అన్వేషించండి

Layered and Soft Chapati : చపాతీ మెత్తగా, లేయర్లుగా రావాలంటే ఈ టిప్ ఫాలో అయిపోండి.. బెస్ట్ రెసిపీ

Soft Chapati Recipe : చపాతీలు ఎక్కువసేపు మెత్తగా ఉండాలని.. పొరలుగా రావాలని అనుకుంటున్నారా? అయితే వాటిని తయారు చేసేప్పుడు ఈ టిప్​ని ఫాలో అయిపోండి.

Chapati Recipe : నార్త్ ఇండియన్సే కాదు.. సౌత్​లో కూడా చపాతీలను చాలామంది ఇష్టంగా తింటారు. కొందరు అయితే డైట్​లో భాగంగా, రైస్​ని మానేయాలని తింటారు. మరికొందరు వీటితోనే బరువు తగ్గిపోవాలని చూస్తారు. పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ ఇష్టంగా తినే ఈ చపాతీలు ఓ సింపుల్​ టిప్​తో పొరలు వచ్చే విధంగా తయారు చేయవచ్చని తెలుసా? అలాగే ఎంతసేపు ఆగినా.. మెత్తగానే ఉండేలా వాటిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దాం. 

చపాతీ గుండ్రంగా రాలేదని.. లేదా మాడిపోయిందనే కంప్లైంట్సే కాదు.. చపాతీ గట్టిగా ఉందని, పొరలుగా రావట్లేదనే కంప్లైంట్స్ కూడా ఎక్కువగా వినిపిస్తాయి. అయితే చపాతీ పిండి కలిపేప్పుడు, చపాతీలను వత్తే సమయంలో చిన్న ట్రిక్స్ ఫాలో అయితే ఈ కంప్లైంట్స్ దూరమైపోతాయి. అవేంటో.. చపాతీ పిండి కలిపేప్పుడు ఏ టిప్స్ ఫాలో అవ్వాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

అస్సలు చేయకూడని పనులు

ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలో గోధుమ పిండి వేయాలి. దానిలో ఉప్పు వేసి కలిపి.. పిండిని కలిపేందుకు సరిపడా నీటిని పోయాలి. అయితే చాలామంది పిండిని కలిపేప్పుడు పాలు వేస్తారు. అలా వేస్తే చపాతీలు ఎక్కువ కాలం నిల్వ ఉండవట. అంతేకాకుండా పిండిని చేతికి అంటకుండా ఉండేలా మాత్రమే నీటిని పోసి కలుపుతారు. ఈ రెండూ అస్సలు చేయకుండా.. పిండిని కాస్త చేతికి అంటే మాదిరిగానే కలుపుకుని కాసేపు పక్కన పెట్టుకోవాలి. 

పొరల చపాతీ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్

చపాతీ పిండిని తీసుకుని.. చిన్న చిన్న ముద్దలుగా.. చపాతీకి సరిపడా స్టైల్​లో తీసుకోవాలి. ఇప్పుడు చపాతీ కర్రపై పిండిని చల్లి.. చపాతీలను వత్తుకోవాల్సి ఉంటుంది. ఇలా చపాతీగా చేసుకున్న తర్వాత దానిపై నూనెను చల్లి చపాతీ మొత్తం అంటుకునేలా రాయాలి. ఇలా రాసిన చపాతీని రోల్ చేయడం లేదా రెండుసార్లు మడవడం చేసి.. మళ్లీ పిండిని చల్లుకుంటూ చపాతీలుగా చేసుకోవాలి. ఇలా మొత్తం పిండితో చపాతీలు చేసుకోవాలి. 

ఎక్కువసేపు నిల్వ ఉంటాయి..

స్టౌవ్ వెలిగించి దానిపై అట్ల పెనం పెట్టి.. తయారు చేసుకున్న చపాతీలను వేసుకోవాలి. ఇప్పుడు చపాతీకి మరోవైపు ఆయిల్​ పూసి.. ఫ్లిప్ చేయాలి. ఇలా రెండూ వైపులా మంచిగా కాల్చుకుంటే టేస్టీ, మెత్తని చపాతీలు రెడీ. ఇవి పొరలుగా రావడం వల్ల అందరూ వీటిని మంచిగా తింటారు. లంచ్​కోసం బాక్స్​లో దీనిని తీసుకెళ్లినా.. ఎక్కువసేపు తర్వాత తిన్నా కూడా ఈ చపాతీలు మెత్తగానే, రుచిగానే ఉంటాయి. మరి ఇంకెందుకు మీరు ఈ టిప్స్ ఫాలో అయిపోయి టేస్టీ, మెత్తని చపాతీలు తయారు చేసేయండి. 

