చిప్స్ తినడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అందుకే షాపింగ్ కి వెళ్ళినప్పుడు తెలివిగా వ్యవహరించాలి. అనారోగ్యకరమైన ఆహార పదార్థాల కొనుగోలు నివారించాలి. ఇంట్లోనే మీకేం కావాలో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. తాజా ఉత్పత్తులు, లీన్ ప్రోటీన్లు, పాల ఉత్పత్తులు ఉండే స్టోర్ కి వెళ్తే మంచిది. ప్రాసెస్ చేసిన ఆహారాలు తీసుకునే ఆలోచన నుంచి బయట పడేందుకు ట్రై చేయాలి.
పరిమాణం మీద దృష్టి పెట్టాలి
అతిగా తినకుండా ఉండేందుకు మీరు తీసుకునే భోజన పరిమాణం మీద శ్రద్ధ పెట్టాలి. చిన్న ప్లేట్, పాత్రలు ఉపయోగించడం మంచిది. పెద్ద ప్లేట్ వినియోగిస్తుంటే దాని నిండుగా ఆహారం పెట్టేసుకుని ఫోన్ ముందు పెట్టుకున్నారంటే ఎంత తింటున్నారో కూడా తెలియకుండా తినేస్తు ఉంటారు. అందుకే తినేటప్పుడు ఫోన్, టీవీ వంటి వాటికి దూరంగా ఉండాలి. చిన్న ప్లేట్ లో ఆహారం మీకు సరిపడినంత పెట్టుకుని తినాలి. అన్నం బాగా నమిలి తినాలి.
హైడ్రేట్ గా ఉండాలి
మొత్తం ఆరోగ్యం కాపాడుకోవాలంటే శరీరం హైదరత గా ఉండాలి. ఇది ఆకలిని కూడా నియంత్రించడంలో సహాయపడుతుంది. కొన్ని సార్లు దాహంగా అనిపిస్తే ఆకలిగా అర్థం చేసుకుంటారు. అందుకే తగినంత నీరు తాగుతూ ఉండాలి. మీరు పని చేసే పక్కన బాటిల్ ఉంచుకుని నీరు తాగుతూ ఉండాలి. హెర్బల్ టీ, ఇన్ఫ్యూజ్డ్ వాటర్ మంచి ఎంపికలు.
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.
Also Read: ఇత్తడి పాత్రల క్లీనింగ్ కి ఈ టిప్స్ పాటిస్తే మిలమిలా మెరిసిపోతాయి!