News
News
వీడియోలు ఆటలు
X

ఇడ్లీ మిగిలిపోయిందా? అయితే ఇలా చాట్, పకోడా చేసుకోండి

ఇడ్లీ మిగిలిపోతే అలా వదిలేయకుండా, వాటిని కొత్తగా ఇలా స్నాక్స్ గా మార్చండి.

FOLLOW US: 
Share:

ఇడ్లీ మిగిలిపోవడం అనేది ప్రతి ఇంట్లో జరిగేదే.  ఎక్కువైనా పర్లేదు గాని తక్కువ కాకూడదని ప్రతి ఇల్లాలు ఇడ్లీని అధికంగానే చేస్తుంది. స్పైసీ సాంబార్, కొబ్బరి చట్నీతో ఇడ్లీ అదిరిపోతుంది. అందుకే దీన్ని ఉత్తమ అల్పాహారంగా చెబుతారు. మిగిలిపోయిన ఇడ్లీని చాలామంది ఏం చేయాలో తెలియక లంచ్ టైంలో తినడం, లేదా  ఫ్రిజ్లో పెట్టి మరసటి రోజు తినడం చేస్తుంటారు. ఇలా కాకుండా మిగిలిపోయిన ఇడ్లీతో టేస్టీగా స్నాక్స్ చేసుకోవచ్చు. అది కూడా చాలా సులువుగా. 

ఫ్రైడ్ ఇడ్లీ
ఇడ్లీలను మీకు నచ్చిన ఆకారాలలో ముక్కలుగా కట్ చేసుకోవాలి. స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొన్ని ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. అందులోనే పసుపు అర స్పూను, ఒక స్పూను కారం, రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసి వేయించాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీలను అందులో వేసి ఫ్రై చేయాలి. బాగా ఫ్రై అయ్యాక తీసి ప్లేట్లో వేసుకోవాలి.  వీటిని ఫోర్క్ తో గుచ్చుకుని తింటే చాలా రుచిగా ఉంటాయి.

ఇడ్లీ చాట్
ఇడ్లీలను మీకు నచ్చిన ఆకారాలలో కట్ చేసుకుని పెట్టుకోండి. స్టవ్ పై కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, క్యారెట్, పచ్చి బఠాణీలు, టమోటాలు వేసి వేయించాలి. ఇవన్నీ ఎక్కువగా వేయించాల్సిన అవసరం లేదు. కాస్త పచ్చిపచ్చిగా ఉండేలా చూసుకోవాలి. అందులో రుచికి సరిపడా ఉప్పు, అర స్పూను కారం వేసి బాగా కలపాలి. అలాగే జీలకర్ర పొడి కూడా వేసి కలపాలి. అన్నీ బాగా వేగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఇడ్లీ ముక్కలను వేసి కలుపుకోవాలి. పైన చాట్ మసాలా చల్లి కలుపుకోవాలి. ఈ రెసిపీలో నీళ్లు వాడకూడదు. 

ఇడ్లీ బర్గర్
స్టవ్ పై కళాయి పెట్టి అందులో ఉల్లిపాయల తరుగు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, మిరియాలు, కొత్తిమీర తరుగు వేసి వేయించాలి. ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలను చేత్తోనే బాగా మెదిపి ముద్దలా చేసి కళాయిలో వేయాలి. అన్నింటిని బాగా కలపాలి. అన్నీ మందంగా ముద్దలా అయ్యాక  స్టవ్ కట్టేయాలి. ఆ మిశ్రమాన్ని చేతితోనే కట్లెట్లలా ఒత్తుకోవాలి. కార్న్ ఫ్లోర్ లో వాటిని ముంచి నూనెలో  డీప్ ఫ్రై చేయాలి. వాటిని తీసి రెండు ఇడ్లీల మధ్యలో పెట్టి చీజ్ వేసుకొని మైక్రోఓవెన్ లో నాలుగు నిమిషాలు వేడి చేయాలి. తరువాత తీస్తే ఇడ్లీ బర్గర్ రెడీ అయినట్టే.

ఇడ్లీ పకోడా
మిక్సీలో ఇడ్లీ ముక్కలతో పాటు రెండు పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, జీలకర్ర, మిరియాలు, ఉప్పు వేసి గట్టిగా రుబ్బుకోవాలి. ఈ పేస్టులో మొక్కజొన్న గింజలు, ఉల్లిపాయల తరుగు, కొత్తిమీర తరుగు వేసి పిండిలా కలుపుకోవాలి. స్టవ్ మీద కళాయి పెట్టి అందులో డీప్ ఫ్రై చేయడానికి సరిపడా నూనె వేసి ఉంచాలి. ఆ నూనె వేడెక్కాక ఈ పిండిని పకోడాల్లా వేసుకోవాలి. అంతే ఇడ్లీ పకోడా రెడీ అయినట్టే. 

Also read: ఇక్కడ కిలో జీడిపప్పు 30 రూపాయలకే దొరుకుతుంది, ఎక్కడో కాదు మన దేశంలోనే

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Published at : 25 Mar 2023 07:32 AM (IST) Tags: Leftover idli Leftover idli Recipes Leftover idli Chat Leftover idli Pakoda

సంబంధిత కథనాలు

White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే

White Jamun: ఈ తెల్ల నేరేడు పండ్లను కచ్చితంగా వేసవిలో తినాల్సిందే

Hair: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి

Hair: పొడవాటి జుట్టు కోసం మందార పువ్వులు ఆకులతో ఇలా చేయండి

Heart Attack: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?

Heart Attack: సోమవారాలే అధికంగా గుండె పోటు వచ్చే అవకాశం, ఎందుకో తెలుసా?

Foods For Skin: ఆరోగ్యకరమైన చర్మం కోసం ఈ ఐదు ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సిందే

Foods For Skin: ఆరోగ్యకరమైన చర్మం కోసం ఈ ఐదు ఆహారాలు తప్పకుండా తీసుకోవాల్సిందే

Alcohol: ఆల్కహాల్ తక్కువ తాగినా ప్రమాదమే, శరీరంలో ఏం జరుగుతుందంటే...

Alcohol: ఆల్కహాల్ తక్కువ తాగినా ప్రమాదమే, శరీరంలో ఏం జరుగుతుందంటే...

టాప్ స్టోరీస్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

‘ఆదిపురుష్’ టీమ్ 7 నెలలు నిద్రపోకుండా పనిచేశారు, చిరంజీవి ఆశ్చర్యపోయారు: ప్రభాస్ - కన్నీళ్లు పెట్టుకున్న ఓంరౌత్

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Academic Calendar: తెలంగాణలో పాఠశాలల కొత్త అకడమిక్‌ క్యాలెండర్‌ విడుదల - పరీక్షలు, సెలవుల వివరాలు ఇలా!

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Cyclone Biparjoy: అరేబియా సముద్రంలో బిపర్‌జోయ్ తుపాను, వచ్చే 5 రోజులు ఇక్కడే బీభత్సమే - ఐఎండీ హెచ్చరిక

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!

Odisha Train Accident: రైలు ప్రమాదంలో మృతుల సంఖ్యపై ఒడిశా ప్రభుత్వం కీలక ప్రకటన, మళ్లీ పాత మాటే!