News
News
X

Brain Stroke: ఈ అలవాట్లు వెంటనే విడిచిపెట్టండి, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్‌ ముప్పు తప్పదు

బ్రెయిన్ స్ట్రోక్ ఎప్పుడు వస్తుందో చెప్పడం చాలా కష్టం. కొన్ని సార్లు అది వికలాంగులుగా మారిస్తే మరికొన్ని సార్లు మరణం కూడా సంభవించవచ్చు.

FOLLOW US: 

బ్రెయిన్ స్ట్రోక్ అంటే చాలా అరుదు. కానీ ఇప్పుడు ఇది సాధారణం అయిపోయింది. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా 45 ఏళ్ల లోపు వ్యక్తులు బ్రెయిన్ స్ట్రోక్ ని ఎదుర్కొంటున్నారు. ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలో 40 ఏళ్ల లోపు వారిలో 10-15 శాతం మంది బ్రెయిన్ స్ట్రోక్ బారిన పడుతున్నట్టు తేలింది. గుండెకి స్ట్రోక్ వచ్చినట్టుగానే మెదడుకి స్ట్రోక్ వస్తుంది. మెదడులోని ఒక భాగానికి రక్త సరఫరా ఆగిపోయినప్పుడు రక్తనాళం పగిలి స్ట్రోక్ వస్తుంది. ఇది వస్తే దాదాపు బతకడం అసాధ్యం. బ్రెయిన్ స్ట్రోక్ చాలా ప్రమాదకరం. అందుకే దీనిపై అవగాహన కల్పించేందుకు పలు ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. 

ఎక్కువ మంది అనారోగ్య జీవనశైలి కారణంగా స్ట్రోక్ సమస్య ఎదుర్కొంటున్నారు. అనారోగ్య ఆహార విధానాలు, వృత్తిపరంగా, కుటుంబం పరంగా ఒత్తిడి పెరుగుతోంది. మితిమీరిన ఆందోళన కారణంగా స్ట్రోక్ సంభవిస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్ట్రోక్ వస్తే మెదడు కణాలు చనిపోతాయి. కొలెస్ట్రాల్ అడ్డుపడి లేదా రక్త స్రావం లేదా ధమని పగిలిపోవడం వల్ల ధమనికి రక్త ప్రసరణ ఆగిపోతుంది. 80% కంటే ఎక్కువ స్ట్రోక్‌లు ఇస్కీమిక్ స్ట్రోక్స్ గా పరిగణించబడుతున్నాయి. అంటే జీవనశైలి, అలవాట్ల వల్ల ధమనులు బ్లాక్ అవడాన్ని ఇస్కీమిక్ స్ట్రోక్ అంటారు.

స్ట్రోక్ ఎలా వస్తుంది? ఎన్ని రకాలు?

ధమనుల లోపలి ఉపరితలం మృదువుగా ఉంటుంది. రక్తప్రసరణలో ఇబ్బంది తలెత్తినప్పుడు ధమనిలో గడ్డ ఏర్పడుతుంది. ఇది స్ట్రోక్ కి దారి తీస్తుంది. స్ట్రోక్ రెండు రకాలు. ఒకటి మోడిఫైబుల్, నాన్ మోడిఫైబుల్ స్ట్రోక్.  వయస్సు సంబంధిత మార్పుల కారణంగా నాన్ మోడిఫైబుల్ స్ట్రోక్ వస్తుంది. దీన్ని నివారించలేము. ఇందులో జన్యుపరమైన అంశాలు కూడా పాత్ర పోషిస్తాయి. మోడిఫైబుల్ స్ట్రోక్ మధుమేహం, రక్తపోటు, మద్యపానం, ఊబకాయం, కొలెస్ట్రాల్, మాదక ద్రవ్యాల వినియోగం వల్ల వస్తుంది. ఈ అనారోగ్య అలవాట్లు కారణంగా ధమనిలో రక్తప్రసరణకి అడ్డుగోడ ఏర్పడుతుంది. అప్పుడు ఇస్కీమిక్ స్ట్రోక్ వస్తుంది. ఇది ఒక్కోసారి గడ్డకట్టే ప్రమాదం వరకి వచ్చే అవకాశం ఉంది.

