(Source: ECI/ABP News/ABP Majha)
Sunscreen Safe for Kids or Not : పిల్లలకు సన్‌స్క్రీన్ లోషన్ వాడొచ్చా? సైడ్ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా? నిపుణుల సలహాలు ఇవే
Kids Skin Care in Summer : సమ్మర్లో సన్‌స్క్రీన్ కచ్చితంగా ఫాలో అవ్వాలి. పెద్దలు కచ్చితంగా ఎస్పీఎఫ్ మంచిగా ఉన్న సన్‌స్క్రీన్స్‌ను ఎంచుకుంటారు. మరి వీటిని పిల్లలకు వాడొచ్చా?
Sunscreen Precautions for Kids : పిల్లలకు సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించవచ్చా? వేసవిలో ఈ ప్రశ్న చాలా మంది తల్లిదండ్రులకు ఎదురవుతుంది. మండు వేసవిలో సూర్యుడి కిరణాల నుంచి వెలువడే హానికరమైన ప్రభావాల నుంచి మనం సన్‌స్క్రీన్లు వాడుతాం. వడదెబ్బ వల్ల చర్మ క్యాన్సర్, ఇతర ప్రతిచర్యలు ఎదురవకుండా ఈ సన్‌స్క్రీన్లు కాపాడుతాయి. వీటిలోని పదార్థాలు సూర్యుడి నుంచి వెలువడే అతి నీలలోహిత రేడియేషన్‌ను అడ్డుకుని చర్మాన్ని కాపాడుతాయి. మార్కెట్లో సన్‌స్క్రీన్లు క్రీమ్, లోషన్, జెల్ వంటి రూపాల్లో లభ్యమవుతున్నాయి. మరి పిల్లలకు ఇవి వాడొచ్చా లేదా ఇక్కడ తెలుసుకోండి.
ఈ జాగ్రత్తలు అవసరం
సన్‌స్క్రీన్లలో ఉండే ఔషధాలు చర్మాన్ని సున్నితంగా మారుస్తాయి. ఒకసారి ఇరిటేషన్ తెప్పిస్తాయి. సన్‌స్క్రీన్ వాడినప్పుడు చర్మం ఎరుపు రంగులోకి మారుతుంటే, దురద కలిగిస్తుంటే వెంటనే నీటితో కడిగేయండి. వైద్యుడి సలహా మేరకు ఇతర సన్‌స్క్రీన్లను వాడండి. సైడ్‌ఎఫెక్ట్స్ లేని సన్‌స్క్రీన్లను వైద్యుడి సలహా మేరకే పిల్లలకు ఎంచుకుంటే మంచిది. ఒక్కోసారి సన్‌స్క్రీన్ల వల్ల దద్దుర్లు, మంట, మైకం కమ్మడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటివి ఏర్పడితే ఆయా సన్‌స్క్రీన్ల వల్ల సైడ్‌ఎఫెక్ట్స్ ఉన్నాయని గమనించండి.
వారికి అస్సలు వాడొద్దట
సన్‌స్క్రీన్లను 6 నెలల వయస్సులోపు ఉన్న పిల్లలకు వాడకూడదని చర్మ వైద్య నిపుణులు చెబుతున్నారు. ఆపై వయస్సు ఉన్న పిల్లలకు వైద్య సలహా మేరకు వాడవచ్చు. ఎండలోకి వెళ్లడానికి ఒక అరగంట ముందు సన్‌స్క్రీన్ అప్లై చేయొచ్చు. ఒకవేళ ముఖం కడగాల్సి వస్తే తుడుచుకుని మరోసారి సన్‌స్క్రీన్ అప్లై చేయొచ్చు.
సన్‌స్క్రీన్ల విషయంలో ఇవి గుర్తుంచుకోండి
సూర్యుడి నుంచి అల్ట్రావయొలెట్ రేడియేషన్ (యూవీ), అలాగే యూవీఏ, యూవీబీ అనే రేడియేషన్లు వెలువడుతాయి. యూవీఏ రేడియేషన్ చర్మాన్ని దెబ్బతీస్తుంది. చర్మం వృద్ధ్యాప్య దశలోకి అడుగుపెట్టేలా చేస్తుంది. అలాగే సబ్బులు, ఔషధాలు, కాస్మొటిక్స్ వాడినప్పుడు అలర్జీలు వస్తాయి. యూవీబీ రేడియేషన్ కూడా ఇలాంటి సమస్యలే తెచ్చిపెడుతుంది. అంతేకాకుండా ఇవి చర్మ కాన్సర్లకు కారణమవుతాయి.
దూరంగా ఉంటేనే మంచిది..
ఎక్కువ సేపు ఎండలో ఉండాల్సి వస్తే రెండు మూడు గంటలకోసారి కూడా అప్లై చేయొచ్చు. కంటి భాగంలో సన్‌స్క్రీన్ వాడకుండా ఉండడమే మంచిది. పిల్లల కళ్లలోకి సన్‌స్క్రీన్ క్రీమ్ గానీ, స్ప్రే గానీ వెళ్లినట్టనిపిస్తే వెంటనే నీటితో కడగండి. నిజానికి మండు వేసవిలో పిల్లలను బయట తిప్పడం మంచి కాదు. వారు ఎండకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే శరీరాన్ని కవర్ చేసేలా తేలికపాటి కాటన్ దుస్తులు, క్యాప్ ధరించడం మంచిది.
అందువల్ల సన్‌స్క్రీన్లను ఎంచుకునేటప్పుడు యూవీఏ, యూవీబీ రేడియేషన్ల నుంచి కాపాడే వాటిని ఎంచుకోవాలి. వీటిలో సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ (ఎస్‌పీఎఫ్) కనీసం 30 లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నవే ఎంచుకోవాలి. ముఖ్యంగా నీరు ఉన్న ప్రదేశాలు, ఇసుక ప్రాంతాలు, మంచు కురిసే ప్రాంతాల్లో సూర్యుడి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుంది. అందువల్ల రేడియేషన్ తప్పించుకోవడానికి ఈ ఎస్పీఎఫ్ వాడాలి.
Also Read : క్వినోవాతో ఈ రెసిపీలు చేసుకుని తింటే.. ఈజీగా బరువు తగ్గుతారు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.