Drumstick leaves water: ఉదయమే మునగాకు నీళ్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా? అస్సలు నమ్మలేరు
Drumstick leaves health benefits: ఉదయాన్నే టీ కాఫీలకు బదులుగా వెచ్చని మునగాకు నీళ్లు తాగితే చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయట. అవేంటో చూసేయండి.
మునగాకులు యాంటీఆక్సిడెంట్లు, ఆవశ్యక పోషకాలలు పుష్కలంగా కలిగి ఉంటాయి. ఈ ఆకులు శతాబ్దాలుగా వైద్యంలోనూ ఉపయోగిస్తున్నారు. ఆయుర్వేదం ప్రకారం ప్రతిరోజు ఉదయమే మునగాకులను నానబట్టిన నీళ్లు తాగడం వల్ల చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగకరం. శరీరాన్ని డీటాక్స్ చెయ్యడంలో, జీవక్రియల రేటు పెంచడంలో, సహజంగా బరువుతగ్గడంలోనూ మునగాకు దోహదం చేస్తుంది. మునగాకులను రకరకాలుగా వినియోగించవచ్చు. వాటిలో ఒకటి పరగడుపునే మునగాకు డ్రింక్ తీసుకోవడం ఒక మంచి పద్ధతి.
ఈ డిటాక్స్ డ్రింక్ తో రోజు ప్రారంభించిన తర్వాత క్రమంగా చర్మం, జుట్టు మెరుపు సంతరించుకుంటాయి. లోపలి నుంచి తేలికగా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది మాత్రమే కాదు ఇంకా చాలా రకాల అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు సమకూరుతాయని నిపుణులు చెబుతున్నారు.
డిటాక్సిఫై చేస్తుంది
ఉదయాన్నే మునగ ఆకులు కలిపిన నీటిని తాగడం వల్ల మీ శరీరంలోని విషపదార్థాలు తొలగిపోతాయి. ఒక టెబుల్ స్పూన్ మునగాకుల పొడిని తీసుకొని ఉదయం తాగే వేచ్చని నీటిలో కలుపుకుని తాగవచ్చు.
జీవక్రియల రేటు పెరుగుతుంది
ఆ మ్యాజిక్ ఆకుల పొడి జీవక్రియ బూస్ట్ అవుతుంది. పరిశోధనల్లో మునగాకులోని సమ్మేళనాలు జీవక్రియ రేటు పెంచుతాయి. ఫలితంగా చాలా సహజమైన విధానంలో బరువు తగ్గుతారు. ఖాళీ కడుపుతో మునగాకు తీసుకోవడంతో జీవక్రియ రేటు రెట్టింపు అవుతుంది. ఫలితంగా రోజంతా శరీరం మరింత సమర్థవంతంగా క్యాలరీలను ఖర్చు చేస్తుంది.
పోషకాలతో బలవర్ధకం
మునగాకుల్లో యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. ఇవి ఫ్రీరాడికల్స్ వల్ల శరీరంలో కలిగే ఆక్సికరణ ఒత్తిడి నుంచి కాపాడుతాయి. ఈ ఆకుల్లో విటమిన్లు సి,ఏ ఉంటాయి. కాల్షియం, ఐరన్ వంటి కీలకమయిన ఖనిజాలు కూడా ఉంటాయి. వీటితో నిరోధక వ్యవస్థ బలోపేతం అవుతుంది. ఎముకలు, దంతాలు బలంగా తయారవుతాయి.
మధుమేహులకు కూడా
పరగడుపున మునగాకు నీళ్ల తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటి పెరుగుతుంది. ప్రీడయాబెటిక్ స్థాయిలో ఉన్నవారికి హెచ్ బీఏ1సి రీడింగ్ పెరగకుండా నివారించడం సాధ్యపడుతుంది.
జీర్ణసమస్యలకు మంచి మందు
అజీర్తి, కడుపుబ్బరంతో బాధపడేవారు ప్రతి ఉదయం మునగాకు కలిపిన డీటాక్స్ డ్రింక్ తో ప్రారంభిస్తే మ్యాజిక్ జరిగినట్టే సమస్యలు దూరమవుతాయట. దీనిలో ఉండే అధిక ఫైబర్ పేగుల్లో కదలికలు పెంచి మలబద్దకం నివారిస్తుంది. జీర్ణక్రియ ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తుంది.
శారీరక మానసిక శక్త పెంచుతుంది
రాత్రంతా నిద్ర పోయి లేచినా సరే ఉత్సాహంగా ఉండడం లేదా? బద్దకంగా అనిపిస్తూనే ఉందా? ఒక వారం పాటు రోజూ మునగాకు నీళ్లు తాగి చూస్తే ఈ రకమైన పరిస్థితి నుంచి బయట పడవచ్చు. ఉదయం కాఫీ లేదా టీ కి బదులుగా మునగాకు నీళ్లు తాగడం మొదలు పెడితే శరీరంలో కలిగే మార్పును స్వయంగా అనుభవించి చూడవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. పొద్దున్నె మునగాకు నీళ్లు తాగితే రోజంతా తాజాగా, శక్తవంతంగా, ఏకాగ్రతతో పనిచేసుకోవచ్చట.
Aslo read : Children Heart Disease: మీ పిల్లలకు ఇలాంటి ఆహారం పెడుతున్నారా? జాగ్రత్త, గుండె ఆగుద్ది