Balakrishna: ఆ సూపర్ స్టారూ వద్దు... ఈ కింగూ వద్దు... రెండు సినిమాలు రిజెక్ట్ చేసిన బాలకృష్ణ
Balakrishna Rejected Movies: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ రెండు పెద్ద సినిమాలకు 'నో' చెప్పారని టాలీవుడ్ ఇండస్ట్రీ ఖబర్. ఎందుకు రిజెక్ట్ చేశారు? కారణాలు ఏమిటి? అంటే...

బాక్సాఫీస్ బరిలో గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) సక్సెస్ జర్నీ అన్‌స్టాపబుల్‌గా కంటిన్యూ అవుతుంది. పట్టిందల్లా మేలిమి బంగారమే అన్నట్టు ఆయన చేసిన ప్రతి సినిమా సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతోంది. అయితే ఈ టైంలో ఆయన రెండు భారీ సినిమాలకు 'నో' చెప్పారనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అవుతోంది. ఆ రెండు సినిమాలు ఏమిటి? అంటే...
జైలర్ 2... ఆంధ్ర కింగ్ తాలూకా...
బాలకృష్ణ రిజెక్ట్ చేసిన సినిమాలు!
సూపర్ స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న తాజా సినిమా 'జైలర్ 2'. అందులో బాలకృష్ణ చేత ఒక క్యారెక్టర్ చేయించాలని ప్రయత్నాలు జరిగాయి. నిజానికి 'జైలర్'లో బాలయ్య చేత ఓ రోల్ చేయించాలని ట్రై చేశారు. కానీ, కుదరలేదు. ఇప్పుడు 'జైలర్ 2' కోసం అప్రోచ్ అయ్యారు. అందుకు బాలకృష్ణ కూడా ఓకే అన్నట్టు ప్రచారం జరిగింది. కానీ లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ఇప్పుడు బాలకృష్ణ ఆ రోల్ చేయడం లేదట.
Also Read: చికిరి చికిరి... ట్రెండింగ్‌లో రామ్ చరణ్ హుక్ స్టెప్... చిరు, పవన్ కూడా సేమ్ స్టెప్పేస్తే?
రీసెంట్‌గా బాలకృష్ణ రిజెక్ట్ చేసిన మరొక సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ఫేమ్ మహేష్ బాబు పి డైరెక్ట్ చేస్తున్న సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. హీరో డై హార్డ్ ఫ్యాన్ బయోపిక్ అన్నట్టు తీస్తున్నారు. ఇందులో సూపర్ స్టార్ / హీరోగా కన్నడ స్టార్ ఉపేంద్ర నటించారు. ఆ రోల్ ముందుగా బాలకృష్ణ దగ్గరకు వచ్చిందట. దానికి కూడా ఆయన 'నో' చెప్పారట.
బాలకృష్ణ ఎందుకు రిజెక్ట్ చేశారంటే?
'జైలర్ 2', 'ఆంధ్ర కింగ్ తాలూకా' సినిమాలను బాలకృష్ణ రిజెక్ట్ చేయడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయని ఇండస్ట్రీ టాక్. 'జైలర్ 2'లో బాలకృష్ణ పాత్రతో చెప్పించే మాటలు రజనీకాంత్ హీరోయిజం ఎలివేట్ చేసేలా ఉంది తప్ప మన బాలకృష్ణను హైలైట్ చేసేలా లేదట. అటువంటి రోల్ చేయడం వల్ల ప్రయోజనం ఏమీ ఉండకపోగా... రజనీకాంత్ కోసం చేద్దామన్నా అభిమానుల నుంచి వ్యతిరేకత వస్తుందని 'నో' చెప్పారట. మంచు మనోజ్ 'ఓ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమా చేశారు బాలకృష్ణ. అప్పుడు అద్భుతమైన స్పందన ఏదీ రాలేదు. అందుకని, ఆ 'ఆంధ్ర కింగ్ తాలూకా'కు 'నో' చెప్పారట.





















