అన్వేషించండి

Monsoon Home Tips : వర్షాకాలంలో కచ్చితంగా ఇంట్లో చేయాల్సిన మార్పులివే.. సింపుల్, ఎఫెక్టివ్ టిప్స్

Monsoon Tips: వర్షాకాలంలో మీ ఇళ్లు ఫ్రెష్​గా, హాయిగా ఉండాలనుకుంటున్నారా? అయితే మీరు ఇంట్లో కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. అవేంటంటే.. 

Monsoon Makeover Tips : ఇంటిలో సీజన్​కి తగ్గట్లు మార్పులు చేసుకోవడం అనేది చాలా అవసరమైన విషయం. ఇలా మార్పులు, మేక్​ఓవర్ చేయడం వల్ల రూమ్​ మీకు బోర్​ కొట్టుకుండా ఉంటుంది. అలాగే సీజన్​కి అనుగుణంగా మార్చుకోవడం వల్ల ఇళ్లు ఎప్పుడు ఫ్రెష్​గా, ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. అయితే మాన్​సూన్​లో ఇంట్లో ఎలాంటి మార్పులు చేస్తే కంఫర్ట్​బుల్​గా ఉంటారో.. వాటితో కలిగే లాభాలు ఏంటో ఇప్పుడు ఓ లుక్కేద్దాం. 

వర్షాకాలంలో తడి, తేమ వల్ల కాస్త ఇబ్బంది ఉంటుంది. అలా ఉండకుండా మీరు ఇళ్లు ఫ్రెష్​గా ఉండాలనుకుంటే మీరు కొన్ని వస్తువులను ఇంట్లో ఉంచుకోవడంతో పాటు కొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. క్రేజీ డిజైన్స్​తో మార్పులు చేసేందుకు ఏవి బెస్ట్ ఆప్షనో తెలుసుకుందాం. 

డోర్ దగ్గర చేయాల్సిన మార్పులు.. 

వర్షాకాలంలో డోర్​ దగ్గర కొన్ని మార్పులు చేయాలి. స్ట్రాంగ్ షూ రాక్​తో పాటు.. గొడుగు పెట్టేందుకు హోల్డర్స్ రెడీ చేసుకోవాలి. చేతులు తుడుచుకోవడానికి ఓ టవల్ పెట్టుకోవాలి. అలాగే కాళ్లకు ఉండే నీటిని పీల్చుకోగలిగే డోర్​మ్యాట్​ను తీసుకోవాలి. 

వీటిని గుమ్మం దగ్గర ఉంచడం వల్ల ఇంట్లో మిగిలి ఉన్న భాగం శుభ్రంగా, పొడిగా ఉంటుంది. ఇంట్లోకి వచ్చేవారు కూడా అక్కడ క్లీన్ చేసుకుని లోపలికి వస్తారు. దీనివల్ల మురికి కూడా ఉండదు. 

ఫర్నిచర్ మార్పులు.. 

వర్షాకాలంలో ఫర్నిచర్​పై ఉండే సాధారణ క్లాత్​లను తొలగించడమే కాకుండా.. వాటిని వాటర్​ప్రూఫ్ క్లాత్స్​తో భర్తీ చేయాలి. మందపాటి కార్పెట్లు, బరువైన రగ్గులు వాడకూడదు. ఇవి తేమకు దుర్వాసనను వెదజల్లుతాయి. వాటికి బదులుగా ఉతికిన, తడిచినా త్వరగా ఆరిపోయే మ్యాట్​లు, సన్నని కార్పెట్​లు వేసుకోవాలి. 

కుషన్లు, కర్టెన్లు కూడా అలాంటివే ఎంచుకోవాలి. లేదంటే అవి వాసన వస్తాయి. పాతవాసనను నివారించే కాటన్ క్లాత్స్, సింథటిక్​వి ఎంచుకోవాలి. 

క్రాస్ వెంటిలేషన్.. 

వర్షాకాలంలో గదులు తేమతో కూడిన గాలితో నిండిపోతాయి. వర్షం ఆగిపోయినప్పుడు ఫ్రెష్ ఎయిర్​ లోపలికి వచ్చేలా క్రాస్ వెంటిలేషన్​ను ఏర్పాటు చేసుకోవాలి. మెష్ గ్రిల్స్, స్క్రీన్లు ఉంటే వాటిని తొలగించి గాలి లోపల ఆగిపోకుండా ఉండేలా.. ఫ్రెష్ గాలి వచ్చేలా చూసుకోండి. ఫ్యాన్స్ వేస్తూ ఉంచితే.. తేమ బయటకు వెళ్లిపోతుంది. 

మొక్కలు.. 

ఇంట్లో తాజా ఫీల్​ని రెట్టింపు చేయడానికి మీరు ఇండోర్ ప్లాంట్లు పెట్టుకోవచ్చు. పీస్​ లిల్లీస్, స్నేక్ ప్లాంట్స్ వంటి ఇంట్లో పెట్టుకోవాలి. ఇవి గాలిని శుభ్రపరుస్తాయి. అలాగే ఇండోర్​లో ఉండే తేమను తగ్గిస్తాయి. పైగా మొక్కలు ఒత్తిడిని తగ్గించి మనసుకు హాయిని ఇస్తాయి. 

