వర్షాకాలంలో దోమల బెడద కాస్త ఎక్కువగానే ఉంటుంది.

ఈ సమయంలో వాటిని కంట్రోల్ చేసేందుకు కొన్ని ఇంటి చిట్కాలు ఫాలో అవ్వొచ్చు.

లావెండర్ వాసన దోమలను ఇంట్లోకి రాకుండా మంచి అరోమాను అందిస్తుంది.

దాల్చిన చెక్కతో చేసిన నూనె దోమలను దూరం చేస్తుంది. దోమల వల్ల కలిగే దొద్దుర్లు తగ్గిస్తుంది.

వేప నూనె కూడా దోమలను 70 శాతం అడ్డుకుంటుంది.

టీ ట్రీ ఆయిల్​ యాంటీ సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటుంది. దోమలను తగ్గిస్తుంది.

లెమన్ గ్రాస్ కూడా దోమలు రాకుండా అడ్డుకుంటుంది. మంచి అరోమాను అందిస్తుంది.

పచ్చ కర్పూరాన్ని ఏ నూనెలో అయినా కలిపి దానితో దీపం పెడితే దోమలు రావు.

వెల్లుల్లిని పేస్ట్ చేసి.. దానిని నీళ్లలో కలిపి గోడలపై స్ప్రేగా కొడితే దోమలుండవు.

కాఫీ స్మెల్​ కూడా దోమలను దూరం చేస్తుంది. ఈ టిప్స్ దోమలను తగ్గిస్తాయి.