అన్వేషించండి

Men in Skirts: న్యూయార్క్ వీధుల్లో లెహెంగాతో డ్యాన్సులేస్తున్న కుర్రాడు, నెటిజన్లకు తెగ నచ్చేశాడు

న్యూయార్క్ లోని మీడియాకు జైనీల్ చాలా పరిచయం ఉన్న వ్యక్తి.

రద్ధీగా ఉన్న న్యూయార్క్ నగర వీధులు... 
రంగురంగుల లెహెంగాలో ఓ కుర్రాడు నెమలిలా ఆడుతుంటే చూపు తిప్పుకోలేకపోయారు చుట్టూ ఉన్న జనం. 
అబ్బాయికి, అమ్మాయి డ్రెస్సులో డ్యాన్సు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? అని అడిగితే అతను చెప్పే సమాధానం ఒక్కటే... 
‘లెహెంగాలో డ్యాన్సు వేస్తే చూసేందుకు కనులవిందుగా ఉంటుంది, అందుకే నేను తక్కువ సమయంలో మీ అందరికీ పరిచయం అయ్యా’ అంటాడు. నిజమే అతను సాధారణంగా ప్యాంటు, షర్టులో చేస్తే మనమంతా ఎందుకు ఇప్పుడిలా ప్రత్యేకంగా చెప్పుకుంటాం? 

ఎవరితను?
న్యూయార్క్‌లో ఉన్న వారికి ‘మెన్ ఇన్ స్కర్ట్స్’అంటే చాలు జైనీల్ మెహెతా గుర్తొచ్చేస్తారు. ఇప్పుడక్కడ ‘మెన్ ఇన్ స్కర్ట్స్’ అనేది ఒక బ్రాండుగా మారిపోయింది. అది హ్యాష్ ట్యాగ్ గా మారి ట్రెండయ్యింది కూడా. న్యూయార్క్ వీధుల్లో కుచ్చుల లెహెంగాలో జైనీల్ చిందేస్తే  బాలీవుడ్ హీరోయిన్లు గుర్తుకు రావాల్సిందే. న్యూయార్క్ మీడియాకు జైనీల్ బాగా పరిచయం ఉన్న వ్యక్తిగా మారిపోయారు.అక్కడున్న అన్ని మీడియాలు ఇతనిపై కథనాలు ప్రచురించాయి. అమ్మాయిలతో దుస్తుల షాపింగ్ కు వెళ్లేందుకే ఇష్టపడని అబ్బాయిలు ఎంతో మంది. అలాంటిది వారి దుస్తులు వేసుకుని పబ్లిక్‌లో డ్యాన్సులు వేయడానికి చాలా ధైర్యముండాలి. అందుకేనేమో జైనీల్ మెహెతా తక్కువ సమయంలోనే గుర్తింపు సాధించారు. 

సొంతూరు ఎక్కడ?
జైనీల్‌ది ముంబై. చిన్నప్పట్నించి క్లాసికల్ డ్యాన్సు నేర్చుకున్నారు. పదమూడేళ్ల వయసులో అమెరికా వలస వెళ్లారు. అక్కడే డ్యాన్సులో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి కొరియోగ్రాఫర్ గా కెరీర్ మొదలుపెట్టారు. ఏడేనిదేళ్ల వయసు నుంచే ఇలా లెహెంగాలో డ్యాన్సులు వేయడం మొదలుపెట్టానని చెబుతున్నారు జైనీల్. తనకు లెహెంగాల రంగులు, కుచ్చులు నచ్చుతాయని అందుకే అవి వేసుకుని డ్యాన్సులు చేయడం ప్రారంభించినట్టు చెబుతారు. మొన్నీ మధ్యనే అలియా భట్ సినిమా ‘గంగూబాయి కఠియావాడి’ సినిమాలోని ‘జుమె రె గోరి’ పాటకు డ్యాన్సు చేస్తే దాదాపు కోటి డబ్బై లక్షల మంది వీక్షించారు. 

సామి సామి పాటకు ఇలా...
పుష్ప సినిమా తెలుగులో కన్నా హిందీలో సూపర్ హిట్ కొట్టింది. అందులోని సామి సామి పాట ఎంతగా పాపులర్ అయ్యిందో చెప్పక్కర్లేదు. హిందీ ‘సామి సామి’ పాటకు చక్కగా నాట్యం చేశారు జైనీల్. చూస్తే అలా చూస్తూ ఉండిపోవాలనిపించేలా ఉంది. ఇలాంటి  ఎన్నో ఉమెన్ ఓరియంటెడ్ పాటలకు నర్తించి ‘మెన్ ఇన్ స్కర్ట్స్’గా మారుమోగి పోయారు. 

