షాజహాన్ మళ్లీ పుట్టాడు.. భార్య కోసం తాజ్ మహాల్ కట్టేసిన భర్త.. ఇంటీరియర్ అదుర్స్!
ప్రేమ చిహ్నం తాజ్ మహాల్.. అందుకే చాలామంది ప్రేమికులు తాజ్ మహాల్ బొమ్మలను కానుకగా ఇచ్చిపుచ్చుకుంటారు. అయితే, ఈ భర్త.. ఏకంగా తాజ్ మహాల్ డిజైన్లో ఇంటిని నిర్మించి భార్యకు సర్‌ప్రైజ్ ఇచ్చాడు.
మొగల్ చక్రవర్తి షాజహాన్.. తాను ఎంతగానో ప్రేమించే భార్య ముంతాజ్‌కు గుర్తుగా కట్టిన తాజ్ మహాల్ గురించి మీకు తెలిసిందే. ప్రపంచంలోని ఏడు అద్భుతాల్లో ఒక్కటైన తాజ్ మహాల్ ఇప్పటికీ చెక్కు చెదరకుండా పర్యాటకులను ఆకట్టుకుంటోంది. 1632లో ఎలాంటి టెక్నాలజీ అందుబాటులో లేని సమయంలోనే ఈ అద్భుత కట్టడాన్ని నిర్మించారు. చాలామంది దీనికి నకలు కట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి మాత్రం సఫలమయ్యాడు.
బుర్హన్‌పూర్‌కు చెందిన ఆనంద్ చొక్సే అనే వ్యక్తి తన భార్యకు ప్రేమగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాడు. ఈ సందర్భంగా తాజ్ మహాల్ డిజైన్‌లో ఇళ్లు కట్టాలని అనుకున్నాడు. కానీ, తాజ్ మహాల్ వంటి గొప్ప కట్టడాన్ని మళ్లీ తిరిగి కట్టగలమా అనే సందేహంతో వెనకడుగు వేశాడు. దీనిపై ఎంతో మందిని సంప్రదించాడు. ఎట్టకేలకు అతడి ఐడియాను అమలు చేయగలిగే నిపుణులు లభించారు. బెంగాల్, ఇండోర్‌కు చెందిన కొంతమంది సాయంతో తన కలల బంగ్లాకు శ్రీకారం చుట్టాడు.
మొత్తం 29 అడుగుల గోపురంతో కూడా తాజ్ మహాల్‌తోపాటు స్తంభాలను నిర్మించారు. రాజస్థాన్‌కు చెందిన ‘మక్రానా’ ఫ్లోరింగ్, ముంబయికి చెందిన నిపుణులు తయారు చేసిన ఫర్నీచర్‌తో తాజ్ మహాల్ భవనానికి తుది రూపం ఇచ్చాడు. 2018 నుంచి మొదలైన ఈ తాజ్ మహాల్ కట్టడం ఇటీవలే పూర్తయ్యింది. ఈ భవనం ఇంటీరియర్‌ను చూస్తే తప్పకుండా నోరెళ్లబెడతారు. పెద్ద హాలు, నాలుగు బెడ్‌రూమ్‌లు, లైబ్రరీ, మెడిటేషన్ రూమ్‌లతో ఎంతో అద్భుతంగా ఈ భవనాన్ని నిర్మించారు. అయితే, ఇది తాజ్ మహాల్‌లా అద్భుత కట్టడం కాకపోయినా.. అతడి ప్రయత్నాన్ని మాత్రం తప్పకుండా మెచ్చుకోవచ్చు. కొద్ది రోజుల కిందట బాస్నియాకు చెందిన ఓ 72 ఏళ్ల పెద్దాయన తన భార్య కోసం తన చుట్టూ తాను తిరిగే గుండ్రని ఇంటిని నిర్మించాడు. ఇంటి కిటికీ నుంచి చూస్తే.. చుట్టుపక్కల ప్రకృతి అందాలు కనిపించేలా రొటేంగ్ హౌస్‌ను నిర్మించి భార్యకు కానుకగా ఇచ్చాడు.
Also Read: పెళ్లికి ముందే శృంగారం.. ఇక్కడి ప్రజలకు ఇదే ఆచారం, ఎక్కడో కాదు ఇండియాలోనే!
Also Read: ఇక్కడ చనిపోతే అంత్యక్రియలు చేయరు.. శవాలను తినేస్తారు, ఎందుకంటే..
Also Read: ఇదో వింత గ్రామం.. ఇక్కడి మగాళ్లు పెళ్లి చేసుకోరు.. తమ పిల్లలను పెంచరు.. కానీ, రాత్రయితే..
Also Read: ప్రియుడు మాట్లాడటం లేదని పోలీసులకు ప్రియురాలు ఫిర్యాదు.. పెళ్లి చేసి తిక్క కుదిర్చారు!