Kumbh Mela Mona Lisa: మహాకుంభ్ వైరల్ గర్ల్ మోనాలిసా కొత్త లుక్‌లో మళ్లీ సెన్సేషన్ - తెలుగు సినిమాల్లో ఎంట్రీ
Mahakumbh Viral Girl : మహాకుంభ్ 2025 మేళాలో వైరల్ అయిన పూసలమ్మి మోనాలిసా భోస్లే మరో సారి హాట్ టాపిక్ అవుతున్నారు. తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు.

Mahakumbh Viral Girl Monalisa: మహాకుంభ్ 2025 మేళాలో పూసలమ్ముతూ కనిపించిన మోసాలిసా తర్వాత పెద్దగా కనిపించడం లేదని చాలా మంది అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమె మరోసారి వైరల్ అవుతున్నారు. కొత్త లుక్‌లో హీరోయిన్‌లా ఫోజులు ఇస్తూ మీడియా కంటబడుతున్నారు. ఆమె త్వరలో తెలుగు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. లైఫ్ అనే సినిమాలో ఆమె నటిస్తున్నారు.
నమస్కారం హైదరాబాద్
— Rajesh Manne (@rajeshmanne1) November 5, 2025
- #MonalisaBhosle
తన మెదటి తెలుగు సినిమా #Life లాంచ్ ప్రెస్ మీట్. pic.twitter.com/K3LxgVqSGP
మహాకుంభ్ 2025లో పూసలు అమ్ముతున్న వీడియో వైరల్ కావడంతో మోనాలిసా ఓవర్ నైట్ స్టార్ అయిపోయారు. ఆమె అద్భుతమైన కళ్ళు, ప్రత్యేకమైన హెయిర్ స్టైల్ తో అందరినీ ఆకట్టుకుంది. ఫిల్మ్ డైరెక్టర్ సనోజ్ మిశ్రా ఆమెను వెతికి సినిమా అవకాశం ఇచ్చారు.
मोनालिसा को महाकुम्भ का आशिर्वाद मिल चुका है
— Naresh Rana 🇮🇳 (@Rana009) January 30, 2025
महाकुम्भ में आने से चमकी किस्मत #mahakumbh2025 #monalisabhosle #bollywooddebut #manipur #ATCard #AajTakSocial pic.twitter.com/07qfGg7uBx
మోనాలిసా తన కొత్త లుక్‌లో హైదరాబాద్‌లో ఆకట్టుకున్నారు. గ్లామరస్‌గా కనిపించారు. తన తెలుగు సినిమా 'లైఫ్' ప్రమోషన్ ఈవెంట్‌కు హైదరాబాద్ చేరుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ఫ్యాన్స్‌తో సెల్ఫీలు తీసుకుంటూ, ఎక్స్‌పెరిమెంటల్ లుక్‌తో అందరినీ ఆకర్షించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మోనాలిసా ఈ లుక్‌లో ఎంత సొగసుగా ఉన్నారో చూస్తే, సినిమా ఇండస్ట్రీలో ఆమెకు మంచి గుర్తింపు వస్తుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు.
మహాకుంభ్ వైరల్ తర్వాత మోనాలిసా గ్రామానికి తిరిగి వెళ్లినా, సనోజ్ మిశ్రా ఆమెను వెతికి 'ది డైరీ ఆఫ్ మణిపూర్' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ హిందీ సినిమా షూటింగ్ దాదాపు పూర్తి అయింది. దీనికి దాదాపు ఆమెకు యాక్టింగ్ ట్రైనింగ్, పోజింగ్, లైఫ్‌స్టైల్ టిప్స్ కూడా ఇచ్చారు. 'లైఫ్' తెలుగు సినిమాతో పాటు మరిన్ని ప్రాజెక్టుల్లో ఆమె కనిపించనున్నారు. ఇంతకుముందు ఒక మ్యూజిక్ వీడియోలో కూడా ఆమె కనిపించారు.
मोनालिसा को मिला - गिफ्ट 🔥🎁
— Manish Jaiky (@ManishJaiky) February 15, 2025
मोनालिसा को एक कस्टम कलाकृति गिफ्ट दिया गया हैं
जिसमें वह किसी खास स्थान या परिस्थितियों में दिखाई दे रही हैं।
यह एक अद्वितीय तरीका है, जो उनके साथ खास पल को दर्शा रहा हैं।#ValentinesDay#Monalisa #monalisabhosle pic.twitter.com/JPgi81mQSa
మోనాలిసా జీవితం ఇంటర్నెట్ యుగంలో ఎలా మారవచ్చో చూపిస్తోంది. ఆమె డెబ్యూ సినిమాలు విడుదలైతే మరింత బిగ్ బ్రేక్ వస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.





















