Lip Care Tips : పెదాల సంరక్షణ చిట్కాలు.. మ్యాట్ లిప్‌స్టిక్ వాడేవారు కచ్చితంగా తెలుసుకోవాలట
Soft Lips Home Remedies : రోజూ పెదవుల సంరక్షణ ఒక అందం మాత్రమే కాదు, ఆత్మ సంరక్షణ కూడా. పొడి వాతావరణం, లిప్ స్టిక్ లేదా తగినంత నీరు లేకపోవడం వంటివి పెదవులకు ప్రతికూలంగా ఉంటాయి.

Natural Lip Care Routine : ముఖంలో పెదాలు చాలా సున్నితమైనవి. ఇవి కేవలం అందాన్నే కాదు.. మన భావాలను వ్యక్తపరిచే లక్షణాలు కలిగి ఉంటాయి. అలాగే మనం ఎంత హెల్తీగా ఉంటున్నామో కూడా చెప్తాయి. మన ఆరోగ్యం, హైడ్రేషన్, భావోద్వేగ శ్రేయస్సు అన్నింటిని ఇవి రిప్రజెంట్ చేస్తాయి. అందుకే పురాతన సంప్రదాయ వైద్య విధానాల్లో.. పెదవులు ఆత్మ వ్యక్తీకరణ, పోషణ, ప్రేమను స్వీకరించడం, స్పష్టంగా కమ్యూనికేట్ చేసే సామర్థ్యంతో ముడిపడి ఉన్నాయని నమ్మేవారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని రోజువారీ పెదవుల సంరక్షణను తీసుకునేవారట.
కానీ ఇప్పుడు చాలామంది పెదాలను అందాన్ని రిప్రజెంట్ చేసే వాటిగానే చూస్తారు. కానీ అలా చూడకూడదని.. పెదాలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. వాటికోసం డైలీ కొన్ని లిప్ కేర్ టిప్స్ ఫాలో అవ్వాలని చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. పొడి వాతావరణం, ఎక్కువ లిప్ స్టిక్ వాడటం, తగినంత నీరు తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల పెదవులు అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటాయని.. అందుకే వాటికోసం కాస్త అదనపు రక్షణ తీసుకోవాలని సూచిస్తున్నారు చర్మ సంరక్షణ నిపుణలు డాక్టర్ బ్లస్సమ్ కొచ్చర్. ఇంతకీ ఆ లిప్ కేర్ టిప్స్ ఏంటో.. వాటివల్ల కలిగే లాభాలు ఏంటో చూసేద్దాం.
పెదవుల సంరక్షణ చిట్కాలు
రాత్రి సమయంలో.. పెదవులను సున్నితంగా శుభ్రం చేసి.. వాసెలిన్ లేదా పోషణను అందించే లిప్ బామ్ అప్లై చేయాలి. ఇది పెదాలు హైడ్రేటెడ్‌గా ఉండేలా చేస్తుంది. అలాగే నిద్రపోయేటప్పుడు పగుళ్లు రాకుండా చేస్తుంది. ఉదయాన్నే హైడ్రేటింగ్‌గా ఉంచేందుకు కొన్ని సహజమైన నూనెలు ఎంచుకోండి. లేదా విటమిన్ Eతో నిండుగా ఉండే లిప్ ప్రొడెక్ట్స్ ఎంచుకోవాలి. పెదాలకు కాస్త మెరుపు కావాలనుకుంటే లిప్‌స్టిక్‌ను హెవీగా కాకుండా లైట్‌గా అప్లై చేసుకోవచ్చు.
పెదవులు పొడిగా లేదా పొలుసుగా, పగిలిపోయినట్లు అనిపిస్తే లిప్‌స్టిక్ వాడటం మానేస్తేనే బెటర్. ముఖ్యంగా మ్యాట్ లిప్‌స్టిక్ వాడేవారు ఈ సమయంలో వాటికి కచ్చితంగా దూరంగా ఉండాలి. వీటివల్ల పెదాలు మరింత పొడిబారతాయి. దీనివల్ల పరిస్థితి మరింత చేజారుతుంది. ఆ సమయంలో మీరు పెదాలకు కాస్త లుక్ ఇవ్వాలనుకుంటే.. తేమను, మాయిశ్చరైజర్‌ను అందించే లిప్‌బామ్ అప్లై చేసుకోవచ్చు. ఇవి పెదాలు మృదువుగా ఉండేలా చేస్తాయి. SPF ఉండే లిప్‌బామ్‌లు ఎంచుకుంటే మరీ మంచిది.
DIY చిట్కాలు.. సహజమైన రక్షణ కోసం..
- లిప్ స్క్రబ్ : బటర్లో షుగర్ వేయండి. దానిని బాగా కలిపి పెదాలపై అప్లై చేయండి. అనంతరం దానిని వృత్తాకార కదలికల్లో పెదవులపై సున్నితంగా మసాజ్ చేయండి. దీనివల్ల పెదవులపై డర్ట్ తొలగి.. మృదువైన పెదవులు మీ సొంతం అవుతాయి.
- మృదువైన పెదాల కోసం : తాజా గులాబీ రేకులను మెత్తగా చేసి.. కొద్దిగా వెన్నతో కలపండి. నిద్రపోయే ముందు పెదాలపై దానిని అప్లై చేయండి. ఇది మీకు సహజమైన రంగును ఇవ్వడంతో పాటు పెదాలు మృదువుగా మారేలా చేస్తుంది.
ముఖ్యంగా పెదాలు నిర్జీవంగా డ్రైగా ఉండకూడదంటే లోపలి నుంచి పోషణ ఇవ్వాలి. హైడ్రేషన్ అందించేందుకు హెల్తీ ఫుడ్ తీసుకోవాలి. అలాగే కచ్చితంగా రోజుకు 7 నుంచి 8 గ్లాసుల నీటిని తాగాలి. సరైన హైడ్రేషన్ శరీరానికి అందివ్వకుంటే పెదాలు ముడతలు పడి.. వాడిపోయినట్లు కనిపించి.. డ్రైగా మారి పగిలిపోతాయి. కాబట్టి వీటిని అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదు. అలాగే రోజులో కాస్త సమయం పెదాలకు కేటాయిస్తే సహజంగానే అందంగా మారతాయి.






















