SuperFoods: వీటిని పరగడుపునే ఖాళీ పొట్టతో తింటే ఎంతో ఆరోగ్యం
ఖాళీ పొట్టతో తినాల్సిన ఆహారాల జాబితా ఇది.
ఖాళీ పొట్టతో ఏవి పడితే అవి తినకూడదు. కొన్ని రకాల ఆహారాలు ఖాళీ పొట్టతో తింటే ప్రతికూల ప్రభావాలు చూపిస్తాయి. పరగడుపున ఖాళీ పొట్టతో తినాల్సిన ఆహారాల జాబితా ఇది. వీటిని తింటే రోజంతా చురుగ్గా సాగుతుంది. అంతేకాదు ఆరోగ్యపరంగానూ ఎన్నో చక్కటి లాభాలు ఉన్నాయి. అవేంటంటే...
బొప్పాయి
రోజును బొప్పాయితో ప్రారంభిస్తే ఆ రోజంగా చురుగ్గా, శక్తివంతంగా సాగుతుంది. ఈ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. పేగు కదలికలను నియంత్రించడం ద్వారా జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను, ఉబ్బరాన్ని నియంత్రించేప్పుడు శక్తి కోసం ఫ్రక్టోజ్ ను అందిస్తుంది. బొప్పాయి ఖాళీ పొట్టతో తిన్నాక గంట పాటూ ఏదీ తినకూడదు. ఆ సమయంలో బొప్పాయి శరీరంపై ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఓ గంట తరువాత బ్రేక్ ఫాస్ట్ తినవచ్చు.
పుచ్చకాయ
ఉదయాన పుచ్చకాయేంటి? అని వాదించకుండా ఖాళీ పొట్టతో ఒక ముక్క తినేయాలి. ఇది శరీరాన్ని రోజంతా తాజాగా ఉంచుతుంది. ఇందులో ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. ఇవి శరీరంలోని ద్రవాల సమతుల్యతను కాపాడతాయి. ఈ పండులో 90 శాతం నీరే ఉంటుంది. ఇది విటమిన్ సి, విటమిన్ బి6, లైకోపీన్, ఫ్రక్టోజ్‌లు సమృద్ధిగా ఉంటాయి. కేలరీలు కూడా చాలా తక్కువగా అందుతాయి కాబట్టి తిన్నా బరువు పెరగరు. దీనిలో రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు ఉన్నాయి.
నానబెట్టిన నట్స్
నానబెట్టిన బాదం పప్పులు తినడం వల్ల ఎంతో మేలు. పరగడుపున వీటిని తింటే చాలా మంచిది. కేవలం ఇవే కాదు నానబెట్టిన వాల్ నట్స్, అంజీర్లు కూడా తినాలి. ఇవి ప్రొటీన్‌ను, మంచికొవ్వును అందిస్తాయి. తద్వారా శరీరానికి శక్తి లభిస్తుంది.
ఈ ద్రవాహారాలు
జీలకర్ర నీళ్లు, వాము నీళ్లు, కొబ్బరి నీళ్లు, గోరువెచ్చని నీళ్లు ఖాళీ పొట్టతో తాగితే చాలా మంచిది. ఈ పానీయాలు జీర్ణ వ్యవస్థకు మేలు చేస్తాయి. పేగు కదలికలను పెంచుతాయి. ఇందులోని ఎంజైములు, ఖనిజాలు, విటమిన్లు పొట్టని ఆరోగ్యంగా ఉంచుతాయి. హార్మోన్లను నియంత్రించడానికి, టాక్సిన్లను శరీరం నుంచి బయటికి పంపడానికి, జీవక్రియను మెరుగు పరచడానికి, బరువు తగ్గడానికి ఈ పానీయాలు సహకరిస్తాయి.
కూరగాయల రసాలు
క్యారెట్, బీట్ రూట్, పచ్చి కూరగాయల జ్యూసులతో రోజును ప్రారంభించడం చాలా ఉత్తమ మార్గం. ముఖ్యంగా మహిళలకు మరీ మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఫైబర్ ఇందులో లభిస్తాయి. ఇవి చర్మం, జీర్ణ వ్యవస్థ, జుట్టుకు మేలు చేస్తుంది. అందం కూడా పెరుగుతుంది.
Also read: ఆమె జుట్టునే గూడుగా మార్చుకున్న పక్షి, 84 రోజులు అక్కడే తిష్ట!
Also read: విల్‌స్మిత్ భార్యది గుండు కాదు, అది అలోపేషియా సమస్య, ఎందుకొస్తుందంటే