Kissing Day: ముద్దు ప్రేమని పెంచడమే కాదు - ఆరోగ్యాన్నీ పెంచుతుంది
వాలెంటైన్స్ వీక్ లో ఈరోజు కిస్సింగ్ డే. ముద్దు కేవలం ప్రేమను పెంచేందుకే కాదు, ఎంతో ఆరోగ్యాన్ని అందిస్తుంది.
ఒకప్పుడు వాలెంటైన్స్ డేని మాత్రమే నిర్వహించుకునే వాళ్ళు కానీ ఇప్పుడు వాలెంటైన్స్ వీక్ పేరుతో ఏడాదిలో 8 రోజులు ప్రేమలో మునిగితేలుతున్నారు. ఫిబ్రవరి 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో ప్రత్యేక దినానికి కేటాయిస్తూ ప్రేమ ప్రయాణం సాగిస్తున్నారు. అలా ఈరోజు కిస్సింగ్ డే. తర్వాత వచ్చేది చివరి రోజైనా వాలెంటైన్స్ డే. ముద్దు పెట్టుకోవడం వల్ల శరీరంలో ఎండార్పిన్ ఎక్కువగా విడుదలవుతుంది. దీని వల్ల ఒత్తిడి తగ్గుతుంది. కారణం శరీరంలో రక్త ప్రవాహం పెరిగి మానసికంగా, శారీరకంగా ఒత్తిడి పోయినట్టు అనిపిస్తుంది. అందుకే ఒత్తిడికి ముద్దు ఒక శక్తివంతమైన ఔషధం అని చెప్పుకోవచ్చు.
1. ముద్దు పెట్టుకోవడం వల్ల ప్రేమలోని ఘాటుతనం తెలియడమే కాదు, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. మంచి బ్యాక్టీరియా ఒక భాగస్వామి నుంచి మరొకరికి బదిలీ అవుతుంది. దీనివల్ల రోగనిరోధక శక్తి అమాంతం పెరుగుతుంది. అలాగే ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఇమ్యునో గోబ్లింగ్ ఏ విడుదలవుతుంది. దీని వల్ల కూడా శరీరం వ్యాధి నిరోధక శక్తిని పొందుతుంది.
2. వ్యాయామం చేసినప్పుడు మాత్రమే క్యాలరీలు బర్న్ అవుతాయనుకుంటారు. కానీ ముద్దు పెట్టుకుంటున్నప్పుడు కూడా క్యాలరీలు బర్న్ అవుతాయి. ఒక్కసారి ముద్దు పెట్టుకోవడం వల్ల ఎనిమిది నుంచి 16 క్యాలరీలు బర్న్ అయ్యే అవకాశం ఉంది. అలాగే జీవక్రియ రేటు రెండు రెట్లు పెరిగే ఛాన్సులు కూడా ఉన్నాయి.
3. ముఖంలోని కండరాలకు ముద్దు మంచి వ్యాయామం అని చెప్పవచ్చు. ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ముఖ కండరాలకు కాస్త పని దొరుకుతుంది. ఇది ముఖ కండరాలకు వ్యాయామం లాంటిది. కాబట్టి రోజులో ఎక్కువ సార్లు ముద్దు పెట్టుకుంటే. ముఖం మరింత ప్రకాశవంతంగా మారుతుంది.
4. ఒకరిలో ఆత్మవిశ్వాసాన్ని పెంచడంలో కూడా ముందు ఎంతో సహకరిస్తుంది. మీ పైన మీ నమ్మకాన్ని పెంచే సామర్థ్యం ముద్దులో ఉంది. ఎవరైనా ముద్దు పెడితే వారికి మీరు ఎంతో ఇష్టమని అర్థం. కాబట్టి మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పడతాయి.
5. ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఆక్సిటోసిన్ వంటి హార్మోన్లు విడుదలవుతాయి. ఇవన్నీ కూడా పొట్టలో ఆనందాన్ని పెంచిన భావనను కలిగిస్తాయి. దీనివల్ల ఎదుటివారిపై మీకు ప్రేమ మరింత పెరుగుతుంది. ప్రేమ ఎప్పుడు పెరిగిందో జీవితంపై ఆశలు కూడా అంతే పెరుగుతాయి. డిప్రెషన్, నిరాశ వంటివి దరి చేరవు.
6. ముద్దు పెట్టుకుంటున్నప్పుడు ఎఫినెట్రిన్ విడుదలవుతుంది. కాబట్టి గుండెకు ఎంతో మేలు జరుగుతుంది.
Also read: పిల్లల్లో పెరుగుతున్న చికెన్ పాక్స్ కేసులు -ఇది ఎందుకు వస్తుందంటే
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.