అన్వేషించండి

Car Insurance: కారులో సెక్స్ చేసిన మహిళకు రూ.40 కోట్లు పరిహారం, ఇదెక్కడి విడ్డూరం!

ఆ రోజు వారిద్దరూ కారులో బాగానే ఎంజాయ్ చేశారు. కానీ, ఆ రోజు జరిగిన సెక్స్ వల్ల ఆమెకు ఊహించని చేదు అనుభవం ఎదురైంది. ఇందుకు కారు బీమా సంస్థ పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి వచ్చింది.

‘జాతి రత్నాలు’ సినిమాలో కోర్టు సీన్ మీకు గుర్తుందా? అందులో ఓ కేసులో అరెస్టయిన హీరో, అతడి స్నేహితులకు కేసు వాదించే ఫరియా అబ్దుల్లా.. ‘‘ఇచ్చేయండి సార్, బెయిల్ ఇచ్చేయండి’’ అన్నట్లుగా ఓ కోర్టు తీర్పు ఇచ్చింది. కారులో సెక్స్ చేసిన ఓ మహిళ.. తనకు సెక్సువల్ ట్రాన్స్‌మిటెడ్ డిసీజ్ (STD)రావడానికి.. ఆ కారే కారణమని చెబుతూ కోర్టును ఆశ్రయించింది. ఆ కారు బీమా సంస్థపై రూ.40 కోట్ల దావా వేసింది. ఈ కేసు విచారించిన కోర్టు.. ఆమె వాదనను సమర్దిస్తూ.. ఆ రూ.40 కోట్లు చెల్లించాలని తీర్పు ఇచ్చింది. దీంతో ఆ బీమా సంస్థ దిక్కుతోచని స్థితిలో ఉంది. త్వరలోనే ఆమెకు ఆ బీమా మొత్తం అందే అవకాశం ఉంది. 

అమెరికాలోని మిస్సౌరీలో నివసిస్తున్న ఓ మహిళ తన ప్రియుడితో కలిసి కారులో సెక్స్ చేసింది. ఆ తర్వాత ఆమె లైంగిక వ్యాధి సంక్రమించింది. ఇందుకు ఆ కారు బీమా సంస్థే బాధ్యత వహించాలంటూ ఆమె ఇన్సురెన్స్ సంస్థ GEICOపై 5.2 మిలియన్లు (రూ.40 కోట్లు) దావా వేసింది. ఇటీవల ఈ కేసును విచారించిన జాక్సన్ కౌంటీ కోర్టు ఆమె వానదను సమర్థించింది. 

అయితే, ఈ క్లెయిమ్ పాలసీ పరిధిలోకి రాదని ఆ బీమా సంస్థ వాదించింది. వారు కారులో సెక్స్ చేసుకుంటే బీమా సంస్థ ఎందుకు బాధ్యత వహించాలని ఆ సంస్థ న్యాయవాదుల వాదించారు. అయితే, ఆమె తరఫు న్యాయవాదులు మాత్రం బీమా సంస్థకు వ్యతిరేకంగా బలమైన వాదనలు వినిపించారు. ఆ కారుకు బీమా కడుతున్న కస్టమర్(ఆమె ప్రియుడు) తనకు STD ఉందనే విషయాన్ని చెప్పకుండా ఆమెతో కారులో సెక్సులో పాల్గొన్నాడని తెలిపారు. కారులో కలిసినప్పుడే ఆమెకు ఆ నష్టం జరిగింది కాబట్టి. ప్రతిఫలంగా ఆ కారు సంస్థ ఆమె వైద్య ఖర్చులకు, జరిగిన నష్టానికి బాధ్యత వహించాలని ఆమె న్యాయవాదులు పేర్కొన్నారు. 

ఈ నేపథ్యంలో కోర్టు బాధితురాలికి సానుకూలంగా తీర్పు ఇచ్చింది. దిగువ కోర్టు ఇచ్చిన ఈ ఆదేశాన్ని GEICO సంస్థ ఫెడరల్ కోర్టులో సవాల్ చేసింది. అయితే, అక్కడ కూడా బీమా సంస్థకు చేదు అనుభవం ఎదురైంది. ఈ కేసును ఆమె ఫిబ్రవరి, 2021లో నమోదు చేసింది. 2017 సంవత్సరంలో కారులో జరిగిన సెక్స్ వల్ల బాధితురాలికి హ్యూమన్ పాపిల్లోమా వైరస్‌(HPV)ని సంక్రమించిందని, అసురక్షిత సెక్స్‌కు ఆ కారే డైరెక్టుగా లేదా ఇన్‌డైరెక్టుగా కారణమైంది కాబట్టి, బీమా సంస్థ పరిహారం చెల్లించాల్సిదేనని పేర్కొంది. అతడికి హెచ్‌పీవీ ఉందని తెలిసి కూడా అతడు ఆమెతో సెక్సులో పాల్గొన్నాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఆ కారు కస్టమర్ చేసిన తప్పుకు బాధ్యత వహిస్తూ.. ఆ బీమా పాలసి ద్వారా ఆమెకు పరిహారం చెల్లించాలనేది కోర్టు ఉద్దేశం. మరి, ఆ బీమా సంస్థ ఏం చేస్తుందో చూడాలి. 

Also Read: చేపలు తింటే చర్మ క్యాన్సర్ వస్తుందా? షాకింగ్ న్యూస్ చెప్పిన పరిశోధకులు

Also Read: కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు సెక్స్ చేయాలట! నిపుణులు ఏం చెప్పారో చూడండి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: 'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
'రూ.500 కోట్ల ప్యాలెస్ కట్టారు కానీ రోడ్లు వేయలేదు' - రోడ్ల అభివృద్ధిపై డిప్యూటీ సీఎం పవన్ కీలక ప్రకటన
Adani Group: అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా  !
అదానీపై అమెరికా కేసులో సంచలనం - అటార్నీ రాజీనామా !
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Variety Thief: ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
ప.గో జిల్లాలో వెరైటీ దొంగ - మహిళల జాకెట్లు కనిపిస్తే వదిలిపెట్టడు, ఎలా దొరికాడంటే?
Yogi Adityanath: ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్-  అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
ఔరంగజేబు వారసులు ఇప్పుడు రిక్షా పుల్లర్స్- అది దేవుడు రాసిన స్క్రిప్ట్ - యూపీ సీఎం వ్యాఖ్యలు వైరల్
Daaku Maharaaj: డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
డాకు మహారాజ్ రెండో పాట రెడీ... చైల్డ్ సెంటిమెంట్ సాంగ్‌తో వస్తున్న బాలకృష్ణ
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Embed widget