By: ABP Desam | Updated at : 27 Jan 2022 08:55 AM (IST)
Edited By: harithac
(Image credit: Pixabay)
చాలామందికి కాఫీ ఒక ఇంధనంలాంటివి. అది పొట్టలో పడిందో చురుగ్గా, ఉత్సాహంగా మారిపోతారు. ముఖ్యంగా రాత్రి పూట మెలకువగా ఉండాలనుకునేవారికి ఇది వరమే. పరీక్షల సమయంలో రాత్రి వరకు చదువుకునేందుకు విద్యార్థులు కాఫీ తాగుతూ ఉంటారు. ఎందుకంటే కాఫీ, టీలు మేల్కోనే సామర్థ్యాన్ని ఇస్తాయి. అలాగని నిత్యం వాటిని తాగడం కూడా మంచిది కాదు. కాఫీ అధికంగా తీసుకోవడం వల్ల ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ఇది మీకు చక్కెరతో పాటూ కెఫీన్‌ను అధికంగా అందిస్తుంది. కాబట్టి కాఫీకి కొన్ని ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. వాటిని తాగడం వల్ల కూడా మీరు రాత్రిపూట మెలకువగా ఉండొచ్చు.
ఆపిల్ సిడర్ వెనిగర్
ఇది తక్కువ కేలరీల పానీయం. ఇది మిమ్మల్ని మేల్కొని ఉంచడమే కాదు, బరువు తగ్గడానికి కూడా సాయపడుతుంది. దీన్ని పులియబెట్టిన ఆపిల్స్ తో చేస్తారు. చక్కెర కలపరు. ఇది మధుమేహరోగులకు సహాయపడే ఎసిటిక్ యాసిడ్ అనే సమ్మేళనాన్ని కలిగి ఉంటుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో ఒక టీ స్పూను ఆసిల్ సిడర్ వెనిగర్ కలపాలి, కావాలంటే అరస్పూను తేనె కలుపుకోవచ్చు.
మచ్చా టీ
మచా పౌడర్ మార్కెట్ల లభిస్తుంది. ఇది మచా అని పిలిచే మొక్క వేరులతో తయారుచేస్తారు. అందుకే ఇది ఆకుపచ్చరంగులో ఉంటుంది. ఇందులో కూడా కెఫీన్ ఉంటుంది కానీ, కాఫీలో ఉన్నంత ఉండదు. వేడి నీటిలో 1 లేదా రెండు స్పూన్ల మచ్చా పొడి కలుపుకుని వేడివేడిగా తాగాలి.
హాట్ చాకోలెట్
ఇది పిల్లలకు పెద్దలకు కూడా నచ్చే పానీయం. ఇందులో కెఫీన్ ఉండదు. ఇది తాగితే మీకు ఉత్సాహంగా అనిపిస్తుంది. కాబట్టి నిద్ర రాదు. రాత్రి పూట వెచ్చని హాట్ చాకోలెట్ తాగితే ఆ కిక్కే వేరు.
స్మూతీలు
రాత్రిపూట తేలిక పాటి ఆహారం తీసుకోవాలనుకుంటున్నారా? అయితే మీకు స్మూతీ మంచి ప్రత్యామ్నాయం. ఇది సంపూర్ణ ఆహారమని చెప్పచ్చు. పాలు, పెరుగు కలుపుకుని కూడా స్మూతీలను తయారు చేసుకోవచ్చు. పాలు, అరటిపండు, పీనట్ బటర్, బెర్రీలు, యాపిల్స్... ఇలా రకరకాల స్మూతీలు చేసుకుని తాగచ్చు. ఇవి మిమ్మల్ని ఎక్కువసేపు మెలకువగా ఉంచుతాయి.
గోల్డెన్ మిల్క్
ఇది ఒక భారతీయ సంప్రదాయ పానీయం. తక్షణ శక్తిని అందించడంలో ముందుంటుంది. రాత్రిపూట తాగితే ఎక్కువ సేపు మెలకువగా ఉంచుతుంది. పాలల్లో పసుపు కలుపుకుని గోరువెచ్చగా తాగాలి. పసుపు అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఈ గోల్డెన్ మిల్క్‌లో దాల్చిన చెక్క, అల్లం, బెల్లం, నల్ల మిరియాల పొడిని కూడా వేసుకుని తాగొచ్చు. ఇది ఎంతో ఆరోగ్యకరం కూడా.
గమనిక:ఈ కథనంలో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు. ఏదైనా వ్యాయామం లేదా డైట్‌లో మార్పులు చేయాలనుకుంటే తప్పకుండా మీరు వైద్యుడు, డైటీషియన్‌ను సంప్రదించాలి.
Healthy Fats: హెల్తీగా ఉండాలంటే ఈ మూడు కొవ్వులున్న ఆహారాలు తీసుకోవాల్సిందే
Egg Freezing: తల్లి కావడానికి ప్రియాంక చోప్రా పాటించిన ‘ఎగ్ ఫ్రీజింగ్’ పద్ధతి గురించి మీకు తెలుసా?
ఏడాదిలో 8428 ప్లేట్ల ఆర్డర్- ఆశ్చర్యపరుస్తున్న హైదరాబాదీ ఇడ్లీ ప్రేమ
Heart Health: మీ గుండెని కాపాడుకోవాలంటే వీటిని దూరం పెట్టాల్సిందే
Summer Drinks: వేసవి తాపాన్ని తగ్గించి మిమ్మల్ని చల్లగా ఉంచే సూపర్ ఫుడ్స్ ఇవే
Hyderabad Metro Charges : హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్, రద్దీ సమయాల్లో రాయితీ ఎత్తివేత!
GT vs CSK: గుజరాత్, చెన్నై ఏ ఆటగాళ్లతో బరిలోకి దిగుతాయి - మొదటి మ్యాచ్‌కు మరికొద్ది గంటలే!
Tenali Council Fight : తెనాలి మున్సిపల్ కౌన్సిల్ లో రసాభాస, చొక్కాలు చిరిగేలా కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కౌన్సిలర్లు
Naga Chaitanya : చైతూను కావాలని టార్గెట్ చేశారా? డివోర్స్, డేటింగ్ రూమర్స్ - ప్లాన్ ప్రకారమే ప్రతిదీ తెరపైకి?