ప్యాక్ చేసిన కూరగాయలు, తాజా కూరగాయలు రెండింటిలో ఏవి మంచివి? తాజా కూరగాయలు ఆరోగ్యానికి మంచివి. అందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇటీవల మార్కెట్లో ప్యాక్ చేసిన లేదా ఘనీభవించిన కూరగాయలు అమ్ముతున్నారు. మరి అవి ఆరోగ్యానికి మంచివేనా? తాజా పండ్లు, కూరగాయలు సాధారణంగా పూర్తిగా పక్వానికి రాకముందే వాటిని మార్కెట్ కు తరలిస్తారు. ప్యాక్ చేసిన పండ్లు, కూరగాయలు మాత్రం పూర్తిగా పక్వానికి వచ్చిన తర్వాతే ప్యాక్ చేస్తారు. కొన్నిగంటల్లో కొనుగోలు చేసే వీలుగా ఉంటాయి. వాటిని కడిగి, బ్లాంచ్ చేసి ప్యాక్ చేస్తారు. బ్లాంచింగ్ అంటే కూరగాయలను వేడినీళ్లలో లేదా ఆవిరిలో కాసేపు ఉంచడం. ఈ ప్రక్రియ యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, విటమిన్ సి కంటెంట్ ను తగ్గిస్తుంది. కానీ పోషకాలు ఉంటాయి. ప్యాక్డ్ కూరగాయలలో పోషకాల నష్టం తక్కువగా ఉంటుంది. తాజా వాటితో సమానంగా ఉంటుంది. తాజా పండ్లు, కూరగాయలు తీసుకున్నప్పటికీ కొన్ని సందర్బాల్లో వాటిలో క్వాలిటీ తక్కువగా ఉంటుంది. రెండింటిలో పోషకాలు ఉంటాయి. కాబట్టి ఏదైనా ఎంపిక చేసుకోవచ్చు. నోట్: ఈ సూచనలు మీ అవగాహనకు మాత్రమే.