అన్వేషించండి

Menarikam Marriages : మేనరికం పెళ్లి చేసుకుంటే పిల్లల్లో వైకల్యం తప్పదా? పెళ్లికి ముందు, తర్వాత చేయించుకోవాల్సిన టెస్ట్​లు ఇవే

Menarikam : కొన్ని కుటుంబాల్లో మేనరికం చేసుకుంటారు. ఇది తర్వాత తరం వారికి మంచిది కాదని ఎందరో చెప్పారు. అయితే ఈ తరహా వివాహం చేసుకునేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలట. అవేంటంటే.. 

Cousin Marriages : సొంతవారు.. సొంత ఫ్యామిలీ అనేది ఎక్కడ లేని ధైర్యాన్ని ఇస్తుంది. అలాగే తమ ఆస్తి ఎక్కడికిపోదు.. తమ పిల్ల లేదా పిల్లోడు తమ కుటుంబంలోనే హ్యాపీగా ఉంటారు.. పైగా ఇద్దరూ ఈడు జోడు బాగున్నారనుకుంటూ చాలామంది పెద్దలు మేనరికం పెళ్లిల్లు చేసేందుకు చూస్తారు. ఆస్తి పోదు అని చూస్తారు కానీ.. వారి తర్వాతి తరం పరిస్థితి ఏంటో అర్థం చేసుకోరు. ఈ విషయం గురించి ఎవరైనా చెప్పినా.. మరెవరికో పిల్లలు మంచిగానే పుట్టారనే వంక చూపిస్తూ పెళ్లిల్లు చేసేస్తారు. దీనివల్ల వారి నెక్స్ట్ జెనరేషన్ ఎంత ప్రమాదంలో పడుతుందో తెలుసా?

ప్రమాదమేంటి?

మేనరికంగా చేసుకునే పెళ్లిల్లో పేరెంట్స్ హ్యాపీగా ఉంటారు కానీ.. పిల్లలు హ్యపీగా ఉండలేరు. ఎందుకంటే జెనిటిక్స్​ ప్రధానకారణమవుతాయి. అబ్బాయి తరపు జెనిటిక్స్​లో మైనర్ క్యారియర్ ఉంటే.. అమ్మాయి తరపు జెనిటిక్స్​లో మైనర్ క్యారియర్ ఉంటే ఈ రెండూ కలిసి మేజర్ సమస్యకు కారణమవుతాయి. దీనివల్ల పిల్లల్లో వైకల్యం.. ఇతర దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందుకే మేనరికం పెళ్లిల్లు చేసుకోకపోవడమే మంచిదని చెప్తున్నారు నిపుణులు. 

మేనరికం చేసుకోవాల్సి వస్తే..

తప్పని పరిస్థితుల్లో.. లేదా మేనరికం పెళ్లి చేసుకోవాల్సిందే అనుకున్న సమయంలో పెళ్లికి ముందే వైద్యులను సంప్రదిస్తే మంచిది. ఎందుకంటే పెళ్లికి ముందే వారికి జెనిటిక్స్​ని చెక్​ చేసి.. పిల్లల విషయంలో క్లారిటీ తెచ్చుకోవచ్చు. లేదంటే జీవితాంతం.. కళ్లముందు పిల్లలు కదల్లేని పరిస్థితుల్లో.. లేదా ఏ ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చూడడం తల్లిదండ్రులకు అతిపెద్ద శిక్షగా మారుతుంది. వీలైనంత వరకు పెళ్లికి ముందు వైద్యులను సంప్రదిస్తే బెటర్. లేదంటే పెళ్లి తర్వాత ఎలాంటి సలహాలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. 

పెళ్లికి ముందు చేయించుకోవాల్సిన టెస్ట్​లు

మేనరికం పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు.. అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కలిసి వైద్యుల దగ్గరికి వెళ్లాలి. ఇలా వెళ్లడం వల్ల పెళ్లికి ముందు జెనిటిక్స్​లో మైనర్ క్యారియర్స్​ ఉన్నాయో లేదో తెలుసుకోవచ్చు. వైద్యులు మీ జెనిటిక్స్ అనాలిసిస్ చేస్తారు. కంప్లీట్ టెస్ట్​లు చేసి.. ఎక్కడ ఏమైనా క్యారియర్స్ లేదా ప్రాబ్లమ్స్ ఉంటే తెలుసుకోవచ్చు. అయితే మీకు పెళ్లి అయిపోయి పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నప్పుడు కూడా వైద్యులను సంప్రదించవచ్చు. 

పెళ్లి తర్వాత ఎలాంటి టెస్ట్​లు చేస్తారంటే..

