అన్వేషించండి

Moringa Health Benefits: ఇంట్లో మునగ చెట్టు ఒకటి ఉంటే చాలు.. ఈ సమస్యలన్నీ పరార్, ఇన్ని లాభాలు ఉంటాయని మీరు ఊహించి ఉండరు

మునగ చెట్టుతో బోలెడు లాభాలున్నాయి. మిరాకిల్ ట్రీగా పిలిచే ఈ చెట్టు ఆకులు, కాయలు, పూతలోనూ ఔషధ గుణాలుంటాయి. ముగనతో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Moringa Nutrition Facts: మునగ చెట్టులోని ప్రతి భాగంగా మనిషి ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది. వేళ్ల నుంచి మొదలుకొని ఆకుల వరకు అన్నింటిలోనూ పోషక విలువలు, ఔషధ గుణాలు ఉంటాయి. అందుకే మునగ చెట్టును ‘మిరాకిల్ ట్రీ‘గా అభివర్ణిస్తారు. మునగలో ఎలాంటి పోషకాలున్నాయి? వాటి ద్వారా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో చూద్దాం.

కండ్లకలకలు, రక్తహీనత, జీర్ణ సమస్యలతో పాటు పలు వ్యాధులకు సాంప్రదాయ చికిత్సలలో మునగ ఆకులను ఉపయోగిస్తారు. మునగాకులతో బాలింతల్లో పాలు పెరగడంతో పాటు డయాబెటిస్, బీపీని అద్భుతంగా అదుపు చేస్తాయి. మునగ ఆకుల రసం తాగినా, మునగ ఆకులను వేయించి కారం పొడిగా తీసుకున్న ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తాజాగా శాంట్ లాంగోవాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ ఇంజినీరింగ్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో కీలక విషయాలు వెల్లడయ్యాయి. మునగతో శరీరానికి అవసరమైన పోషకాహారం లభించడంతో పాటు చక్కటి  ఆరోగ్యాన్ని అందిస్తుందని తేలింది.   

పోషకాల నిధి మునగ

మునగలో బోలెడు పోషకాలు ఉన్నాయి. ఇంతకీ ఆ పోషకాలు ఏవి? వాటితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటే..

ప్రోటీన్: ఎంజైమ్‌లు, హార్మోన్ల ఉత్పత్తికి ప్రోటీన్ చాలా అవసరం. ఆరోగ్యకరమైన చర్మం, రక్తం ప్రసరణ, రోగనిరోధక వ్యవస్థలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రోటీన్  సహాయపడుతుంది. మునగ ఆకులలో 10.74 శాతం నుంచి 30.29 శాతం ప్రోటీన్ ఉంటుంది. కండరాల పెరుగుదల, కణజాల మరమ్మతులు, ఇతర శారీరక విధులను పకడ్బందీగా నిర్వహించేందుకు మునగ ఆకులు సాయపడుతాయి. 

అమైనో ఆమ్లాలు: మునగ ఆకులలో శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని శరీరం స్వయంగా ఉత్పత్తి చేసుకోదు. ఈ అమైనో ఆమ్లాలు ప్రోటీన్ సంశ్లేషణ, కండరాల అభివృద్ధి, న్యూరో ట్రాన్స్ మీటర్ పనితీరుకు సాయపడుతాయి. శరీరం ఆరోగ్యంగా ఉండేందుకు అమైనో ఆమ్లాలు కీలపాత్ర పోషిస్తాయి. 

ప్రో విటమిన్ A: మునగ ఆకులలో ప్రొవిటమిన్ A లేదంటే బీటా-కెరోటిన్ అధికంగా ఉంటుంది. దీనిని శరీరం విటమిన్ A గా మారుస్తుంది. ఈ విటమిన్ చర్మాన్ని మరింత ఆరోగ్యంగా మార్చడంలో, చక్కటి నిగారింపు కలగడంలో ఉపయోగపడుతుంది. అటు రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలోనూ ముగన ఆకులలోని బీటా కెరోటిన్ ఎంతగానో సాయపడుతాయి. 

ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు: మునగ ఆకులలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి ఎంతగానో ఉపయోగపడుతాయి. ఒమేగా -3 ఫ్యాటీ ఆమ్లాలు వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. రక్తపోటును అదుపు చేయడంతో పాటు గుండె పనితీరును మెరుగు పరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. 

ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు: మునగ ఆకులలో ఒమేగా-6 కొవ్వు ఆమ్లాలు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సాయపడుతాయి. మెదడు పనితీరును మెరుగు పరచడంతో పాటు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. హార్మోన్ల ఉత్పత్తిని క్రమబద్దీకరించడంలో ఒమేగా -6 ఆమ్లాలు ఉపయోగపడుతాయి.

Read Also: మునగాకు మధుమేహాన్ని అదుపులో ఉంచుతుందా? ఎంత మోతాదులో తీసుకుంటే మేలు?

Read Also: ఉదయమే మునగాకు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? అస్సలు నమ్మలేరు

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

Jani Master Issue Sr. Advocate Jayanthi Interview | జానీ మాస్టర్ కేసులో చట్టం ఏం చెబుతోంది.? | ABPISRO Projects Cabinet Fundings | స్పేస్ సైన్స్ రంగానికి తొలి ప్రాధాన్యతనిచ్చిన మోదీ సర్కార్ | ABPTDP revealed reports on TTD Laddus | టీటీడీ లడ్డూల ల్యాబ్ రిపోర్టులు బయటపెట్టిన టీడీపీ | ABP Desamహైదరాబాద్ దాటిన హైడ్రా బుల్‌డోజర్లు, ఇకపై రాష్ట్రవ్యాప్తంగా కూల్చివేతలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nara Lokesh: వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
వైవీ సుబ్బారెడ్డి ఇప్పుడు రెడీనా? నేను తిరుపతిలోనే ఉన్నా రండి ప్రమాణం చేయడానికి - లోకేశ్
Samineni Udaya Bhanu: వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
వైసీపీకి సామినేని గుడ్ బై - ఆ రోజే జనసేన కండువా, మరో నేత కూడా!
Jany Master Arrest: జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
జానీ మాస్టర్ అరెస్టుపై పోలీసులు కీలక ప్రకటన
Andhra Flood Relief: ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
ఏపీలో వరద నష్టం - గౌతమ్ ఆదానీ భారీ విరాళం, ఎంతంటే?
Harish Rao: 'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
'సీఎం రేవంత్ రెడ్డిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోండి' - ఏఐసీసీ చీఫ్‌ ఖర్గేకు మాజీ మంత్రి హరీష్ రావు బహిరంగ లేఖ
Kashmir Elections : కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
కశ్మీర్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు సపోర్టుగా పాకిస్థాన్ మంత్రి - బీజేపీకి ఇంత కంటే ఆయుధం దొరుకుతుందా ?
Naga Babu-Jani Master: నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
నాగబాబు వరుస ట్వీట్స్‌ - జానీ మాస్టర్‌ను ఉద్దేశించేనా?
Kadambari Jethwani 'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
'కేసు విత్ డ్రా చేసి న్యాయం చేయండి' - హోంమంత్రి అనితను కలిసి ముంబయి నటి కాదంబరి జత్వానీ
Embed widget