అన్వేషించండి
Veg vs Vegan : వెజిటేరియన్, వీగన్ మధ్య తేడా ఇదే.. వీగన్ వారికి మాత్రం ఆ ఇబ్బంది ఉంటుందట, జాగ్రత్త
Vegan vs Vegetarian Diet : వీగన్, శాఖాహారుల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. కానీ ఎక్కువమందికి దీని గురించి తెలియదు. మరి రెండింటి మధ్య తేడా ఏమిటో.. ఆహారంలోని మార్పులు ఏంటో చూసేద్దాం.
వీగన్, వెజ్ డైట్ మధ్య తేడాలివే
1/6

వీగన్, శాఖాహారం మధ్య ప్రధాన వ్యత్యాసం ఏమిటంటే జంతు ఉత్పత్తులను బహిష్కరించడమే. శాఖాహారులు మాంసం తినడానికి దూరంగా ఉంటారు. వారు మాంసం, చేపలు లేదా కోడిని తినరు. కానీ పాల ఉత్పత్తులను తీసుకుంటారు. వీగన్ అంటే మాంసం, చేపలు మాత్రమే కాదు.. అన్ని పాల ఉత్పత్తులు వంటి జంతు ఉత్పత్తులను కూడా మానేస్తారు. తేనెను కూడా తీసుకోరు.
2/6

శాకాహారులు.. కూరగాయలు, పండ్లు, ధాన్యాలు, పప్పులు, గింజలు అన్నీ తింటారు. అలాగే పాలు, పెరుగు, వెన్న, పనీర్ వంటి పాల ఉత్పత్తులను కూడా ఆస్వాదిస్తారు.
3/6

వేగన్ వాళ్లు పూర్తిగా ప్లాంట్ ఆధారిత ఆహారం తీసుకుంటారు. వీరు ఏ రకమైన జంతు ఉత్పత్తులను తీసుకోరు. పాలు బదులుగా బాదం లేదా సోయా పాలను ఉపయోగిస్తారు. అలాగే ప్లాంట్ ఆధారిత చీజ్ ఉపయోగిస్తారు. తేనెకు బదులుగా సహజమైన తీపిని ఇష్టపడతారు.
4/6

అలాగే వీగన్లకు ఇది కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు.. నైతిక, పర్యావరణ దృక్పథం కూడా. వీగన్ల ఉద్దేశం అన్ని విధాలా జంతువులకు కలిగే హానిని తగ్గించడం. వీరు తోలు, ఉన్ని, పట్టు, జంతువులపై పరీక్షించిన సౌందర్య సాధనాలను కూడా ఉపయోగించరు. శాఖాహారులకు కూడా ఇదే విధమైన నైతిక విలువలు ఉంటాయి. కానీ తరచుగా వారు వీటిని జీవనశైలి ఉత్పత్తులపై అంత శక్తివంతంగా అమలు చేయరు.
5/6

రెండు ఆహారాలు బాగా ప్లాన్ చేస్తే చాలా పోషకమైనవి కావచ్చు. అయితే వీగన్ ఫాలో అయ్యేవారు విటమిన్ బి12, ఐరన్, కాల్షియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి పోషకాలను జాగ్రత్తగా చూసుకోవాలి. ఇవన్నీ ప్రధానంగా జంతు ఆధారిత ఆహారాలలో కనిపిస్తాయి. శాఖాహారులు పాల ఉత్పత్తులు తీసుకోవడం ద్వారా ఎలాంటి సప్లిమెంట్స్ లేకుండానే ఈ పోషకాహార అవసరాలను తీర్చుకోగలుగుతారు.
6/6

భారతదేశంలో శాఖాహారం చాలా సుదీర్ఘమైన సాంస్కృతిక, మతపరమైన చరిత్రను కలిగి ఉంది. ఇది అహింస, పవిత్రత సంప్రదాయాలతో ముడిపడి ఉంది. అయితే వీగనిజం ఇప్పుడు ఒక కొత్త ప్రపంచ ఉద్యమంగా మారింది. ఇది జంతు హక్కులు, వాతావరణ మార్పుల గురించి పెరుగుతున్న ఆందోళనల కారణంగా పాశ్చాత్య దేశాలలో బాగా ప్రాచుర్యం పొందుతోంది.
Published at : 05 Nov 2025 02:53 PM (IST)
వ్యూ మోర్
Advertisement
Advertisement

Nagesh GVDigital Editor
Opinion




















