Ravva Halwa Recipe : టేస్టీ స్వీట్ హల్వా రెసిపీ.. పాలతో ఇలా చేస్తే రుచి అదిరిపోతుంది
Halwa Recipe in Telugu : మీకు హల్వా అంటే ఇష్టమా? అయితే మీరు రొటీన్‌కి బదులుగా, మరింత రుచిగా దీనిని ఆస్వాదించాలనుకుంటే ఈ రెసిపీని ఫాలో అయిపోండి.

Ravva Halwa with Milk Recipe : హల్వాను చాలామంది ఇష్టంగా తింటారు. పిల్లల నుంచి పెద్దల వరకు కూడా దీనికి ఫ్యాన్స్ ఉంటారు. అయితే ఈ హల్వాను వివిధ రకాలు తయారు చేసుకుంటారు. ఎలా చేసినా దీని రుచి టాప్‌లోనే ఉంటుంది. రవ్వతో దీనిని చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. అయితే రవ్వలోనే పాలు కలిపి హల్వా చేసుకోవచ్చని మీకు తెలుసా? ఇది రెగ్యులర్ రవ్వ హల్వాను మించిన రుచిని ఇస్తుంది. సింపుల్‌గా, టేస్టీగా తయారు చేసుకోగలిగే ఈ హల్వాను ఎలా చేయాలో.. కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం.
కావాల్సిన పదార్థాలు
రవ్వ - 1 కప్పు
పాలు - 2 కప్పులు
నెయ్యి - 1 కప్పు
పంచదార - 1 కప్పు
బాదం - 10
జీడిపప్పు - 20
పుచ్చకాయ గింజలు - 1 టీస్పూన్
ఎండు ద్రాక్షలు - 1-
దాల్చిన చెక్క పౌడర్ - అర టీస్పూన్
తయారీ విధానం
ముందుగా రవ్వను ఓ బౌల్లోకి తీసుకోవాలి. దానిలో పాలు వేసి అరగంట పక్కన పెట్టేయాలి. బాదం, జీడిపప్పును ముక్కలు వేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పాన్ పెట్టాలి. దానిలో రెండు టేబుల్స్పూన్ల నెయ్యిని వేయాలి. అది కాస్త వేడి అయిన తర్వాత దానిలో బాదం, జీడిపప్పు, ఎండు ద్రాక్షలు వేసి ఫ్రై చేయాలి. వాటిలో పుచ్చకాయ గింజలు కూడా వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. అవి మంచి అరోమా వచ్చి.. వేగిన తర్వాత ఓ గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు అదే పాన్‌లో మిగిలిన నెయ్యిని వేసి.. పంచదారను కూడా వేయాలి. స్టౌవ్ మీడియం హీట్‌లో ఉంచి.. షుగర్‌ని కరగనివ్వాలి. పాకంగా తయారవుతున్న సమయంలో ముందుగా నానబెట్టుకున్న రవ్వను వేయాలి. పాలతోపాటు కలిసిన ఈ రవ్వ హల్వాకు మంచి రుచిని ఇస్తుంది. ఇలా వేసిన రవ్వను పాకంలో పూర్తిగా కలిసేలా కలుపుతూనే ఉండాలి. మంటను తక్కువలోనే ఉంచి మిక్స్ చేస్తూనే ఉండాలి.
పదిహేను నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత హల్వా థిక్‌గా మారుతుంది. పాన్ని వదులుతుంది. ఇలా పాన్ని వదిలేసిన తర్వాత దానిలో నట్స్ వేయాలి. దాల్చిన చెక్క పొడి కూడా వేసి కలపాలి. ఇప్పుడు స్టౌవ్ ఆపేసి కొన్ని నిమిషాలు అలా పక్కన ఉంచేయాలి. తర్వాత సర్వ్ చేసుకుంటే మంచిది. దీనిని మీరు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని కూడా తినొచ్చు. పిల్లలను నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినగలగే టేస్టీ హల్వాను పండుగల సమయంలో, స్పెషల్ డేలలో చేసుకోవచ్చు.
Also Read : టేస్టీ స్వీట్ మ్యాంగో హల్వా రెసిపీ.. రవ్వతో ఇలా ఈజీగా చేసేయండి






















