అన్వేషించండి

Kerala Hepatitis A: కేరళలో మరోవిపత్తు, రాష్ట్ర వ్యాప్తంగా హెపటైటిస్ A విజృంభణ, 12 మందికి పైగా మృతి

కేరళను మరో విపత్తు వణికిస్తోంది. ఆ రాష్ట్రంలో హెపటైటిస్‌ A వైరస్‌ విజృంభిస్తోంది. ఈ వైరస్‌ ప్రభావంతో ఇప్పటి వరకు 12 మందికి పైగా మరణించారు. 2 వేల మందికి పైగా ఆస్పత్రిలో చేరారు.

Hepatitis A outbreak in Kerala: భారీ వరదలు, కరోనాతో అతలాకుతలం అయిన కేరళ రాష్ట్రాన్ని మరో విపత్తు కలవరపెడుతోంది. గత కొద్ది రోజులుగా  హెపటైటిస్ A వైరస్ విజృంభిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 12 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ సోకి 2 వేల మందికి పైగా హాస్పిటల్ లో చేరారు. ఈ వైరస్ మలప్పురం, ఎర్నాకులం, కోజికోడ్‌, త్రిసూర్‌ జిల్లాలో మరింత తీవ్ర రూపం దాల్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ నాలుగు రాష్ట్రాల్లో కేసులు రోజు రోజుకు  పెరుగుతున్న నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించింది. కలుషిత ఆహారం, నీటి ద్వారా వ్యాప్తి చెందే హెపటైటిస్ A వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తలకు సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేసింది. ఆస్పత్రిలో చేరిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్య అధికారులను ఆదేశించింది. వైరస్ అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని   సూచించింది.   

ఇంతకీ హెపటైటిస్ A అంటే ఏంటి?

సాధారణంగా కలుషిత నీరు, ఆహారం తీసుకోవడం వల్ల హెపటైటిస్ A వైరస్ సోకుతుంది. వైరస్ వల్ల వచ్చే ఈ వ్యాధిని వైరల్ హెపటైటిస్ అంటారు. ఈ హెపటైటిస్ ను మూడు రకాలుగా విభజించారు. హెపటైటిస్ A, B, C. హెపటైటిస్ A అనేది కాలేయం మీద ప్రభావాన్ని చూపిస్తుంది. వైరస్ తీవ్రత పెరిగితే కాలేయం పని చేయడం మానేస్తుంది. ముందుగానే హెపటైటిస్ A సోకినట్లు గుర్తిస్తే చికిత్స చేసే అవకాశం ఉంటుంది. లేదంటే కాలేయం మార్చాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. నిజానికి చాలా మందిలో హెపటైటిస్ A లక్షణాలు పెద్దగా కనిపించవు. కానీ, కొంత మందిలో వ్యాధి తీవ్రరూపం దాల్చి చనిపోయే అవకాశం ఉంటుంది.

హెపటైటిస్ A ఎలా సోకుతుందంటే?

హెపటైటిస్ A ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తితో శారీరక సంబంధం కలిగి ఉన్నా, రక్త మార్పిడి చేసినా, గర్భిణీల నుంచి పుట్టబోయే పిల్లలకు సోకే అవకాశం ఉటుంది. కాలేయ సమస్యలతో బాధపడే వారిరితో పాటు మద్యం తాగే అలవాటు ఉన్నవారికి హెపటైటిస్ A సోకే అవకాశం ఉంటుంది.  

హెపటైటిస్ A లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెపటైటిస్ A సోకిన వారిలో అలసట, వికారం, వాంతులు, కడుపు నొప్పి, జ్వరం, చర్మం, కళ్లు పసుపు రంగులోకి మారడం, విరేచనాలు, ఎలర్జీ కలుగుతాయి. హెపటైటిస్ A లక్షణాలు పిల్లలతో పోల్చితే పెద్దవారిలోనే ఎక్కువగా కనిపిస్తాయి. హెపటైటిస్ A  సోకుకుండా ఉంటాలంటే, కాచి వడపోసిన నీళ్లు తాగాలి. ఆహారం తీసుకోవడానికి ముందుక చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. రోడ్ సైడ్ ఫుడ్ కు దూరంగా ఉండటం మంచిది. బహిరంగ మల విసర్జన చేయకూడదు.

హెపటైటిస్ A నిర్ధారణ ఎలా? చికిత్స ఏంటి?  

హెపటైటిస్ Aను సోకిందా? లేదా? అని తెలుసుకోవాలంటే రక్త పరీక్ష చేసుకోవాలి. ఇమ్యునోగ్లోబులిన్ జి యాంటీబాడీస్ ను గుర్తించే టెస్ట్ ద్వారా హెపటైటిస్ Aను గుర్తించవచ్చు. RT-PCR పరీక్షల ద్వారా కూడా హెపటైటిస్ Aని గుర్తించే అవకాశం ఉంటుంది. హెపటైటిస్ A సోకిన వాళ్లు పోషకాహారం, పండ్ల రసాలు తీసుకోడంతో పాటు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. పరిస్థితి తీవ్రంగా ఉంటే హాస్పిటల్ లో చేరాలి. హెపటైటిస్ A టీకా వేసుకోవడంతో పాటు పరిసరాల పరిశ్రుభ్రత ద్వారా హెపటైటిస్ A రాకుండా కాపాడుకోవచ్చు.

Read Also: మీ పిల్లలు టీవీ చూస్తూ ఫుడ్ తింటున్నారా? జరిగేది ఇదే.. జాగ్రత్త!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

ఆదిలాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్ళపై ABP గ్రౌండ్ రిపోర్ట్సైబర్ క్రైమ్‌కి స్కామర్, వీడియో కాల్ పిచ్చ కామెడీ!గుడిలోకి చొరబడ్డ ఎలుగుబంట్లు, బెదిరిపోయిన భక్తులుDaaku Maharaaj Teaser | Nandamuri Balakrishna తో బాబీ ఏం ప్లాన్ చేశాడో | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra News: ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
ఐఐటీ మద్రాసుతో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు - ముఖ్యాంశాలివే!
KTR News: రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
రాజ్యాంగేతర శక్తిగా సీఎం రేవంత్ సోదరుడు, అధికారులకు సైతం ఫోన్లోనే ఆదేశాలు: కేటీఆర్
Special Trains: అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ - తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైళ్లు
CM Chandrababu: 'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
'ఏపీ మొత్తం అప్పు రూ.9.74 లక్షల కోట్లు' - వైసీపీ ఆర్థిక ఉగ్రవాదం సృష్టించిందని సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం
Sabarimala Temple: శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
శబరిమల అయ్యప్ప దర్శనాలు ప్రారంభం - ఏ సమయాల్లో దర్శించుకోవచ్చంటే?
The Rana Daggubati Show: రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
రానా దగ్గుబాటి షోకి వచ్చిన గెస్టులు వీళ్ళే - Amazon Prime Videoలో స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి?
APSRTC: ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
ఆర్టీసీ బస్సుల్లో వృద్ధులకు రాయితీ - ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ
Ranji Trophy 2024: రంజీ ట్రోఫీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
రంజీ చరిత్రలో మరో అద్భుతం, ప్రత్యర్థి టీమ్ మొత్తాన్ని ఆలౌట్ చేసిన ఒకే ఒక్కడు
Embed widget