Trump defeat: పది నెలల్లోనే ట్రంప్‌ను తిరస్కరించిన అమెరికా - స్థానిక ఎన్నికల్లో డెమోక్రాట్ల భారీ విజయం
US local elections: ప్రజల దెబ్బ ఎలా ఉంటుందో ట్రంప్ చూశారు. స్థానిక ఎన్నికలలో ఆయన రిపబ్లికన్ పార్టీ ఘోర పరాజయం పాలైంది.

US People voted against Trump: అమెరికాలో జరిగిన 2025 స్థానిక ఎన్నికల్లో డెమోక్రట్ పార్టీకి ఘన విజయం లభించింది. వర్జీనియా, న్యూ జెర్సీ గవర్నర్ ఎన్నికలు, న్యూయార్క్ సిటీ మేయర్ రేసు సహా ముఖ్యమైన పోటీలలో డెమోక్రట్లు మొత్తం స్వీప్ చేశారు. ఇది రెండోసారి అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్‌కు మొదటి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. ఫెడరల్ ప్రభుత్వ షట్‌డౌన్, ఆర్థిక సమస్యలు, ట్రంప్ విధానాలపై అసంతృప్తి కారణంగా ఓటర్లు డెమోక్రట్ల వైపు మొగ్గు చూపారు.
Breaking News: California voters agreed to aggressively redraw the state’s congressional district lines to wipe out as many as five Republican seats, according to The Associated Press, delivering a major victory for national Democrats. https://t.co/2H6ta9gf9p pic.twitter.com/PKhCVwwb1M
— The New York Times (@nytimes) November 5, 2025
ఈ ఎన్నికలు ట్రంప్ రెండో టర్మ్ ప్రారంభానికి మొదటి పెద్ద టెస్ట్‌గా మారాయి. వర్జీనియాలో డెమోక్రట్ అబిగెయిల్ స్పాన్‌బర్గర్ రిపబ్లికన్ విన్సమ్ ఎర్ల్-సియార్స్‌ను ఓడించి గెలిచి, వర్జీనియా చరిత్రలో మొదటి మహిళా గవర్నర్‌గా చరిత్ర సృష్టించింది. ఓటర్లు ఫెడరల్ వర్క్‌ఫోర్స్ లేఅవుట్లు, షట్‌డౌన్ ప్రభావాలపై ఆగ్రహం చూపారు. న్యూ జెర్సీలో కూడా డెమోక్రట్ మికీ షెరిల్ ట్రంప్ ఎండోర్స్‌మెంట్ పొందిన రిపబ్లికన్ జాక్ సియాటరెల్లిని ఓడించారు. 1961 తర్వాత మొదటిసారి ఒకే పార్టీ మూడు వరుసగా గవర్నర్ పదవులు దక్కించుకుంది. షెరిల్ రెండో మహిళా గవర్నర్‌గా రికార్డు సృష్టించారు.
BREAKING DEMOCRATS BLOWOUT!
— Brian Krassenstein (@krassenstein) November 5, 2025
- Mamdani Wins NYC Mayor
- Democrats have SWEPT Virginia. Governor, lieutenant governor, and the attorney general
- Democrat Mikie Sherrill won NJ Governor.
- Pennsylvania will retain all 3 Democratic state Supreme Court justices. pic.twitter.com/rmDfd4p3MQ
న్యూయార్క్ సిటీ మేయర్ రేసులో డెమోక్రట్ జోరాన్ మమ్దానీ ఇండిపెండెంట్ ఫార్మర్ గవర్నర్ ఆండ్రూ కుమో, రిపబ్లికన్ కర్టిస్ స్లివాను ఓడించి గెలిచారు. ట్రంప్ ఈ ఫలితాలను సోషల్ మీడియాలో తీవ్రంగా విమర్శించారు. న్యూయార్క్ మమ్దానీ విజయాన్ని "డిసాస్టర్" అని, బ్యాలెట్ ప్రాసెస్‌ను "స్కామ్" అని పిలిచారు. ట్రంప్ తన హోమ్ టౌన్‌లో ఈ ఓటమి తీవ్రంగా తీసుకుని, ఫెడరల్ ఫండింగ్ ఉపసంహరించుకుని, సిటీని టేకోవర్ చేస్తానని హెచ్చరించారు.
Trump melts down in reaction to tonight's blue wave. pic.twitter.com/PBR5X60iQB
— FactPost (@factpostnews) November 5, 2025
డెమోక్రట్ లీడర్లు ఈ విజయాన్ని "ట్రంప్ అజెండాపై పెద్ద ఓటమి"గా చూస్తున్నారు. మాజీ ప్రెసిడెంట్ బరాక్ ఒబామా భవిష్యత్ వెలుగులు కనిపిస్తున్నాయన్నారు. ఓటర్లు ఎకానమీ, లివింగ్ కాస్ట్‌లు, హౌసింగ్, ఫెడరల్ కట్స్‌పై ఆందోళన వ్యక్తం చేసిన వైనం ఓటింగ్ లో బయటపడింది. వచ్చే ఏడాది అమెరికాలో మధ్యంతర ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఫలితాల ప్రభావం మరింత తీవ్రంగా ఉంటుందని ట్రంప్ భయపడుతున్నారు.




