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More
ఇంకా చదవండి
Sponsored Links by Taboola

టాప్ హెడ్ లైన్స్

Joining in Hostel : మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
మీ పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసే ముందు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే
Telangana Men Health : తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
తెలంగాణ పురుషులకు డబుల్ ట్రబుల్.. జుట్టు ఊడిపోతోంది, జీర్ణశక్తి తగ్గుతోంది
Burn Belly Fat : జిమ్ చేసినా పొట్ట తగ్గట్లేదా? అయితే ఈ 5 సూప్స్​తో చెక్ పెట్టండి.. ఇంట్లోనే చేసుకోగలిగే రెసిపీలు ఇవే
జిమ్ చేసినా పొట్ట తగ్గట్లేదా? అయితే ఈ 5 సూప్స్​తో చెక్ పెట్టండి.. ఇంట్లోనే చేసుకోగలిగే రెసిపీలు ఇవే
Mango Lassi Recipe : సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో లస్సీ.. చాలా సింపుల్​గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇదే
సమ్మర్ స్పెషల్ కూల్ మ్యాంగో లస్సీ.. చాలా సింపుల్​గా చేసుకోగలిగే టేస్టీ రెసిపీ ఇదే

వీడియోలు

Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
MahuaMoitra: మహువా మొయిత్రాకు షాక్.. చోర్ అంటూ నినాదాలు|
Pitapuram Politics: పిఠాపురం ఇన్‌చార్జ్ మార్పు.. కన్నీళ్లు ఆపుకోలేకపోయిన వర్మ... ప్రెస్‌మీట్‌లో ఎమోషనల్
Abhishek Sharma: అభిషేక్ శర్మ vs పంజాబ్: ఇది బ్యాటింగ్ కాదు.. తాండవం
Medchal Infant Kidnap: '50 CC కెమెరాలతో గంటల్లో పట్టుకున్న పోలీసులు.

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Revanth Reddy on Bandi Sanjay Son Case: చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
చట్టం ముందు ఎవరూ అధికులు కారు - మీడియా చిట్‌చాట్‌లో బండి సంజయ్ కుమారుడి కేసుపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
YSRCP Spokesperson Shyamala Response on Rumors: శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
శ్యామలకు కౌంట్‌డౌన్ మొదలైందా? పొగ పెడుతున్న వారికీ యాంకర్ శ్యామల ఘాటు కౌంటర్!
Petrol and Diesel Price Hike? ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
ప్రధాని మోదీ మాటల వెనక అంతరార్థం అదేనా..! భారత్ పై మిడిల్ ఈస్ట్ సంక్షోభం తప్పదా! సామాన్యులపై భారీ భారం?
IPL Fastest Centuries: ఐపీఎల్ చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
IPL చరిత్రలో ఫాస్టెస్ట్ సెంచరీలు బాదిన టాప్ 5 బ్యాటర్లు వీరే.. వైభవ్ వెరీ వెరీ స్పెషల్
TN Minister S Keerthana: ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. నిరాశగా వెనుదిరిగిన కీర్తన
ఎమ్మెల్యేగా ప్రమాణం చేయకుండా మహిళా మంత్రికి అనుమతి నిరాకరణ.. Watch Video
Peddi Trailer : రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
రామ్ చరణ్ మాస్ జాతర షురూ - పెద్ది ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్... ఇట్స్ అఫీషియల్
Barrierless Toll Plaza: టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
టోల్ ప్లాజాల వద్ద ఇక ఆగక్కర్లేదు.. దేశంలో రెండో బారియర్ లెస్ టోల్ ప్రారంభం! కేంద్రం సరికొత్త అడుగు
Bandi Bhagirath POCSO Case: బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు.. తక్షణ విచారణకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
Embed widget