అన్వేషించండి

High Risk Types HPV: ఇదేం వైరస్‌ అండి బాబు.. పురుషుల మగతనానికే సవాల్ విసురుతోందిగా, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

HPV హై-రిస్క్ ఇన్ఫెక్షన్ సోకిన పురుషులలో లైంగిక సంబంధ సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తాజా అధ్యయం వెల్లడించింది. వీర్యం నాణ్యత తగ్గి, సంతానోత్పత్తి సమస్య తలెత్తుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు.

Does HPV Affect Men's Fertility: హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (HPV) గురించి తరచుగా వింటూనే ఉంటాం. స్త్రీలలో HPV గర్భాశయ క్యాన్సర్‌కు కారణం అవుతుంది. తాజాగా ఈ వైరస్ కారణంగా పురుషులలో లైంగిక సామర్థ్యాన్ని దెబ్బతీయడంతో పాటు సంతానోత్పత్తి సమస్యలకు కారణం అవుతున్నట్లు పరిశోధనలో వెల్లడైంది.

HPVతో లైంగిక సంబంధ ఇన్ఫెక్షన్లు

హ్యూమన్ పాపిల్లోమా వైరస్ తో లైంగిక సంబంధ ఇన్ఫెక్షన్లు సోకుతాయి. ఈ ఇన్ఫెక్షన్లు రెండు రకాలు ఉంటాయి. వాటిలో ఒకటి అధిక ప్రమాదకరమైన ఇన్ఫెక్షన్ కాగా, మరొకటి తక్కువ ప్రమాదం కలిగిన ఇన్ఫెక్షన్. హై రిస్క్ ఇన్ఫెక్షన్ సోకిన పురుషులలో లైంగిక సమస్యలు తలెత్తినట్లు సెల్యులార్, ఇన్ఫెక్షన్ మైక్రోబయాలజీలో జర్నల్‌ లో ప్రచురించిన కథనం వెల్లడించింది. అర్జెంటీనాకు చెందిన నేషనల్ యూనివర్శిటీ ఆఫ్ కార్డోబా పరిశోధకులు 205 యువ పురుషుల వీర్యం క్వాలిటీని పరిశీలించారు. వారిలో 39 మందికి HPV పాజిటివ్ గా ఉంది. వారిలో 20 మందికి హై రిస్క్ ఇన్ఫెక్షన్‌ను కలిగి ఉన్నారు. ఏడుగురు తక్కువ-రిస్క్ ఇన్ఫెక్షన్‌తో ఉన్నారు. మరో 12 మంది మధ్య తరహా రిస్క్‌ను కలిగి ఉన్నారు.

హైరిస్క్ ఇన్ఫెక్షన్‌తో సంతాన సమస్యలు 

మొత్తం 39 మంది HPV-పాజిటివ్ పురుషుల వీర్యాన్ని 43 మంది HPV నె‌గటివ్ పురుషుల వీర్యంతో పోల్చారు పరిశోధకులు. వీరిలో వీర్యం నాణ్యత భిన్నంగా లేకపోయినా, మరింత  లోతుగా పరిశీలిస్తే, హై రిస్క్ ఇన్ఫెక్షన్ సోకిన  పురుషుల నుంచి తీసుకున్న శాంపిల్స్‌లో రోగనిరోధక కణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. HPV హై-రిస్క్ వెర్షన్ సోకిన పురుషుల స్పెర్మ్ ఆక్సీకరణ ఒత్తిడి కారణంగా పదేపదే దెబ్బతింటుందని వెల్లడించారు. ఈ పురుషులలో రియాక్టివ్ ఆక్సిజన్ స్పైసెస్(ROS) ఉత్పత్తిని బట్టి క్వాలిటీని నిర్ణయిస్తారు. ROS తక్కువ స్థాయిలో సాధారణ స్పెర్మ్ ఉత్పత్తి అయితే, ఎక్కువ స్థాయి కణాల బాహ్య కవచం చీలిపోయి వీర్య కణాలు చనిపోతున్నాయని గుర్తించారు. హై-రిస్క్ వైరస్ ఉన్న HPV- పాజిటివ్ పురుషులలో ఎక్కువ సంఖ్యలో చనిపోయిన స్పెర్మ్ కణాలను పరిశోధకులు కనుగొన్నారు. లో రిస్క్- HPV సోకిన పురుషులతో పోల్చిత, హైరిస్క్ ఇన్ఫెక్షన్ సోకిన పురుషులలో ఆక్సీకరణ ఒత్తిడి, బలహీనమైన రోగనిరోధక ప్రతిస్పందన కారణంగా స్పెర్మ్ డెత్ పెరిగినట్లు పరిశోధకులు తెలిపారు. దీన్ని బట్టి హై రిస్క్ HPV సోకిన పురుషులలో సంతానోత్పత్తి సామర్థ్యం బలహీనపడే అవకాశం ఉందన్నారు. 