హ్యూమిడిఫైయర్​ 

వర్షాకాలంలో గదుల్లో ముఖ్యంగా గాలి, వెలుతురు లేని ప్రదేశంలో కాస్త వాసన వస్తుంది. ఆ సమయంలో కర్పూరం, సహజమైన ఆయిల్స్​ని రూమ్​లో ఉంచితే వాసన తగ్గుతుంది. అలాగే వార్డ్ రోబ్​లలో ఓ చిన్న పోర్టబుల్ డీహ్యూమిడిఫైయర్ పెట్టుకుంటే మంచిది. ఇది తేమను గ్రహిస్తుంది. వస్తువులు బూజు పట్టకుండా, పాడవకుండా ఇది హెల్ప్ చేస్తుంది. 

ఇవే కాకుండా వర్షాకాలంలో రెయిన్​కోట్లు, గొడుగులు, త్వరగా ఆరిపోయే టవల్స్ అన్నింటినీ ఓ చోట అందుబాటులో పెట్టుకోవాలి. వర్షాకాలంలో వేసుకోలేని దుస్తులను పక్కన పెట్టేస్తే మంచిది. అవి తేమను పీల్చుకోకుండా ఉంటాయి. ఈ సింపుల్ టిప్స్​తో వర్షాకాలంలో ఇళ్లు శుభ్రంగా, ఫ్రెష్​ ఫీలింగ్ ఇస్తుంది. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Monsoon Driving Guide : వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
వర్షంలో కారు, బైక్‌పై ఆఫీసుకు వెళ్తున్నారా? ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు తీసుకుంటే ప్రమాదాలు తప్పుతాయి
Healthy Night Routine : మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
మంచి నిద్ర కావాలంటే నైట్ రొటీన్ ఇలా సెట్ చేసుకోండి.. వైద్యులు సూచించే సింపుల్ అలవాట్లు ఇవే
PCOS vs Iron Deficiency : PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
PCOS ఉంటే ఐరన్ తగ్గిపోతుందా? రెండింటి మధ్య సంబంధం ఏంటి? గైనకాలజిస్ట్ సూచనలివే
Gas Stove Cleaning: గ్యాస్ స్టవ్‌పై పాల మరకలను ఎలా తొలగించాలి? సులభమైన పరిష్కారా చిట్కాలు ఇవే!
గ్యాస్ స్టవ్‌పై పాల మరకలను ఎలా తొలగించాలి? సులభమైన పరిష్కారా చిట్కాలు ఇవే!

వీడియోలు

Ashes Test Match To Be Hosted In India? | ఇండియాలో 'యాషెస్' టెస్ట్ మ్యాచ్?
Serial Actress Preethi Srinivas Real Life Facts | సీరియల్ నటి ప్రీతి శ్రీనివాస్ రియల్ లైఫ్ సీక్రెట్స్
Vaibhav Suryavanshi Creates World Record | 15 ఏళ్ల వయసులో వైభవ్ సూర్యవంశీ వరల్డ్ రికార్డ్
PM Modi Gains 10 Lakh Followers In 12 Hours | పీఎం మోదీ సోషల్ మీడియాలో రికార్డ్
PM Modi Midnight Statement on Paper Leak | పేపర్ లీకేజీలపై మోదీ అర్ధరాత్రి ప్రకటన

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Rains In AP And Telangana: భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
భారీ వర్షాలతో తెలంగాణలో 10 జిల్లాలకు ఎల్ల్ అలర్ట్, ఏపీలో ఈ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు
Revanth Reddy HYDRA Comments: అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
అధికారి నియామకం ప్రభుత్వ విచక్షణాధికారమన్న రేవంత్ - హైకోర్టు ఆదేశాల ప్రకారం రంగనాథ్‌ను తొలగించేందుకు సిద్ధంగా లేరా?
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
NEET UG పేపర్‌ లీక్‌ కేసులో సీబీఐ ఛార్జిషీట్ దాఖలు, 13 మంది నిందితుల పేర్లు ఇవే! 
AP Mee Mart: ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ జిల్లాల్లో రాబోతున్న "మీ మార్ట్"- ఈ క్వార్టర్‌లోనే వెయ్యి స్టోర్‌లు ప్రారంభించనున్న ప్రభుత్వం!‌
Parvathipuram Manyam Latest News:మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
మన్యం ప్రాంతంలో సిమెంట్‌ రోడ్లకు పగుళ్లు! కాంట్రాక్టర్ బిల్లులు నిలిపేయాలని పవన్ ఆదేశాలు!
ED Rains In Hyderabad: డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
డ్రగ్స్ కేసులో హైదరాబాద్, బెంగళూరులో ఈడీ ఆకస్మిక దాడులు.. మత్తు లింకులపై ఫోకస్!
Bonda Uma TDP: అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
అంబటి భేటీ వివాదంపై బోండా ఉమా యూటర్న్ - త్రిసభ్య కమిటీకి వివరణ - పార్టీ లైన్ దాటేదే లేదని ప్రకటన
BCCI Coaching Sack: టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
టెన్ డోషేట్, దిలీప్ లపై వేటు.. టీమ్ ఇండియా సపోర్ట్ స్టాఫ్ లో కొత్త వాళ్ల కోసం బీసీసీఐ చూపు!
Embed widget