అన్వేషించండి

Mobile Safety Tips in Rain : వర్షంలో స్మార్ట్‌ఫోన్ తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. తడిస్తే ఫాలో అవ్వాల్సిన టిప్స్

Mobile Safety Tips in Telugu : వర్షాకాలంలో ఫోన్ తడవకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఏ టిప్స్ ఫాలో అయితే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Rainy Season Mobile Safety : వర్షాలు వస్తున్నప్పుడు మనం తడవడం ఎలా ఉన్నా.. మన మొబైల్ తడవకూడదని అనుకుంటాము. ఎందుకంటే వర్షంలో తడిస్తే స్మార్ట్​ఫోన్​కు నష్టం వాటిల్లే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఆఫీసుకు లేదా బయటకు వెళ్లినప్పుడు వాతావరణం బాగానే ఉన్నా.. అకస్మాత్తుగా వర్షం వస్తే కష్టంగా ఉంటుంది. ఆ సమయంలో మొబైల్ ఉపయోగించడం, దానిని జాగ్రత్త చేయడం రెండూ కష్టమే అవుతాయి. కాబట్టి అలాంటి పరిస్థితిల్లో ఫోన్​ను సురక్షితంగా ఎలా ఉంచుకోవాలో.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫోన్​ని కాపాడుకునేందుకు కొన్ని సులభమైన చిట్కాలు, సింపుల్ హ్యాక్స్ ఇక్కడున్నాయి. 

వాటర్‌ప్రూఫ్ పర్సు లేదా జిప్‌లాక్ బ్యాగ్ 

నాణ్యత కలిగిన వాటర్‌ప్రూఫ్ మొబైల్ కవర్ లేదా జిప్‌లాక్ బ్యాగ్‌ను కొనండి. దానిని మీతోనే ఉంచుకోండి. మీరు వెళ్లేప్పుడు బ్యాగ్​లోనో.. లేదా బైక్​లోనే దానిని పెట్టుకోండి. ఇలా చేయడం వల్ల మీరు వర్షంలో బయటకు వెళ్లినా.. లేదా ఆకస్మికంగా వర్షం వచ్చినా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఫోన్​ను ఈజీగా, సేఫ్​గా తీసుకెళ్లిపోవచ్చు.

స్ట్రాంగ్ వాటర్ ప్రూఫ్ కేస్

మీరు బైక్ లేదా స్కూటర్‌లో ప్రయాణిస్తుంటే.. IP68 రేటింగ్ లేదా మిలిటరీ-గ్రేడ్ రక్షణను అందించే మొబైల్ కేస్​ను ఉపయోగించండి. ఇది నీరు, షార్ట్ సర్క్యూట్ నుంచి ఫోన్‌ను రక్షిస్తుంది.

తడి చేతులతో ఫోన్‌ను చార్జ్ చేయవద్దు

వర్షంలో మీరు తడవడం, లేదా మీ ఫోన్ కూడా తడిచి ఉన్నప్పుడు దానికి ఛార్జింగ్ పెట్టకపోవడమే మంచిది. ఎందుకంటే నీరు, విద్యుత్ కలయిక ప్రాణాంతకానికి దారి తీస్తాయి. కాబట్టి మీ చేతులు లేదా ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ తడిగా ఉంటే.. దాన్ని ఛార్జ్ చేయకపోవడమే మంచిది. ఏంపర్లేదు అని చార్జింగ్ పెట్టేస్తే ఫోన్‌లో షార్ట్ సర్క్యూట్‌ కావచ్చు లేదా మీకు షాక్ తగిలే అవకాశం కూడా ఉంది.

బ్యాటరీ సేవర్ మోడ్‌

వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. దీని వలన ఫోన్ బ్యాక్‌గ్రౌండ్ యాక్టివిటీ పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో.. బ్యాటరీ త్వరగా అయిపోవచ్చు. మీరు బయట ఉంటే.. చార్జింగ్ పాయింట్ లేకుంటే పరిస్థితి ఇబ్బందికరంగా మారవచ్చు కాబట్టి.. బ్యాటరీ సేవర్ మోడ్‌ను ఆన్ చేయండి. ఇది చార్జింగ్ ఎక్కువసేపు ఉండేలా చేస్తుంది.

ఫోన్ తడిస్తే..

వర్షంలో మీ ఫోన్​ను జాగ్రత్త చేయలేని పరిస్థితుల్లో అది తడిచిపోతే.. వెంటనే స్విచ్ ఆఫ్ చేసేయాలి. దానిని ఆరబెట్టడానికి హెయిర్ డ్రైయర్ ఉపయోగించడం లాంటివి చేయవద్దు. దానిని బియ్యంలో ఉంచడం లేదా సిలికా జెల్ ప్యాకెట్​లో 24 గంటల నుంచి 48 గంటల వరకు ఉంచాలి. 

డేటా బ్యాకప్ 

వర్షాకాలంలో ఫోన్ పాడయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ముఖ్యమైన ఫైల్‌లు, కాంటాక్ట్‌లు, ఫోటోలు, WhatsApp చాట్‌లను Google Drive లేదా iCloudలో సేవ్ చేయండి. అలాగే ఎప్పటికప్పుడు ల్యాప్‌టాప్‌కు డేటాను బదిలీ చేసుకోవడం మంచిది.

ఇంటి చిట్కాలు

ఫోన్ కవర్‌లో సిలికా జెల్ లేదా బ్లోటింగ్ పేపర్‌ను ఉంచండి. దీనివల్ల లోపల పేరుకుపోయిన తేమను ఇవి పీల్చుకుంటాయి. ఇలా చేయడం వల్ల ఫోన్‌ను లోపలి నుంచి పొడిగా ఉంచుకోవచ్చు.

