అన్వేషించండి

సంతానం కలగడం లేదా? అయితే, మెడిటరేనియన్ డైట్ ప్రయత్నించండి

అధిక బరువుతో బాధపడుతున్న వారు ఎలాగైనా బరువు తగ్గాలని అనుకుంటున్నారు. అందుకు రకరకాల భోజన విధానాలను, రకరకాల వ్యాయామ విధానాలను అనుసరిస్తున్నారు.

పాండమిక్ తర్వాత చాలా మంది ఆరోగ్యవంతమైన జీవన విధానంలో ఉండాలనే అనుకుంటున్నారు. పాండమిక్ ఆరోగ్యం ఎంత భాగ్యమో నేర్పించిందనే చెప్పాలి. చాలా మంది జీవిన విధానంలో మార్పులు చేసుకుంటూనే ఉన్నారు.  ఇలాంటి మార్పుల్లో  ఈ మధ్య బాగా ప్రాచూర్యం పొందిన డైట్ మెడిటరేనియన్ డైట్. మధ్యధరా సముద్రానికి సమీప దేశాలైన ఫ్రాన్స్, గ్రీస్, ఇటలీ, స్పెయిన్ వంటి దేశ వాసులు ఈ డైట్ ను అనుసరిస్తారు. ఈ డైట్ లో ఆలీవ్ నూనెను ప్రధానంగా వాడుతారు. మధ్యధరా సముద్ర పరిసర ప్రాంతాల్లో అనుసరించే ఈ డైట్ విధానం కనుక దీన్నీ మెడిటరేనియన్ డైట్ అని అంటారు.

ఏముంటాయి ఇందులో?

మెడిటరేనియన్ డైట్ లో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, రకరకాల లెగ్యూమ్స్, పాస్తా, హోల్ గ్రేయిన్ బ్రెడ్ వంటివన్నీ భాగం. వీటిని నిత్యం తీసుకోవాల్సి ఉంటుంది. మాంసాహారంలో భాగంగా చేపలు, ఇతర సీ ఫూడ్, చికెన్, గుడ్లు ఉంటాయి. పాలఉత్పత్తులో పరిమితిలో తీసుకోవాల్సి ఉంటుంది. సలాడ్ల రూపంలో తీసుకోగలిగితే మంచిది. వీటి తయారీకి ఆలీవ్ నూనె వాడాలి. రెడ్ మీట్, స్వీట్లు తీసుకోకూడదు. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల బరువు తగ్గడం మాత్రమే కాదు ఆరోగ్యంగా కూడా ఉంటారట.

పోషకాలెంత?

మెడిటరనియన్ డైట్ లో 40 శాతం వరకు కార్బోహైడ్రేట్లు ఉండాలి, ప్రొటీన్ 20 శాతం, కొవ్వు 40 శాతం వరకు ఉండేలా జాగ్రత్త పడాలి. క్రమం తప్పకుండా ఈ మోతాదులో పోషకాలు అందేట్టుటా డైట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.

అధ్యయనాలు ఏం చెబుతున్నాయి?

మెడిటరేనియన్ డైట్ ఫాలో అయ్యే వారు సహజంగానే చాలా ఆరోగ్యవంతులుగా ఉంటారని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇప్పుడు కొత్త అధ్యయనాలు ఈ డైట్ ఫాలో చేస్తున్న వారిలో ఇన్పెర్టిలిటి సమస్యలు కూడా బాగా తగ్గినట్టు చెబుతున్నాయి. తల్లిదండ్రులుగా మారాలనుకునే దంపతులు ఈ డైట్ ఫాలో చేస్తే బరువు తగ్గడం ఆరోగ్యంగా ఉండడం మాత్రమే కాదు ఇన్ఫెర్టిలిటీ సమస్యలను కూడా అదిగమించవచ్చని అధ్యయనకారులు అంటున్నారు.

స్త్రీపరుషులిద్దరిలో కూడా ఇన్ఫ్లమేషన్ వల్ల స్పెర్మ్ క్వాలిటీ, మెన్సుట్రవల్ సైకిల్ వంటి  ఫెర్టిలిటీ అంశాల మీద ప్రభావం చూపుతుంది. మెడిటరేనియన్ డైట్  చేసే వారిలో ఇన్ఫ్లమేషన్ చాలా వరకు అదుపులో ఉంటుంది. ఫలితంగా ఫెర్టిలిటీ కి సంబంధించిన సమస్యలు తగ్గుముఖం పడుతాయి.

మెడిటరేనియన్ డైట్ ఎక్కువగా ప్లాంట్ బేస్డ్ గా ఉంటుంది. అంతేకాదు ఇందులో తృణధాన్యాలు కూడా భాగం. పెరుగు, చీజ్ వంటి పౌష్టికమైన పదార్థఆలు కూడా ఉంటాయి. మోనాష్ యూనివర్సిటి కి చెందిన అధ్యయనకారులు చెప్పేదాన్ని బట్టి తల్లిదండ్రులు కావాలనుకునే జంటకు ఈ రకమైన డైట్ వరప్రదాయిని అని అర్థం అవుతోంది. దీన్ని గురించి నిర్ధారణలు జరగాలంటే మరింత పరిశోధన జరగాల్సి ఉన్నప్పటికీ మెడిటరేనియన్ డైట్ వల్ల ఆరోగ్యం మెరుగు పడడం, బరువు తగ్గడంతోపాటు సంతానసాఫల్య సమస్యలు కూడా అధిగమించేందుకు అవకాశం ఉన్నట్టు మాత్రం చెబుతున్నారు. నష్టం లేనపుడు ఇది పాటించడంలో తప్పేముంది.

టాప్ హెడ్ లైన్స్

Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Breastfeeding Myths vs Facts : తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
తల్లిపాలు ఇస్తే అలా జరుగుతుందా? ఈ అపోహల్లో నిజం ఎంత? నిపుణుల సూచనలు ఇవే
Pregnancy Test : పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?
పీరియడ్స్ ఆగిన ఎన్ని రోజులకు ఇంట్లో ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవాలి? డాక్టర్‌ను ఎప్పుడు సంప్రదించాలి?

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
CBI On NEET Paper Leak: నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
నీట్ పేపర్‌ లీక్ చేసింది ఎన్‌టీఏ నిపుణులే! సీబీఐ ఛార్జ్ షీట్‌లో దిగ్భ్రాంతికర విషయాలు!
YSRCP Protest On DSC Irregularities: డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
డీఎస్సీ అక్రమాలపై వైసీపీ ఆందోళనలు!సీబీఐ విచారణకు జగన్ డిమాండ్!
Korean Kanakaraju Review - కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
కొరియన్ కనకరాజు రివ్యూ: హారర్ కామెడీ నవ్వించిందా? వరుణ్ తేజ్ సినిమా హిట్టా? ఫట్టా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Embed widget