మేనరికం వివాహం చేసుకున్న తర్వాత పిల్లల కోసం ట్రై చేస్తున్నప్పుడు వైద్యుల దగ్గరకు వెళ్తే.. ప్రెగ్నెన్సీ ప్లానింగ్​కి ముందు పీజీడి టెస్ట్ చేస్తారు. దీనినే పేరెంటల్ జెనిటిక్ డయాగ్నోసిస్ టెస్ట్ అంటారు. దీనిలో నాన్ ఇన్​వెన్సివ్ పేరంటల్ టెస్ట్ ఉంటుంది. అలాగే అల్ట్రా సౌండ్ క్రానిక్ విల్లస్ సాంపిల్స్, కార్డోసెన్టిసిస్, ఎమినోసైటిస్​ టెస్ట్​లు కూడా ఉంటాయి. వీటి ద్వారా గర్భంలోని శిశువు ఏ కండీషన్​లో ఉందో.. తెలుసుకుంటారు. 

బేబి గర్భంలో రెడీ అయిపోయిన తర్వాత శిశువులోని కణాలు తీసి.. వాళ్ల ఫిజికల్ ఎబిలిటీస్ ఎలా ఉన్నాయో చెక్ చేస్తారు. సమస్య ఉన్న బేబిని శస్త్రచికిత్స ద్వారా తొలగిస్తారు. ఇలా టెస్ట్​లు చేసి హెల్తీ బేబిని కోసం ప్రయత్నించవచ్చు. అయితే ఇవన్నీ చేయించుకోవడం కంటే మేనరికం అనే పెళ్లిల్లు చేసుకోకపోవడమే మంచిదంటున్నారు. చేసుకోవాలనుకుంటే ముందు టెస్ట్​లు చేసుకుని.. ఏ సమస్యలు లేవు అనుకున్నప్పుడే చేసుకుంటే మంచిదని చెప్తున్నారు. మొత్తానికి మేనరికాలు చేసుకోకపోవడం ఇంకా మంచిదని చెప్తున్నారు. 

 

Also Read : లైగింక జీవితంపై థైరాయిడ్ ప్రభావం.. స్త్రీలలో, మగవారిలో కలిగే సైడ్ ఎఫెక్ట్స్ ఇవే


 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

Common Krait Poisonous Snake: దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
దోమ కుట్టినట్లు అనిపిస్తుంది.. నేరుగా నాడీ వ్యవస్థపై విషం ప్రభావం- కట్లపాము అంత ప్రమాదకరమా?
India Fertility Rate : భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
భారతదేశంలో తగ్గిపోయిన సంతానోత్పత్తి రేటు.. పిల్లలు కావాలనుకుంటున్నారు కానీ..
Flu Vaccine : ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
ఫ్లూను నిర్లక్ష్యం చేస్తే ప్రమాదం అంటోన్న నిపుణులు.. ప్రతి ఏడాది టీకా తీసుకోవాల్సిందేనట
Poor Sleep and Stress : ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి
ఒత్తిడి, నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారా? నగర జీవనశైలిలో ఈ అలవాట్లు తప్పనిసరి

వీడియోలు

Ujjaini Mahankali Bonalu 2026 | అమ్మవారికి తొలి బోనం సమర్పించిన పొన్నం
HYDRAA Restores Uppal Nalla Cheruvu Lake | ఉప్పల్ నల్లచెరువుకు కొత్త జలకళ
Trinayani Serial Actress Ashika Padukone | 'త్రినయని' ఆషికా రియల్ లైఫ్ సీక్రెట్స్
Hardik Pandya Comments On Captaincy | కెప్టెన్సీపై హార్దిక్ పాండ్యా షాకింగ్ కామెంట్స్
Vaibhav Suryavanshi Vice Captaincy | 15 ఏళ్ల కుర్రాడికి వైస్ కెప్టెన్సీ ఏంటి?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
ఉజ్జయిని మహంకాళి బోనాలు.. అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. బోనం సమర్పించిన మంత్రులు
Friendship Day Tragedy: విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
విషాదాన్ని నింపిన ఫ్రెండ్‌షిప్ డే.. ఫొటోలు దిగుతుండగా విశాఖ బీచ్‌లో ఇద్దరు గల్లంతు
Kaleshwaram Project Report: కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
కాళేశ్వరం బ్యారేజీల కింద భూగర్భ సమస్యలు.. జీపీఆర్ పరీక్షలపై CWPRS నివేదికలో సంచలన విషయాలు!
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
తక్కువ ఇంధన ఖర్చు, అద్భుతమైన మైలేజ్.. త్వరలో మార్కెట్లోకి Baleno Facelift 2026 
Hrithik Roshan Vs Kangana Ranaut: సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
సారీ హృతిక్... ఇంటర్నెట్‌లో జెన్ జీ రచ్చ... కంగనా ఫైర్ - అసలు ఏం జరిగిందంటే?
Adilabad Airport Credit War: ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
ఆదిలాబాద్ ఎయిర్ పోర్ట్ మంజూరు చేసింది కాంగ్రెస్! బీజం వేసింది నేనే: మాజీ ఎంపీ సోయం బాపూరావు
CWG India Medals: కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
కామన్వెల్త్ లో భారత్ పంచ్ పవర్.. 4వ స్థానానికి ఇండియా జంప్, 39 పతకాలతో రికార్డు!
Samantha: బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
బేబీ బంప్‌తో సమంత లేటెస్ట్ ఫోటోషూట్... పవర్ ఫుల్ మెసేజ్ కూడా
Embed widget