అన్వేషించండి

Munnar to Alleppey Road Trip : మున్నార్​ టూ అలెప్పీ రోడ్ ట్రిప్.. పార్టనర్​తో వెళ్తే జర్నీ అంతా కిక్ ప్రాప్తిరస్తు, డిటైల్స్ ఇవే

Best Road Trip :పార్టనర్​తో కలిసి లాంగ్​ డ్రైవ్​కి వెళ్లాలనుకునేవారు.. మున్నార్​ టూ అలెప్పీ రోడ్​ ట్రిప్​ అస్సలు మిస్ చేయవద్దు. ఈ ట్రిప్ ఎందుకు బెస్టో ఇప్పుడు చూసేద్దాం.

Munnar to Alleppey Road Trip Guide : కేరళ (God's Own Country). బడ్జెట్ ఫ్రెండ్లీ ట్రిప్​కోసం చూసేవాళ్లు, ప్రకృతిని ఎంజాయ్ చేయాలనుకునేవారి లిస్ట్​లో ఇది టాప్​లో ఉంటుంది. అక్కడి అందాలు మనసును కట్టిపడేస్తాయి. మీరు కేరళకి ట్రిప్​కి వెళ్లాలనుకుంటే కచ్చితంగా మీరు మున్నార్​ టూ అలెప్పీ రోడ్​ ట్రిప్​ని ట్రై చేయాల్సిందే. ముఖ్యంగా పార్టనర్​తో కలిసి మంచి రోడ్​ ట్రిప్​ ఎక్స్​పీరియన్స్ చేయాలనుకునేవారు దీనిని అస్సలు మిస్​ కాకూడదంటున్నారు.

మున్నార్​ నుంచి అలెప్పీకి రోడ్​ ట్రిప్​ వెళ్తే.. మీరు ప్రకృతి అందాలను, మంచి ఎక్స్​పీరియన్స్​ను పొందవచ్చు. ముఖ్యంగా సెప్టెంబర్​ నుంచి ఫిబ్రవరి మధ్యలో ఈ ట్రిప్​ బెస్ట్. మరి ఈ ట్రిప్​కి ఎలా వెళ్లాలి? ఎంత దూరం ఉంటుంది? రూట్, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, తెలుసుకోవాల్సిన ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దూరమెంత అంటే.. 

మున్నార్​ నుంచి అలెప్పీకి 180 కిలోమీటర్లు దూరం ఉంటుంది. ట్రాఫిక్ లేకుంటే మీరు 5 నుంచి 6 గంటలు జర్నీ చేసి అలెప్పీకి చేరుకోవచ్చు. 

రూట్ ఇదే.. 

మున్నార్​ నుంచి అలెప్పీకి రోడ్​ ట్రిప్​కి వెళ్లాలంటే మున్నార్ నుంచి అడిమలి(Adimaly) వెళ్లాలి. అక్కడి నుంచి కొత్తమంగళం (Kothamangalam).. అటు నుంచి కొచ్చి(Kochi) అనంతరం అలెప్పీ చేరుకుంటారు. 

ఈ రోడ్ ట్రిప్​లో చూడాల్సిన ప్రదేశాలివే.. 

రోడ్ ట్రిప్​కి వెళ్లేప్పుడు మీరు ప్రకృతి ప్రసాదించిన ఎన్నో అందాలు చూడొచ్చు. మున్నార్​లో మీరు టీ ప్లాంటేషన్స్​ని, మట్టుపెట్టి డ్యామ్, ఎకో పాయింట్స్​ చూడొచ్చు. అడిమలిలో మీరు వాటర్​ ఫాల్స్​ చూడొచ్చు. కాసేపు టైమ్​ తీసుకుని మీరు ఈ వ్యూని, వాటర్ పాయింట్​ని ఎంజాయ్ చేయవచ్చు. కొత్తమంగళంలో మార్తోమా చర్చ్, లోకల్ మార్కెట్​ను ఎక్స్​ప్లోర్ చేయవచ్చు. కొచ్చిలో ఫోర్ట్​, మట్టన్​చెర్రీ ప్యాలేస్ చూడొచ్చు. అక్కడి నుంచి కొచ్చి మెరైన్ డ్రైవ్‌ చేసి.. అలెప్పీకి వెళ్లాలి. అలెప్పీకి వెళ్తే కచ్చితంగా చూడాల్సిన వాటిలో బ్యాక్ వాటర్స్ ఉంటాయి. అక్కడ బోట్ రైడ్ తీసుకుని.. అలెప్పీ బీచ్​కి వెళ్లొచ్చు. 

తెలుసుకోవాల్సినవి ఇవే..

మీరు రోడ్ ట్రిప్​కోసం మున్నార్ నుంచి అలెప్పీకి వెళ్లాలనుకుంటే.. రోడ్ కండీషన్స్​, వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవాలి. సాధారణంగా టూరిస్ట్ ప్లేస్​లు కాబట్టి అక్కడ రోడ్స్ బాగానే ఉంటాయి. కొన్ని చోట్ల గుంతలు, రఫ్​ రోడ్స్ ఉండొచ్చు. డ్రైవ్​కి వెళ్లినప్పుడు కాస్త అలెర్ట్​గా ఉండాలి. అలాగే రోడ్ వైండిగ్స్​ పట్ల అవగాహన కలిగి ఉండడం లేదంటే జాగ్రత్తగా వెళ్తే మంచిది. మున్నార్​ నుంచి కొచ్చికి వెళ్లేప్పుడు కాస్త ట్రాఫిక్ ఉంటుంది. వీటిని దృష్టిలో పెట్టుకుని వెళ్లాలి. 

స్టేయింగ్​ కోసం.. 

మున్నార్, అలెప్పీల్లో మీరు స్టేయింగ్ చేయవచ్చు. చాలా ఆప్షన్స్.. తక్కువ బడ్జెట్​లోనే అందుబాటులో ఉంటాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ హోటల్స్ నుంచి రిసార్ట్స్ ఉంటాయి. కేరళ లోకల్ ఫుడ్​ని ఎక్స్​ప్లోర్ చేయవచ్చు. కాఫీ కూడా మీకు మంచి ఎక్స్​పీరియన్స్ ఇస్తుంది. 

తీసుకోవాల్సిన జాగ్రత్తలు

వర్షాలు పడే సమయంలో ఈ ట్రిప్​ని క్యాన్సిల్ చేసుకుంటే మంచిది. అలాగే మీరు వెళ్లేప్పుడు కంఫర్టబుల్​గా ఉండేందుకు కావాల్సిన వస్తువులు ప్యాక్ చేసుకోవాలి. సన్​స్క్రీన్, కెమెరా వంటివాటిని తీసుకువెళ్లడం మరచిపోవద్దు. మీరు బయలుదేరే ముందు పెట్రోల్​ ఫుల్ ట్యాంక్ చేయించుకుని వెళ్తే ఇబ్బందులు ఉండవు. హెల్మెట్​ పెట్టుకుని జాగ్రత్తగా డ్రైవ్ చేస్తే మంచి ఎక్స్​పీరియన్స్ మీ సొంతమవుతుంది. 

Also Read : లాంగ్ డ్రైవ్​కి వెళ్తున్నారా? అయితే మీకు ఈ స్నాక్స్ బెస్ట్ ఆప్షన్.. ఎందుకంటే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget