Hair Care Tips for Festive Season : పండుగ సమయంలో జుట్టు విషయంలో ఆ తప్పులు చేయకండి.. ఈ టిప్స్ ఫాలో అయితే మంచిది
Hair Care Tips : పండుగ సమయంలో అందరికీ అందంగా కనిపించాలని ఉంటుంది. ఈ నేపథ్యంలో తమ లుక్‌కి తగ్గట్లు హెయిర్‌ని స్టైల్ చేస్తారు. దీనివల్ల జుట్టు రాలిపోతుందా? అయితే ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటో చూసేద్దాం.

Essential Hair Care Tips for Festive Season : పండుగ సమయంలో వివిధ రకాల డ్రెస్‌లు వేసుకుంటారు. వాటికి తగ్గట్లు మేకప్ వేసుకుంటారు. అంతేనా జుట్టును కూడా డ్రెస్‌కి తగ్గట్లు స్టైలింగ్ చేసుకుంటారు. ఈ నేపథ్యంలో హెయిర్ డ్రయర్, కర్ల్స్, స్ట్రైయిటనర్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఈ హీట్ వల్ల జుట్టు డ్యామేజ్ అయి ఎక్కువగా రాలిపోతుంది. అందుకే ఈ సమయంలో స్టైలింగ్ చేసిన జుట్టు రాలకుండా ఉండేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటో చూసేద్దాం.
షాంపూల ఎంపిక
సిలికాన్లు, సల్ఫేట్లు కలిగిన కఠినమైన షాంపూలు తలలోని సహజమైన నూనెలను తొలగిస్తాయి. దీనివల్ల మీ జుట్టు మరింత నిర్జీవంగా మారుతుంది. కాబట్టి వాటికి బదులుగా.. శికాకాయ్, ఉసిరి, మందార, రోజ్మేరీ వంటి ఆయుర్వేద మూలికలు కలిగిన వాటిని ఎంచుకోవాలి. ఇవి స్కాల్ప్‌ని శుభ్రపరుస్తూనే తేమను నిలుపుకుంటాయి. ఇవి జుట్టు చాలాకాలం మృదువుగా ఉండేలా చేస్తాయి.

జుట్టు బలంగా ఉండాలంటే..
హీట్ స్టైలింగ్ చేయడం, కెమికల్ స్ప్రీలు ఉపయోగించడం చాలామంది చేస్తారు. అయితే వెంటనే ఫలితాలు చూపించవు కానీ.. లాంగ్‌రన్‌లో జుట్టు కరాబ్ అవుతుంది. కాబట్టి జుట్టుకు పోషణ అందించేందుకు పెరుగు, మెంతి, ఓట్స్, ప్రోటీన్లు, సహజ నూనెలు కలిగిన లోతైన కండిషనింగ్ మాస్క్‌లు ఉపయోగిస్తే మంచిది. వీటివల్ల జుట్టుకు బౌన్స్ అందడంతో పాటు.. మెరుపు కూడా వస్తుంది. పైగా ఈ పదార్థాలు జుట్టును బలపరుస్తాయి. అలాగే స్టైలింగ్ తర్వాత జరిగిన నష్టాన్ని రిపేర్ చేస్తాయి.
స్కాల్ప్ హెల్త్..
జుట్టు రాలకుండా ఉండేందుకు స్కాల్ప్ హెల్తీగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్కాల్ప్ హెల్తీగా లేకుంటే జుట్టు త్వరగా రాలిపోతుంది. ముఖ్యంగా స్టైలింగ్ చేసినప్పుడు, కాలుష్యంలోకి వెళ్లినప్పుడు రాలిపోతుంది. కాబట్టి స్కాల్ప్‌కి షియా బటర్, మందార పువ్వు, బృంగరాజ్, మెంతులతో కూడిన హెయిర్ మాస్క్‌లు ఎంచుకోవాలి. ఇవి లోపలినుంచి కుదుళ్లకు పోషణనిస్తాయి. రక్త ప్రసరణను మెరుగుపరుస్తాయి. మృదుత్వాన్ని అందిస్తాయి.

మసాజ్
పండుగ సమయంలో ఆయిల్ మసాజ్ అస్సలు స్కిప్ చేయవద్దు. ట్రెడీషనల్ నూనెను కాస్త హీట్ చేసి.. తలకు మసాజ్ చేయాలి. పారాఫిన్ లేని సహజమైన నూనెలతో జుట్టుకు క్రమం తప్పకుండా నూనె అప్లై చేయాలి. ఇది జుట్టు మూలాలు బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గించి.. మెరుపును పెంచుతుంది. భృంగరాజ్, ఉసిరి లేదా కొబ్బరి నూనె వంటి నూనెలు చాలా ప్రభావవంతంగా ఉంటాయి.
దువ్వెన ఎంపిక..
చాలామంది జుట్టుకి ప్లాస్టిక్ దువ్వెనలు పెంచుకుంటారు. ఇది జుట్టు చిట్లేలా చేయడంతో పాటు.. స్కాల్ప్‌కు చికాకు తెప్పిస్తుంది. కాబట్టి మీరు చెక్క దువ్వెనలు మార్చుకుంటే మంచిది. అలాగే ఇవి స్కాల్ప్ దెబ్బతినకుండా కాపాడుతాయి. వీటిని ఉపయోగించడం వల్ల తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. ఇది చుండ్రు, జుట్టు రాలడాన్ని సహజంగా తగ్గిస్తుంది.

ఈ టిప్స్ ఫాలో అయితే మీరు స్టైలింగ్ చేసినా జుట్టు రాలకుండా ఉంటుంది. అలాగే వీలైనంత వరకు హీట్ ప్రొడెక్ట్స్ ఉపయోగించకపోవడమే మంచిది. అంతేకాకుండా స్టైలింగ్ చేసేముందు కచ్చితంగా హెయిర్ ప్రొటెక్షన్ సీరమ్ అప్లై చేస్తే హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుందని చెప్తున్నారు.






















