అన్వేషించండి

Most Dangerous Snake : ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పాము ఇదే.. ఒక్క కాటుతో 20 మందిని చంపగలదట

Deadly Snake : ప్రపంచంలో చాలా రకాల పాములు ఉన్నాయి. అయితే ఒక్క కాటుతో ఏనుగును చంపగల పాము గురించి తెలుసా? ఎంత ప్రమాదమంటే..

King of Venomous Snakes : ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన జీవులలో పాము ఒకటి. కానీ వాటిలో కూడా దాని పరిమాణంతో పాటు, ఒకేసారి అధిక మొత్తంలో విషాన్ని విడుదల చేసే పాము కూడా ఒకటి ఉంది. పైగా ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఆ పాము పేరే కింగ్ కోబ్రా(King Cobra). ఒకే కాటుతో ఈ పాము 500 మిల్లీగ్రాముల వరకు విషాన్ని విడుదల చేయగలదు. ఈ విషం 20 మంది మనుషులను లేదా ఒక పెద్ద ఏనుగును కూడా కొన్ని గంటల్లో చంపడానికి సరిపోతుందట. ఈ పాము గురించి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం.

ప్రపంచంలోనే పొడవైన విషపూరిత పాము

కింగ్ కోబ్రా ప్రపంచంలోనే పొడవైన విషపూరిత పాము. మూడు నుంచి నాలుగు మీటర్లు, కొన్ని అరుదైన సందర్భాల్లో 5.8 మీటర్ల కంటే ఎక్కువ పొడవు ఉండటం వల్ల ఇది మరింత భయాన్ని కలిగిస్తుంది. ఇది ఆలివ్ ఆకుపచ్చ నుంచి ముదురు గోధుమ లేదా నలుపు రంగులో ఉంటుంది. ఈ పాము తరచుగా లేత రంగు చారలను కలిగి ఉంటుంది. ప్రమాదం అనిపించినప్పుడు.. అది తన పొడవైన, సన్నని పడగను విప్పి నిల్చొంటుంది. దీనికి శాస్త్రీయ నామం కూడా ఉంది. శాస్త్రీయంగా దీనిని ఓఫియోఫాగస్ అని పిలుస్తారు. అంటే పాము తినేది అని అర్థం. ఇతర పాములు.. ఎలుకలు లేదా పక్షులను వేటాడతాయి. కాని కింగ్ కోబ్రా.. ఇతర పాములను కూడా వేటాడుతుంది. 

ఒక్క కాటుతో అంతా మటాష్..

కింగ్ కోబ్రా విషం ఒక శక్తివంతమైన న్యూరోటాక్సిన్. ఇది తన వేట నాడీ వ్యవస్థను మూసివేస్తుంది. ఒకసారి ఇంజెక్ట్ చేసిన తర్వాత.. టాక్సిన్ మెదడు, ముఖ్యమైన అవయవాల మధ్య సిగ్నల్స్ నిరోధిస్తుంది. దీని తరువాత పక్షవాతం వస్తుంది. తరువాత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి గుండెపోటు వస్తుంది. చాలా పాములకు భిన్నంగా.. కింగ్ కోబ్రా ఒకేసారి చాలా ఎక్కువ మొత్తంలో విషాన్ని విడుదల చేస్తుంది. ఈ విషం సాధారణంగా 200 నుంచి 500 మిల్లీగ్రాముల మధ్య ఉంటుంది. ఈ పాము ఏనుగు తొండానికి కాటు వేస్తే.. ఏనుగు కొన్ని గంటల్లోనే చనిపోయిన సందర్భాలు చాలా చోట్లనే జరిగాయి.  

అయితే కింగ్ కోబ్రా విషం ప్రాణాంతకం మాత్రమే కాదు.. వైద్యపరంగా కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెప్తున్నారు పరిశోధకులు. కింగ్ కోబ్రా విషంలో ఓహానిన్ అనే ప్రత్యేకమైన ప్రోటీన్‌ను పరిశోధనల్లో కనుగొన్నారు. ఇది నొప్పి నివారిణిగా చాలా ఉపయోగకరంగా ఉంటుందని గుర్తించారు. ఇది మార్ఫిన్ కంటే 100 రెట్లు ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. అదే సమయంలో ప్రారంభ అధ్యయనాలు దీనివల్ల ఎలాంటి దుష్ప్రభావాలు లేవని వెల్లడించాయి. దీనిగురించి మరిన్ని స్టడీలు జరగాల్సి ఉంది. 

గమనిక: ఈ కథనంలో అందించిన సమాచారం నిపుణులు పంచుకున్నారు. ఇది సాధారణ సమాచార ప్రయోజనాల కోసం మాత్రమే ఉద్దేశించబడింది. వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే, ఎల్లప్పుడూ మీ వైద్యుడు లేదా ఇతర అర్హత కలిగిన ఆరోగ్య సంరక్షణ ప్రదాత సలహా తీసుకోండి.