స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచే ఆహారపు అలవాట్లు

ఆల్కహాల్ తీసుకోవడం: ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఆల్కహాల్ తీసుకుంటే ధమనిలో మార్పులు వస్తాయి. వాళ్ళు స్ట్రోక్ తో పాటు గుండెపితుకి గురయ్యే అవకాశం కూడా ఉంది. ఈ అలవాటు మార్చుకోవడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్ కి గురయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ధూమపానం కూడా మెదడు, గుండెకు ప్రమాదకరం.

News Reels

నిద్ర: శరీరం అన్ని విధాలుగా ఆరోగ్యంగా ఉండాలంటే నిద్ర, వేళకి తినడం అవసరం. నిర్ణీత సమయానికి నిద్రపోవడం, నిద్రలేవడం చాలా అవసరం. నిద్రకి అంతరాయం ఏర్పడినప్పుడు దాని ప్రభావం శరీరం మొత్తం మీద పడుతుంది.

ఆహారపు అలవాట్లు: జంక్ ఫుడ్ తొలగించి వాటికి బదులుగా పండ్లు, కూరగాయలతో సయ అధిక ఫైబర్ ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. భోజనం సరైన సమయానికి చేయకపోతే అది మెదడుని కలవరపెడుతుంది. తగినంత ద్రవాలు తీసుకోవాలి.

ఒత్తిడి: ఒత్తిడి సాధారణ సమస్యగా మారిపోతుంది. ఇది ఎక్కువ మందిని ప్రభావితం చేస్తుంది. యువతలో బ్రెయిన్ స్ట్రోక్ రావడానికి అధిక కారణాం ఇదే.

రెగ్యులర్ వ్యాయామం: రోజులో కనీసం 30-45 నిమిషాల వ్యాయామంలో కఠినమైన వ్యాయామాలు చెయ్యకూడదు. తేలికపాటి వ్యాయామాలతో రోజు ప్రారంభించాలి. ఊబకాయం కూడా స్ట్రోక్ ప్రమాదానికి మరొక కారణం.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

Also Read: మిగిలిపోయిన ఆహారాన్ని వేడి చేస్తున్నారా? జాగ్రత్త, ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే

Published at : 01 Nov 2022 02:06 PM (IST) Tags: Lifestyle Habits Brain Strok Brain Stroke Reason Brain Stroke Risk Reasons For Brain Storke

సంబంధిత కథనాలు

Cucumber: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు

Cucumber: చలికాలంలో కీరదోస తినొచ్చా? ఆయుర్వేదం నిపుణులు ఏం చెప్తున్నారు

Golden Tongue Mummies: పురావస్తు తవ్వకాల్లో బంగారు నాలుకల మమ్మీలు, గోల్డ్‌ కోటెడ్ ఎముకలు

Golden Tongue Mummies: పురావస్తు తవ్వకాల్లో బంగారు నాలుకల మమ్మీలు, గోల్డ్‌ కోటెడ్ ఎముకలు

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

సంవత్సరానికి 12 నెలలే ఎందుకు ఉన్నాయి? నెలల పేర్లు వెనుకున్నది ఎవరు?

Cooking Facts: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?

Cooking Facts: పాస్తాను నీటితో కడగొచ్చా? మైక్రోవేవ్ ఓవెన్‌లో వంటలు చెయ్యకూడదా? ఏది వాస్తవం, ఏది అపోహ?

విజృంభిస్తున్న కేమల్ ఫ్లూ, ఇదొక అంటువ్యాధి - మళ్లీ మాస్కులు పెట్టుకోవాలా?

విజృంభిస్తున్న కేమల్ ఫ్లూ, ఇదొక అంటువ్యాధి - మళ్లీ మాస్కులు పెట్టుకోవాలా?

టాప్ స్టోరీస్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

Praja Sangrama Yatra: 6 నెలల్లో తెలంగాణలో ఎన్నికలు- వచ్చేది బీజేపీ ప్రభుత్వమే: బండి సంజయ్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

IND vs NZ 3rd ODI: వర్షంతో మూడో వన్డే రద్దు- 1-0తో సిరీస్ కైవసం చేసుకున్న కివీస్

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

YS Sharmila: గులాబీ తోటలో ‘కవిత’లకు కొదవ లేదు - ఎమ్మెల్సీ కవితకు షర్మిల స్ట్రాంగ్ రిప్లై

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్

Allu Arjun Landed in Russia : రష్యాలో అల్లు అర్జున్ అండ్ 'పుష్ప' టీమ్