News
News
X

Kobbari Junnu: జున్నుపాలు అవసరమే లేని జున్ను రెసిపీ, కుక్కర్లో ఇలా వండేయచ్చు

జున్నంటే ఇష్టమా? అయితే ఓసారి కొబ్బరి జున్నును ప్రయత్నించండి.

FOLLOW US: 

జున్ను తినాలంటే జున్ను పాల కోసం వేచి ఉండాల్సిందే. కానీ జున్ను పాలు అవసరం లేకుండా కూడా జున్నును తయారుచేసుకోవచ్చు. అది కూడా చాలా రుచిగా. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ జున్నును తయారుచేసుకోవచ్చు. దీన్ని కొబ్బరి జున్ను అంటారు. ఆంధ్రాలో ఇది స్పెషల్ వంటకం. వండడం పెద్ద కష్టమేం కాదు, చాలా సులువు. ఓసారి చేసుకుని చూడండి. మళ్లీ మళ్లీ మీరే వండుకుని తింటారు. 

కావాల్సిన పదార్థాలు
బియ్యం - పావు కిలో
కొబ్బరి ముక్కలు - ఒక కప్పు
బెల్లం - పావు కిలో
పంచదార - వందగ్రాములు
నీళ్లు - ఒక గ్లాసు
ఉప్పు - అరస్పూను
యాలకుల పొడి - ఒక స్పూను
నెయ్యి - అర స్పూను
మిరియాల పొడి - అర స్పూను

తయారీ ఇలా
1. బియ్యాన్ని ఒక గిన్నెలో వేసి మూడు నుంచి నాలుగ్గంటలు నానబెట్టుకోవాలి.
2. ఆ బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
3. ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని కూడా మిక్సిలో వేసి మెత్తగా రుబ్బుకోవాలి. 
4. ఆ కొబ్బరి మిశ్రమాన్ని బియ్యం రుబ్బులో వేసి బాగా కలపాలి. 
5. కాస్త ఉప్పు, యాలకుల పొడి కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. 
6. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి బెల్లం, పంచదార నీళ్లు వేసి పాకం తీయాలి. 
7. ఆ పాకాన్ని చల్లార్చి బియ్యం, కొబ్బరి రుబ్బులో వేసి బాగా కలపాలి. 
8. ఒక గిన్నె అడుగుభాగానికి నెయ్యి రాసి అందులో ఈ మొత్తం మిశ్రమాన్ని పోయాలి. పైన మిరియాల పొడి చల్లాలి. 
9. ఇప్పుడు కుక్కర్లో అడుగున నీళ్లు వేసి ఈ గిన్నెను దించాలి. గిన్నెపై మూత పెట్టాలి. తరువాత కుక్కర్ పై కూడా మూత పెళ్లి ఆరు విజిల్స్ దాకా ఉడికించాలి. 
10. ఆ తరువాత కుక్కర్ మూత తీసి చల్లార్చాలి. 
11. ముక్కలు కోసి సర్వ్ చేస్తే కొబ్బరి జున్ను రెడీ. దీన్ని రుచి అదిరిపోతుంది. అసలు జున్ను కన్నా ఇదే చాలా బావుంటుంది. 

దీనిలో పచ్చి కొబ్బరిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. దీనిలో మానవ శరీరానికి అవసరమైన కొవ్వులు, ఖనిజాలు, విటమిన్లు,యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. పచ్చి కొబ్బరి ముక్కలు తిన్నాక పొట్ట నిండిన ఫీలింగ్ కలుగుతుంది.దీన్ని తరచూ తింటే కండరాలు బలంగా మారతాయి. పచ్చి కొబ్బరిలో యాంటీ వైరస్, యాంటీ బ్యాక్టిరియల్ లక్షణాలు కూడా అధికం. అలాగే యాంటీ ఫంగల్ గుణాలు కూడా పుష్కలం. వారానికోసారైనా పచ్చి కొబ్బరిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరగుతుంది. వైరల్ ఫీవర్లు, సీజనల్ వ్యాధులతో పోరాడే శక్తిని పచ్చి కొబ్బరి ఇస్తుంది. కొబ్బరిని వండుకునే తినాలని లేదు, పచ్చి కొబ్బరి ముక్కలు తిన్నా చాలు. కావాల్సిన విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందుతాయి. పచ్చి కొబ్బరిలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కాబట్టి పచ్చి కొబ్బరిని వంటల్లో భాగం చేసుకుంటే మంచిది.

Also read: పాలతో చేసిన టీ అతిగా తాగితే వచ్చే సైడ్ ఎఫెక్టులు ఇవే

Also read: లో-బీపీతో కళ్లు తిరుగుతున్నాయా? కారణాలివే, ఈ జాగ్రత్తలు పాటించండి

Published at : 18 Aug 2022 04:33 PM (IST) Tags: Telugu vantalu Telugu recipes Kobbari junnu recipe Kobbari junnu Kobbari junnu making

సంబంధిత కథనాలు

Traffic rules violations: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?

Traffic rules violations: హారన్ కొడితే రూ.15 వేలు జరిమానా, జైల్లో చిప్పకూడు తప్పదు - ఎక్కడో తెలుసా?

Viral Video: పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించలే-ఏపనైనా ఒంటి చేత్తోనే, సాధువు వీడియో వైరల్!

Viral Video: పదేండ్లుగా ఎత్తిన చెయ్యి దించలే-ఏపనైనా ఒంటి చేత్తోనే, సాధువు వీడియో వైరల్!

Microwave Oven: బేకింగ్ చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అక్కర్లేదు, మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు!

Microwave Oven: బేకింగ్ చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్ అక్కర్లేదు, మీ ఇంట్లో ఇవి ఉంటే చాలు!

Cancer: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు!

Cancer: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా? జాగ్రత్త, అది ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ కావచ్చు!

Indian Food: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !

Indian Food: మీకు అదృష్టాన్ని తెచ్చే ఆహారాలు ఇవే - ఇది మీ జేబులో ఉంటే డబ్బు ఖర్చు తగ్గుతుందట !

టాప్ స్టోరీస్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

తిరుమలేశుడికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం జగన్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై కిషన్ రెడ్డివి అవగాహన లేని మాటలు: మంత్రి సత్యవతి రాథోడ్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Sandeep Lamichane: ఇంటర్నేషనల్ క్రికెటర్‌పై రేప్ ఆరోపణలు, అరెస్ట్ వారెంట్ జారీ - రంగంలోకి దిగిన ఇంటర్ పోల్

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..! | ABP Desam

Ponniyin Selvan Characters: మణిరత్నం కలల ప్రాజెక్టులో పాత్రల నేపథ్యాలు ఇవే..!  | ABP Desam