About the author Geddam Vijaya Madhuri

విజయ మాధురి గెడ్డం గత ఏడేళ్లుగా డిజిటల్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2018లో హైదరాబాద్‌లోని ఈటీవీ భారత్‌లో కంటెంట్ ఎడిటర్‌గా కెరీర్‌ను ప్రారంభించారు. అక్కడ మూడేళ్లు పనిచేశారు. తరువాత హిందూస్తాన్ టైమ్స్ తెలుగు‌లో సంవత్సరం పాటు సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్​గా పనిచేశారు. ప్రస్తుతం మాధురి ABP దేశంలో లైఫ్‌స్టైల్ విభాగంలో పని చేస్తున్నారు. ఆరోగ్య సంబంధిత కథనాలు, ఆసక్తికరమైన లైఫ్‌స్టైల్ విషయాలను క్రియేట్ చేస్తూ.. పాఠకుల ఆసక్తికి అనుగుణంగా కంటెంట్ ఇస్తున్నారు.

Read More

టాప్ హెడ్ లైన్స్

High BP : బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
బీపీ తగ్గాలంటే డైట్, లైఫ్‌స్టైల్​లో ఈ మార్పులు తప్పక పాటించండి.. నిపుణుల సూచనలు ఇవే
Spine Surgery Recovery : స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
స్పైన్ సర్జరీ తర్వాత పేషెంట్ బెడ్‌కే పరిమితం కావాలా? రికవరీ ఎప్పటి నుంచి మొదలవుతుందంటే
Low BP Diet : తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
తరచూ బీపీ తగ్గిపోతుందా? ఈ ఫుడ్స్, డ్రింక్స్ కంట్రోల్ చేయండి.. లేకుంటే ఇబ్బంది తప్పదు
Mustard Oil For Hair Patches : ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు
ఆవాల నూనెను వీటితో కలిపి అప్లై చేస్తే జుట్టుకు ఎంత మంచిదో.. మందారం, మెంతులు నుంచి ఉల్లిపాయ వరకు

వీడియోలు

IAS Officers | హిమాచల్‌లో IAS పోస్టుల కోత.. AP, Telanganaలో పెంపు! అసలు కారణమేంటి?
Gundenininda Gudigantalu Serial August 21 | ప్రభావతికి తిక్క కుదిర్చిన మీనా, శృతి
Formula1 Race Car Exhibition Andhra University | ఆంధ్రా యూనివర్శిటీలో ఫార్ములా-1 కారు
Konda Susmitha Vs Congress | ఉన్నమాటంటే ఉలిక్కిపడుతున్నారా..!?|
JAC Bopparaju Venkateswarlu Comments | మా జీతాలకే ఆదాయం మొత్తం సరిపోతోంది అనేది అబద్దం

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
CM Chandrababu: వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
వచ్చే నెలలో అనకాపల్లి, విశాఖకు గోదావరి జలాలు! ఏపీ సీఎం చంద్రబాబు కీలక ప్రకటన!
Veligonda Project: వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
వెలిగొండ ప్రాజెక్టు తొలిదశ ప్రారంభానికి సర్వం సిద్ధం! నిర్వాసితులకు 250 కోట్ల అందజేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు! 
Sheik Sadiq Khan Arrest: పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
పంచాయతీరాజ్ ఏఈ కుటుంబ ఆత్మహత్య కేసులో కీలక ముందడుగు! ఢిల్లీలో చిక్కిన రైఫిల్ షూటింగ్ కోచ్‌ సాధిక్ ఖాన్!
Lok Sabha Delimitation Freeze: డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
డీలిమిటేషన్‌కు కాంగ్రెస్ నో - 50 ఏళ్లుగా 90 కోట్లు పెరిగిన జనాభా - మరి ఎంపీ సీట్లు పెరగొద్దా?
iPhone Crimes India: ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
ఐఫోన్ మోజులో ముక్కలవుతున్న భారతీయ కుటుంబాలు! రోజురోజుకు పెరుగుతున్న హత్యలు, ఆత్మహత్యలు!
Revanth Reddy US Tour Cancellation : రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
రేవంత్‌కు కావాల్సిందే కేంద్రం చేసిందా ? - అమెరికా టూర్ పర్మిషన్ క్యాన్సిల్ వెనుక రాజకీయం ఉందా?
Deepika Padukone : ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
ప్రభాస్ స్పిరిట్ కాంట్రవర్సీపై దీపికా పదుకోన్ రియాక్షన్ - ఒక్క లైక్‌తో...
VVIP Road Accident Cases : అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
అప్పలరాజు కుమారుడికో న్యాయం.. లింగమనేని కుమారుడికో న్యాయం - ఎందుకంటే ?
Embed widget