ఛార్జింగ్ పోర్ట్‌ శుభ్రత

తేమ, ధూళి ఎక్కువైతే.. USB-C లేదా లైట్నింగ్ పోర్ట్‌లో అవి పేరుకుపోతాయి. దీని వలన ఛార్జింగ్ సమస్యలు వస్తాయి. కాబట్టి కొన్ని రోజులకోసారి పోర్ట్‌ను మృదువైన బ్రష్ లేదా బ్లోయర్‌తో శుభ్రం చేయండి.

నేరుగా కాల్స్ చేయకండి

మీ ఫోన్ వాటర్-రెసిస్టెంట్ అయినప్పటికీ.. వర్షంలో నేరుగా చెవికి ఫోన్ పెట్టి మాట్లాడటం ప్రమాదకరం కావచ్చు. మీరు వైర్డు ఇయర్‌ఫోన్‌లు లేదా బ్లూటూత్ పరికరాన్ని ఉపయోగించడం మంచిది.

ఫోన్ వేడెక్కితే..

వర్షాకాలంలో తేమ ఫోన్‌ను వేడిగా చేస్తుంది. ఛార్జింగ్ సమయంలో ఫోన్ మరీ ఎక్కువగా వేడిగా అనిపిస్తే.. వెంటనే ఛార్జింగ్ ఆపాలని గుర్తించుకోవాలి.

 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Tomato Pesticide Removal : టమాటాలు ఇలా ఈజీగా శుభ్రం చేయండి.. ఉప్పుతో పురుగుమందులు తొలగిపోతాయా?
టమాటాలు ఇలా ఈజీగా శుభ్రం చేయండి.. ఉప్పుతో పురుగుమందులు తొలగిపోతాయా?
Onion Oil : జుట్టు రాలకుండా, ఒత్తుగా పెరగాలంటే.. ఉల్లి నూనె అప్లై చేయండి, ఇంట్లోనే చేసుకోండిలా
జుట్టు రాలకుండా, ఒత్తుగా పెరగాలంటే.. ఉల్లి నూనె అప్లై చేయండి, ఇంట్లోనే చేసుకోండిలా
Smart Travel Hacks : బడ్జెట్ ట్రావెలర్ టిప్స్.. ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవలసిన 10 హ్యాక్స్ ఇవే
బడ్జెట్ ట్రావెలర్ టిప్స్.. ప్రతి ప్రయాణికుడు తెలుసుకోవలసిన 10 హ్యాక్స్ ఇవే
Stroke Golden Hour : స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి సెకన్ విలువైనదే.. ఏమి చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చో తెలుసా?
స్ట్రోక్ వచ్చినప్పుడు ప్రతి సెకన్ విలువైనదే.. ఏమి చేస్తే ప్రాణాలు కాపాడుకోవచ్చో తెలుసా?

వీడియోలు

Australia Eliminated T20 World Cup 2026 | వర్షం కారణంగా Ireland vs Zimbabwe మ్యాచ్ రద్దు | ABP Desam
Mohammad Yousuf Slams Political Interference | పాక్ ఓటమిపై పాక్ మాజీ ప్లేయర్ సంచలన వ్యాఖ్యలు
Hardik Pandya Epic 'No-Look' Wicket | వైరల్ అవుతున్న హార్దిక్ 'నో-లుక్' వికెట్
Vaibhav Suryavanshi Skips 10th Board Exams | వైభవ్ సూర్యవంశీ షాకింగ్ నిర్ణయం
Australia vs Sri Lanka T20 World Cup 2026 | అద్భుతమైన విజయంతో సూపర్ -8లోకి శ్రీలంక

ఫోటో గ్యాలరీ

ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Actor Mohan Babu: కిడ్నాప్ కేసులో మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో ఎదురుదెబ్బ, పిటిషన్ కొట్టివేత
నటుడు మోహన్‌బాబుకు ఏపీ హైకోర్టులో చుక్కెదురు, పిటిషన్ కొట్టివేత
BioAsia Conference: జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
జీవవిజ్ఞాన రాజధానిగా హైదరాబాద్ - బయోఏషియా 2026 వేదికగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపు
Bangladesh new govt: బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
బంగ్లాదేశ్ కొత్త ప్రభుత్వంలో హిందూ నేతకు చోటు - తారిక్ రెహ్మాన్‌ భారత్‌కు సందేశం పంపారా?
IAS Sri Lakshmi: జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
జగన్ అక్రమాస్తులు, ఓబులాపురం కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టు షాక్ - డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేత
Bajaj Pulsar N160 EMI: 7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 
7వేల రూపాయలు చెల్లిస్తే బజాజ్‌ పల్సర్‌ N 160! హైదరాబాద్‌సహా తెలుగు రాష్ట్రాల్లో నెలకు ఎంత EMI కట్టాలి? 
Rahul Gandhi: నాయకత్వానికి రాహుల్ గాంధీ అనర్హుడు -తీవ్రంగా విరుచుకుపడ్డ సిద్దూ భార్య
నాయకత్వానికి రాహుల్ గాంధీ అనర్హుడు -తీవ్రంగా విరుచుకుపడ్డ సిద్దూ భార్య
AI Summit 2026: డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?
డ్రైవర్‌కు నిద్ర వస్తే కారు ఆగిపోతుందా? ప్రమాదాలకు AIతో ఎలా చెక్ పడుతుంది? టాటా తీసుకొస్తున్న టెక్నాలజీ ఏంటీ?
Allu Arjun Controversy: సారీ అల్లు అర్జున్ గారూ... నాది తప్పే, క్షమించండి - దిగొచ్చిన బాలీవుడ్ లేడీ
సారీ అల్లు అర్జున్ గారూ... నాది తప్పే, క్షమించండి - దిగొచ్చిన బాలీవుడ్ లేడీ
Embed widget