ఇట్స్ బాయ్ థింగ్, అబ్బాయిలూ ఉదయాన్నే అలా జరక్కపోతే, త్వరగా చచ్చిపోతారట!
అబ్బాయిలూ, మీకో గుడ్ న్యూస్, మరొక బ్యాడ్ న్యూస్. ఉదయాన్నే మీ ప్రమేయం లేకుండా అంగం స్తంభిస్తున్నట్లయితే, ఇది మీకు గుడ్ న్యూస్. అలా లేకపోతే మాత్రం చాలా బ్యాడ్ న్యూస్.
ఉదయం వేళల్లో అబ్బాయిలకు తమ ప్రమేయం లేకుండానే అంగ స్తంభన కలుగుతుంది. సాధారణంగా ఏదైనా కొంటె కోరికలు కల్లోకి వచ్చినప్పుడో, ఊహించుకున్నప్పుడో లేదా అమ్మాయిల చేతి స్పర్శ వల్లో ఇలా జరుగుతుంది. అయితే, ఉదయం వేళల్లో అలాంటి ఆలోచనలు లేకుండానే అంగం గట్టిపడుతుంది. ఇలా రోజూ జరిగితే మీరు చాలా లక్కీ. ఒక వేళ అలా జరగకపోతే మాత్రం మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి.
తాజా పరిశోధన ప్రకారం.. క్రమం తప్పకుండా ఉదయం అంగస్తంభన పొందే పురుషులు ఎక్కువ కాలం జీవిస్తారట. అలాంటివారు గుండె జబ్బులు, స్ట్రోక్స్ వంటి ప్రమాదక వ్యాధులతో చనిపోయే అవకాశం చాలా తక్కువగా ఉందని వైద్యులు కనుగొన్నారు. ఈ పరిశోధన కోసం నిపుణులు.. బెల్జియంలో సుమారు 1,800 మంది మధ్య వయస్కులు, వృద్ధులను 12 సంవత్సరాల పాటు ట్రాక్ చేశారు. వారు ఎన్నిసార్లు, ఎప్పుడు ఉద్రేకానికి గురయ్యారని అడిగి తెలుసుకున్నారు.
నిత్యం ఉదయం వేళల్లో అంగ స్తంభన కలిగే వ్యక్తులు తక్కువ వయస్సులోనే చనిపోయే అవకాశాలు 22 శాతం తక్కువని తెలుసుకున్నారు. రాత్రి, ఉదయం వేళల్లో ప్రమేయం లేకుండా అంగ స్తంభనలు కలగడం మంచి రక్త ప్రసరణకు సంకేతామని పరిశోధకులు వెల్లడించారు. దీనివల్ల ప్రాణాంతక అనారోగ్యాల ప్రమాదం తగ్గుతుందని పేర్కొన్నారు.
యూనివర్శిటీ హాస్పిటల్ లీవెన్‌కు చెందిన ప్రముఖ పరిశోధకుడు డాక్టర్ లీన్ ఆంటోనియో ‘ఏజ్ అండ్ ఏజింగ్’ అనే జర్నల్‌తో మాట్లాడుతూ.. ‘‘అంగస్తంభన లోపాలు, ఉదయాన్నే అంగస్తంభనలు తగ్గిపోవడం వల్ల మరణాల సంఖ్య పెరుగుతుంది. రాత్రి నిద్రపోయే సమయంలో ఐదు అంగస్తంభనలు జరుగుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. టెస్టోస్టెరాన్ స్థాయిలు పెరగడం వల్ల కూడా ఉదయాన్నే ఉద్రేకం ఏర్పడుతుంది’’ అని తెలిపారు.
Also Read: కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి
పురుషుల వయస్సులో హార్మోన్ల మార్పుల వల్ల రాత్రి వేళ ఉద్రేకాలు(అంగ స్తంభనలు) తక్కువగా ఉంటాయి. ఇది ఆకస్మిక అనారోగ్య సమస్యలను సూచిస్తుంది. బ్రిటీష్ సొసైటీ ఫర్ సెక్సువల్ మెడిసిన్ మాజీ ప్రెసిడెంట్ డాక్టర్ జియోఫ్ హాకెట్ ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ.. ‘‘ధమనులు సరిగ్గా పని చేయకపోతే ఉదయం వేళల్లో అంగ స్తంభన జరగదు. ఈ సమస్య ఏర్పడిన మూడు, నుంచి ఐదు సంవత్సరాల్లో మీరు గుండెపోటు, లేదా స్ట్రోక్‌కు గురయ్యే ప్రమాదం ఉంది. ఇది కేవలం పెళ్లయిన వ్యక్తులకే కాదు, ‘సింగిల్స్’కు కూడా వర్తిస్తుందని తెలిపారు.
Also Read: కారులో సెక్స్ చేసిన మహిళకు రూ.40 కోట్లు పరిహారం, ఇదెక్కడి విడ్డూరం!