HPVతో స్త్రీ, పురుషులలో సోకే వ్యాధులు   

HPV హైరిస్క్ ఇన్ఫెక్షన్ కారణంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ సోకుతుంది. స్త్రీ, పురుషులలో జననేంద్రియ, నోరు, గొంతు క్యాన్సర్లు సోకుతున్నట్లు గుర్తించారు. HPVలో రిస్క్ ఇన్ఫెక్షన్లు మహిళలలో గర్భాశయ కణాలతో పాటు స్వరపేటిక, పురుషులు, స్త్రీలలో జననేంద్రియాల ఉపరితలంపై మొటిమలు ఉంటాయని పరిశోధకులు వెల్లడించారు. 

Read Also: తీపి తినకుండానే మీకు డయాబెటిస్ వచ్చేసిందా? కారణం.. కరోనా అంటే నమ్ముతారా? ఇదిగో కొత్త ముప్పు!

Read Also: ఇంట్లో మునగ చెట్టు ఒకటి ఉంటే చాలు.. ఈ సమస్యలన్నీ పరార్, ఇన్ని లాభాలు ఉంటాయని మీరు ఊహించి ఉండరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కాలింగ్ బెల్ కొట్టి మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగబీఆర్ఎస్ నేత శ్రీనివాస్ గౌడ్‌పై టీటీడీ ఛైర్మన్ ఆగ్రహంచిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సంఏసీబీ కేసు కొట్టేయాలని కోరుతూ హైకోర్టులో కేటీఆర్ పిటిషన్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy: 'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
'ధరణి' రైతులకు భూములను దూరం చేసింది - విపక్షం అహంకారంతో వ్యవహరిస్తోందని సీఎం రేవంత్ తీవ్ర ఆగ్రహం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Inquiry on Dharani Portal Irregularities: తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం- ధరణి పేరుతో జరిగిన అక్రమాలపై విచారణకు ఆదేశం
Maruti Swift: మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
మారుతి సుజుకి స్విఫ్ట్‌ను ఈఎంఐలో ఎలా కొనుగోలు చేయాలి - డౌన్‌పేమెంట్ ఎంత కట్టాలి?
KTR And ED : కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
కేటీఆర్ చుట్టూ ఈడీ ఉచ్చు- ఫార్ములా-ఇ కేసులో విచారణకు రెడీ?
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
తెలంగాణలో అసెంబ్లీలో గందరగోళం- షేక్ చేసిన ఫార్ములా-ఈ కేసు
Viduthalai 2 Review: విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
విడుదల పార్ట్ 2 రివ్యూ: విజయ్ సేతుపతి, వెట్రిమారన్‌ల బ్లాక్‌బస్టర్ సీక్వెల్ ఎలా ఉంది? - పార్ట్ 3 కూడా ఉంటుందా?
Tamil Nadu: విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు -  భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
విడాకుల పేరుతో మనోవర్తి కోసం వేధింపులు - భార్యకు ఈ భర్త ఇచ్చిన షాక్ మాములుగా లేదు !
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
మళ్లీ మేమే వస్తామనుకున్నాం.. మస్క్‌నీ పట్టుకురావాలని ప్లాన్ చేశాం
Embed widget