Legal Rights for Tenants : అద్దె ఇంట్లో ఉంటున్నారా? మీ హక్కులు తెలిస్తే ఓనర్స్ వణికిపోతారు.. తప్పక తెలుసుకోండి
Rights for Renters in India : సిటీల్లో సొంత ఇళ్లు కంటే అద్దె ఇళ్లల్లో ఉండేవారే ఎక్కువగా ఉంటారు. అయితే మీరు అద్దెకు ఉండేవారు అయితే మీరు కొన్ని లీగల్ రైట్స్ గురించి తెలుసుకోవాలి.

Legal Rights Every Indian Tenant Must Know : మీరు అద్దె ఇంట్లో ఉంటున్నారా? అయితే మీకు మీ ఓనర్‌తో టామ్ అండ్ జెర్రీ రిలేషన్ ఉండే ఉంటుంది. ఎందుకంటే ఇంటి ఓనర్స్ ఏ సమయంలో పడితే ఆ సమయంలో రావడం పర్సనల్ స్పేస్‌కి భంగం కలిగించడం లేదా ఇతర కారణాలతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అయితే మీకు తెలుసా? ఇంట్లో అద్దె ఉండేవారికి కూడా కొన్ని లీగల్ రైట్స్ ఉంటాయి. అవి చాలామందికి ఈ విషయాలు తెలియక సఫర్ అవుతూ ఉంటారు. ఇంతకీ అద్దె ఇంట్లో ఉండేవారు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పర్మిషన్ ఉండాల్సిందే..
మీకు ఇంటిని లేదా రూమ్‌ని అద్దెకు ఇచ్చినవారు మీ పర్మిషన్ లేకుండా మీ ఇంట్లోకి రాకూడదు. అది వారి సొంత ఇళ్లు అయినా సరే.. మీ పర్మిషన్ లేదా మీకు చెప్పకుండా ఇంట్లోకి రాకూడదు. ఇది ఇల్లీగల్ చర్యగా చెప్తారు.
అగ్రిమెంట్
మీరు అద్దె ఇంట్లో ఉండి 11 నెలలు దాటితే కచ్చితంగా రెంట్ అగ్రిమెంట్ చేయించుకోవాలి. లీగల్లీ రిజిస్టర్డ్ అనే స్టాంప్‌తో అగ్రిమెంట్ చేసుకోవాలి. చేతితో రాసిన లేదా ప్లెయిన్ పేపర్ మీద అగ్రిమెంట్ రాసుకున్నా.. కోర్టులో అది చెల్లదు.
ఆ హక్కు లేదు..
మిమ్మల్ని రాత్రికి రాత్రే ఇంటి నుంచి బయటకు పంపే హక్కు మీ ఓనర్‌కి ఉండదు. అలా పంపడానికి లీగర్ ప్రాసెస్ కచ్చితంగా ఉండాలి. మీకు ఓనర్‌తో గొడవ అయినా.. లేదా రెంట్ కట్టడంలో ఆలస్యమైనా.. ఓనర్ మిమ్మల్ని సడెన్‌గా బయటకి పంపే హక్కు ఉండదు. Tenant Protection Under Indian Law ప్రకారం అద్దెకు ఉండేవారిని ఇంటినుంచి పంపాలంటే.. ముందుగా నోటిస్ ఇవ్వాలి. కోర్టులో ఫైల్ చేయాలి. కోర్టు ఆర్డర్ వచ్చే వరకు ఆగాలి.
డిపాజిట్..
అద్దెకు తీసుకునేప్పుడు సెక్యూరిటి డిపాజిట్ కోసం రెండు నెలల అద్దె ముందుగానే ఇస్తారు చాలామంది. హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి సిటీలలో రెండు నెలల అద్దె ఇస్తారు. అయితే ఓనర్ 6 నుంచి 10 నెలల అద్దెను డిమాండ్ చేయకూడదు. కర్ణాటకలో 2021 రూల్ ప్రకారం రెండు నెలల డిపాజిట్ తీసుకుంటారు. తమిళనాడులో మూడు నెలల అద్దె తీసుకుంటారు.
రిసిప్ట్స్..
ఇంటి ఓనర్స్ కచ్చితంగా రెంట్ రెసిప్ట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది వారు ఫేవర్ చేయడం కాదు. ఇది మీ హక్కు. ఈ రెసిప్ట్స్ తీసుకోవడం వల్ల HRA Claim చేసుకోవచ్చు. Legal Protection ఉంటుంది. పర్సనల్ రికార్డ్ మెయింటైన్ చేయవచ్చు. Always Ask- Its Your Legal Right.
ఇవే కాకుండా.. బిల్డింగ్ మెయింట్‌నెన్స్, రిపైర్స్ కోసం ఓనర్ మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు. ఇది మీ కాంట్రాక్ట్‌లో కచ్చితంగా మెన్షన్ చేసుకోవాలి. అలాగే ప్రొటెక్షన్ అండర్ రెంట్ కంట్రోల్ యాక్ట్స్ ప్రకారం కొన్ని రాష్ట్రాల్లో రెంట్ హైక్స్‌ను ఓనర్ ఇష్టం వచ్చినట్టు పెంచకూడదు. అలాగే ముందుగా చేసిన సెక్యూరిటీ డిపాజిట్‌ను రీఫండ్ చేసేయాలి.
ఈ రైట్స్ గురించి ఓ మీమ్ పేజ్ ఇన్‌స్టాలో పోస్ట్ వేయగా.. దానికి కొన్ని ఫన్నీ, ఆసక్తికర కామెంట్లు వచ్చాయి. If you talk all these rules while searching for a room for rent, the house owner will say, "Kapil Cipil sir. You see some other place😂" అని ఒకరు కామెంట్ చేయగా.. My owner upfront deny to share PAN n rent receipt అంటూ మరో వ్యక్తి బాధ వ్యక్తం చేశారు.






















