Long Drive : లాంగ్ డ్రైవ్‌కి వెళ్తున్నారా? అయితే మీకు ఈ స్నాక్స్ బెస్ట్ ఆప్షన్.. ఎందుకంటే
Road Trip Essentials : మూడ్ బాలేదనుకున్నప్పుడు చాలామంది లాంగ్ డ్రైవ్‌కి వెళ్తూ ఉంటారు. ఇలా అన్ ప్లాన్డ్ డ్రైవ్‌కి వెళ్లేప్పుడు ఎలాంటి స్నాక్స్ తీసుకెళ్తే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.
Best Snacks for a Road Trip : ట్రిప్‌లకు వెళ్లనప్పుడు లేదా మూడ్ బాలేనప్పుడు.. మూడ్ బాగున్నప్పుడు.. లేదంటే ఫ్రెండ్స్‌ని మీట్ అయినప్పుడు చాలామంది లాంగ్ డ్రైవ్‌కి వెళ్తుంటారు. లేదంటే కొందరు ట్రిప్‌లో భాగంగానే లాంగ్ డ్రైవ్‌కి వెళ్తారు. అయితే ఇలా మీరు వెళ్లాలనుకున్నప్పుడు కొన్ని స్నాక్స్‌ని మీతో తీసుకెళ్తే చాలా మంచిది. ఇవి మీ జర్నీని హ్యాపిగా చేయడంలో హెల్ప్ చేస్తూ ఉంటాయి.
లాంగ్ డ్రైవ్‌కి వెళ్లేప్పుడు చాలామంది రోడ్లు విశాలంగా.. జనాలు ఎవరు లేని ప్రాంతాలను ఎంచుకుంటారు. అలా వెళ్లి కాస్త ప్రశాంతంగా మధ్యలో ఆగి.. ప్రకృతిని ఆస్వాదిస్తూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అలాంటి ప్రాంతాల్లో సరైన ఫుడ్ దొరకదు. లేదా దొరికిన ఫుడ్ మీకు నచ్చకపోవచ్చు. మళ్లీ ఆకలితో తిరుగు ప్రయాణం చేయడం కానీ.. వెళ్తున్నప్పుడు కూడా మీరు ఫుడ్ గురించి వెతుక్కుంటూ ఇబ్బంది పడడం వంటివి ఉండకూడదంటే.. మీరే కొన్ని హెల్తీ, టేస్టీ స్నాక్స్ తీసుకువెళ్లొచ్చు. అవేంటంటే..
నట్స్..
మీరు లాంగ్ డ్రైవ్‌కి వెళ్లేప్పుడు తినగలిగేవి.. ఆరోగ్యానకి హాని చేయనివి.. టేస్టీగా ఉండే ఫుడ్స్ తీసుకోవాలనుకుంటే నట్స్ మీకు మంచి ఆప్షన్. బాదం, జీడిపప్పు, వాల్నట్స్ వంటి వాటిని మీ బ్యాగ్ లేదా వాహనంలో పెట్టుకోవచ్చు. ఇవి హై ప్రోటీన్‌తో ఫైబర్‌తో పుష్కలంగా నిండి ఉంటాయి. ఎక్కువ సేపు మీకు ఆకలికాకుండా.. నిండుగా ఉంచగలుగుతాయి.
డ్రై ఫ్రూట్స్..
ఆప్రికాట్స్, క్రాన్ బెర్రీలు, ఎండు ద్రాక్షలు వంటి డ్రై ఫ్రూట్స్.. మీకు మంచి రుచిని అందించడంతో పాటు.. వాటిని నములుతూ టైమ్ పాస్ చేయవచ్చు. వీటిలో కూడా ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పండ్లు
యాపిల్స్, నారింజలు, అరటిపండ్లు వంటి ఫ్రూట్స్ కూడా మీరు లాంగ్ డ్రైవ్‌కి వెళ్లినప్పుడు మంచి ఆప్షన్. ఇవి మీకు తక్షణమే ఎనర్జీని అందించడమే కాకుండా.. శరీరానికి కావాల్సిన ఫైబర్, విటమిన్స్ పుష్కలంగా అందుతాయి.
ప్రోటీన్ బార్స్..
ప్రోటీన్ బార్స్ కూడా మంచి రుచిని అందించడమే కాకుండా.. మీకు ఎనర్జీని ఇస్తాయి. ప్రోటీన్‌తో నిండిన ఈ బార్స్ ఆరోగ్యానికి కూడా మంచివి. ఇవి ఎక్కువ కాలం మీకు ఆకలి కాకుండా నిండుగా ఉండేలా చేస్తాయి. లో షుగర్ ఉండే బార్స్ ఎంచుకుంటే మంచిది. లేదంటే మీకు నిద్ర వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి.
ఎనర్జీ బాల్స్..
ఓట్స్‌తో, నట్స్‌తో, డ్రై ఫ్రూట్స్‌తో చేసిన ఎనర్జీ బాల్స్‌ని మీరు డ్రైవ్‌కి వెళ్లినప్పుడు తీసుకువెళ్లొచ్చు. ఇవి కూడా రుచిగా ఉంటూ.. మీకు శక్తిని అందిస్తాయి.
నీళ్లు..
అవును మీరు డ్రైవింగ్‌లో ఉన్నప్పుడు డీహైడ్రేట్ కాకుండా నీళ్లు హెల్ప్ చేస్తాయి. నీళ్లతో పాటు.. కొబ్బరి నీళ్లు, ఎలక్ట్రోలైట్స్ నిండుగా ఉండే డ్రింక్స్ తీసుకు వెళ్తే మీకు దారిలో ఎలాంటి ఇబ్బందులు కలగవు.
ఇలాంటి త్వరగా పాడవకుండా.. మీ లాంగ్ డ్రైవ్ జర్నీని ఎంజాయ్ చేసేలా చేస్తాయి. అలాగే ఫుడ్ విషయంలో ఇబ్బందులు పడాల్సిన అవసరం రాదు. అయితే మీరు ఇలా వెళ్లేప్పుడు మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఉండాలి. శరీరాన్ని స్ట్రెచ్ చేస్తూ.. కాస్త యాక్టివ్‌గా చేసుకుంటే.. ఎక్కువ దూరం ప్రయాణం చేయగలుగుతారు.
Also Read : హైదరాబాద్ టూ పాండిచ్చేరి బడ్జెట్ ఫ్రెండీ ట్రిప్ 6 వేల లోపే.. 3 రోజులు - 4 నైట్స్‌కి ప్లాన్ ఇదే