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

లింగ సమానత్వం కోసం...
జెండర్ న్యూట్రలిటీకి పరోక్షంగా ఎంతో మద్ధతు ఇస్తున్నారు జైనీల్. అందుకే అతనికి వచ్చే మెసేజుల్లో దానికి సంబంధించే ఉంటాయి. ‘అమ్మాయిల డ్రెస్సు వేసుకుని ఇంత కాన్ఫిడెంట్ గా ఎలా డ్యాన్సు చేయగలుగుతున్నావ్? నువ్వు గ్రేట్’ అంటూ ఎన్నో మెచ్చుకోళ్లు అందుకుంటున్నారు. ‘పాజిటివ్ వైబ్స్ పంచడంలో నీ తరువాతే ఎవరైనా’ అంటూ అమ్మాయిలు రోజూ వందలాదిగా మెసేజులు పెడుతుంటారు.  

ఆయన ఇన్ స్టా ఖాతా స్కర్టుతో చేసిన డ్యాన్సులతో నిండిపోయింది. కావాలంటే మీరూ ఓ లుక్కేయండి... కచ్చితంగా రీఫ్రెష్ అవుతారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Jainil Mehta (@jainil_dreamtodance)

Also read: మీకు ఇంజెక్షన్ అంటే భయమా? అయితే మీ భయం పేరిదే

Also read: శరీరంలో షుగర్ స్థాయిలు నియంత్రణలో లేకపోతే ఏమవుతుందో తెలుసా? జరిగేది ఇదే

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

పసిపాపకి పాలు పట్టేందుకు అవస్థలు పడుతున్న తల్లిNirmal Man Returned from Kuwait: కువైట్‌లో గోట్‌లైఫ్ బతుకు! ఒక్క పోస్ట్‌తో సేఫ్‌గా సొంతూరికిRajendra Prasad: నటుడు రాజేంద్ర ప్రసాద్ ఇంట్లో విషాదంManchu Vishnu on Nagarjuna Issue | నాగార్జున, సమంత, నాగచైతన్య వెంటే ఉంటాం | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP TET Key: ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
ఏపీటెట్‌ అభ్యర్థులకు అలర్ట్, ప్రాథమిక ఆన్సర్ 'కీ' విడుదల చేసిన విద్యాశాఖ - డైరెక్ట్ లింక్ ఇదే
Haryana Exit Polls 2024: హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
హర్యానాలో బీజేపీకి బిగ్ షాక్, 10 ఏళ్ల తరువాత అధికారం కాంగ్రెస్ హస్తగతం- ఎగ్జిట్ పోల్ రిజల్ట్
Tirumala News: తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
తిరుమలలో అన్నదాన కేంద్రంలో అన్నంలో జెర్రి! భక్తులకు టీటీడీ విజ్ఞప్తి ఏంటంటే!
Jr NTR On Ayudha Pooja Song: ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
ఆయుధ పూజ షూటింగ్‌లో ఎన్టీఆర్‌కు గాయం - ఈసారి సాంగ్ చూస్తే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేయండి!
Jammu Kashmir Exit Polls 2024: జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్
జమ్మూకాశ్మీర్‌లో దుమ్ము రేపింది ఎవరు? తొలి బీజేపీ సీఎం ఛాన్స్ ఉందా? Exit Polls Result
Harsha Sai: 'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
'ఆ యూట్యూబ్ ఛానల్స్‌పై కేసు' - హర్షసాయి బాధితురాలి తరఫు న్యాయవాది స్ట్రాంగ్ వార్నింగ్
PM Kisan Scheme: రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
రైతుల ఖాతాల్లో నగదు జమ, రూ.20000 కోట్లు విడుదల చేసిన ప్రధాని మోదీ - ఇలా చెక్ చేసుకోండి
Revanth Reddy On Musi : మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
మూసీ నిర్వాసితులకు రూ. 10 వేల కోట్లు అయినా ఇస్తాం - పేదలను అడ్డం పెట్టుకుంటున్న పెద్దలు - రేవంత్ విమర్శలు
Embed widget