కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి
ఏదైనా పెద్ద నిర్ణయాన్ని తీసుకోవాలని అనుకుంటున్నారా? అయితే, ‘‘మీ పార్టనర్‌తో ఏకాంత క్షణాలను ఆస్వాదించండి. ఆ తర్వాతే మీ నిర్ణయాన్ని చెప్పండి’ అని వైద్య నిపుణులు అంటున్నారు.
కొన్ని నిర్ణయాలు జీవితాన్ని మార్చేస్తాయి. ఆవేశంలో లేదా ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోకూడదని మన పెద్దలు చెబుతుంటారు. ఏదైనా డెసిషన్ తీసుకొనే ముందు మనసు, శరీరం ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే తగినన్ని నిర్ణయాలు తీసుకోగలం. ఇందుకు సెక్స్ సరైన మార్గమని నిపుణులు చెబుతున్నారు. శృంగారంలో పాల్గొన్న తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని తెలుపుతున్నారు.
పూర్వం రాజులు ఏదైనా నిర్ణయాన్ని తీసుకొనే ముందు తమ భార్యలతో సెక్సులో పాల్గొనేవారట. కానీ, ఇప్పుడు రోజులు మారాయి. ఇల్లు గడిచేందుకు అంతా తమ ఉద్యోగాల్లో బిజీ బిజీగా గడిపేస్తున్నారు. పని ఒత్తిడిలోనే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఫలితంగా చిక్కుల్లో పడుతున్నారు. సెక్స్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తూ ప్రశాంతంగా గడిపే వ్యక్తులు ఈ రోజుల్లో చాలా తక్కువ. అయితే, నిపుణులు మాత్రం.. అలా పనిలో పడి సెక్స్‌ను నిర్లక్ష్యం చేయొద్దని, ఏదైన కీలక నిర్ణయం తీసుకొనే ముందు సెక్స్‌లో పాల్గోండని చెబుతున్నారు.
రిలేషన్‌షిప్ నిపుణుడు పిప్పా మర్ఫీ ఓ ఇంటర్నెషనల్ వెబ్ సైట్‌తో మాట్లాడుతూ.. ‘‘సెక్స్ సమయంలో విడుదలయ్యే హార్మోన్లు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఇందులో డోపమైన్, ఎండార్ఫిన్లు, ఆక్సిటోసిన్ ఉంటాయి. ఇవన్నీ మీకు మంచి అనుభూతిని కలిగిస్తాయి. ఏకాగ్రతను పెంచుతాయి. ఆ హర్మోన్లు మిమ్మల్ని బ్యాలెన్స్ చేస్తాయి. సెక్స్ చేయడం వల్ల ఒత్తిడి కలిగించే కార్టిసాల్ హార్మోన్ స్థాయిలు కూడా తగ్గుతాయి’’ అని తెలిపారు.
సెక్స్.. ఒత్తిడి నుంచి దూరం చేస్తుంది. పరధ్యానాన్ని తొలగించి అప్రమత్తంగా ఉండేందుకు సహకరిస్తుంది. అతిగా ఆలోచించే లక్షణం నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఓర్లాండో హెల్త్‌లోని యూరాలజిస్ట్ జామిన్ బ్రహ్మ్‌భట్ మాట్లాడుతూ.. సెక్స్ తర్వాత శరీరం, మనస్సు నిర్దిష్ట ప్రతిస్పందనను కలిగి ఉంటాయి. కొంతమంది పురుషులు స్ఖలనం తర్వాత రిలాక్స్‌గా ఫీలవుతారు. కొందరు నిద్రలోకి జారుకుంటారు. మరికొందరు ఇతర పనులపై దృష్టిపెడతారు’’ అని తెలిపారు.
MRI అధ్యయనాల ప్రకారం.. సెక్స్‌కు ముందు మెదడులోని లింబిక్ సిస్టమ్ (భావోద్వేగ కేంద్రం) జ్ఞాపకశక్తి, భయం, దూకుడు, ఇతర భావోద్వేగాలకు బాధ్యత వహిస్తుంది. సెక్స్ తర్వాత డోపమైన్ స్థాయిలు పడిపోయి, ప్రోలాక్టిన్లో పెరుగుతాయి. హార్మోన్లలో ఈ మార్పు మెదడును యాక్టీవ్‌గా ఉంచుతుంది. ఒత్తిడిని కలిగించే అంశాలను దాదాపు పక్కకు నెట్టేస్తుంది. అయితే, ఒకొక్కరిలో ఒక్కోలా ఈ ప్రభావం ఉంటుందని పలువురు నిపుణులు వాదిస్తున్నారు. సెక్స్ వల్ల కొందరు ఒత్తిడిని కోల్పోతే మరికొందరు దానికి పూర్తి వ్యతిరేక అనుభూతిని పొందుతారని చెబుతున్నారు.
Also Read: తగ్గేదేలే, కొత్త పెళ్లికొడుకు అత్యాశ ఫలితం, 20 రోజులుగా అంగస్తంభన, ఇక జీవితాంతం అంతేనట!
కొంతమందిలో ‘పోస్ట్‌కోయిటల్ డైస్ఫోరియా’ ఏర్పడుతుంది. దీని వల్ల మానసిక ఆందోళనకు గురవ్వుతారు. 2010లో జరిపిన ఒక అధ్యయనం ప్రకారం 32.9 శాతం మంది వ్యక్తులు సెక్స్ తర్వాత ప్రతికూల మానసిక స్థితిని ఎదుర్కొన్నారు. ఇందుకు కారణాలను మాత్రం నిపుణులు తెలుసుకోలేకపోయారు. ఈ ఆందోళన గల కారణాన్ని.. దాన్ని అనుభవించే వ్యక్తి కూడా చెప్పలేరట. ఏది ఏమైనా.. మిగతా 77 శాతం మందిలో మాత్రం సెక్స్ మంచి ఫలితమే చూపించింది. కాబట్టి.. మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోడానికి, కీలక నిర్ణయాలను తీసుకొనే ముందు మీ పార్టనర్‌తో జత కట్టండి.
Also Read: గుడ్ న్యూస్, ‘బరువు’ తగ్గిస్తున్న డయాబెటిక్ మందు, వ్యాయామం అక్కర్లేదట!
గమనిక: వివిధ అధ్యయనాలు, వైద్య నిపుణులు, వైద్య కథనాల్లో పేర్కొన్న అంశాలను మీ అవగాహన కోసం యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.