అన్వేషించండి

Weight Loss Recipes with Quinoa : క్వినోవాతో ఈ రెసిపీలు చేసుకుని తింటే.. ఈజీగా బరువు తగ్గుతారు

Weight Loss Recipes : ఆరోగ్య ప్రయోజనాల కోసం క్వినోవాను చాలామంది తమ డైట్​లో చేర్చుకుంటారు. అయితే దీనిని టేస్టీగా ఎన్ని రకాలుగా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. 

Health Benefits with Quinoa : క్వినోవా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. గ్లూటెన్ ఫ్రీ ఫుడ్​ కావాలనుకునేవారు దీనిని హాయిగా తినవచ్చు. దీనిలో ప్రోటీన్​ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ పూర్తిగా ఉంటాయి. ఇది ఫుడ్ తక్కువగా తీసుకున్నా.. ఎక్కువ కాలం కడుపు నిండుగా ఉండేలా చేస్తాయి. జింక్, ఫైబర్, ఫోలేట్ వంటి పోషకాలతో పాటు యాంటీఆక్సిడెంట్లతో నిండి ఉంటాయి. కాబట్టి దీనిని మీరు హాయిగా డైట్​లో తీసుకోవచ్చు. దీనిని వండుకోవడం తేలికే కానీ.. ఎక్కువమందికి దీనిని ఎలా చేసుకోవాలో తెలీదు. అలాంటి వారు ఈ సింపుల్ రెసిపీలను తమ డైట్​లో ఫాలో అయిపోవచ్చు. 

బెర్రీలతో..

ముందుగా క్వినోవాను ఉడికించుకోవాలి. వాటిని బాదంలో పాలల్లో వేసి.. పైన స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, రాస్ప్​బెర్రీలతో కలిపి తీసుకోవచ్చు. దీనిలో బటర్ కూడా వేసుకోవచ్చు. ఫైబర్ కోసం చియా సీడ్స్​ని కలిపి తీసుకోవచ్చు. ఈ క్వినోవాలో యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాకుండా ఇది మీకు ఎక్కువ ఎనర్జీని ఇస్తుంది. యాక్టివ్​గా ఉంటారు. దీనిని మీరు బ్రేక్​ఫాస్ట్​గా లేదా లంచ్​కి తీసుకోవచ్చు. 

సమ్మర్ ఫ్రూట్ మామిడితో..

కొబ్బరిపాలల్లో ఉడికించిన క్వినోవాను కలపండి. దానిపై అరటిపండ్లు, సమ్మర్ సీజన్ ఫ్రూట్ మామిడి ముక్కలు వేయాలి. దానిపై పచ్చి కొబ్బరిని తురిమి వేసుకోవచ్చు. మీకునచ్చిన సిరప్​తో గార్నిష్ చేసుకోవాలి. ఇది ఆరోగ్యానికి మేలు చేయడంతో పాటు.. మంచి రుచిని అందిస్తుంది. కాబట్టి దీనిని మీరు ఈవెనింగ్ స్నాక్స్​లాగా లేదంటే మార్నింగ్ బ్రేక్​ఫాస్ట్​గా తీసుకోవచ్చు. 

ఆపిల్స్​తో స్పైసీగా.. 

ఉడికించిన క్వినోవాలో దాల్చిన చెక్క పొడి, జాజికాయ పొడి వేసి కలపాలి. దీనిలోకి ఆపిల్​ను వేసుకోవాలి. అయితే ఆపిల్​ నేరుగా కాకుండా.. బటర్​లో ఆపిల్ పేస్ట్​ను వేసి.. పంచదార పాకం మాదిరిగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. దానిని క్వినోవాలో వేసుకోవాలి. వాల్​నట్స్, బాదంతో దీనిని గార్నిష్ చేసుకోవచ్చు. దీనిని మీరు లంచ్​గా తీసుకోవచ్చు. కడుపు నిండుగా ఉంచి.. నోటికి మంచి రుచిని అందిస్తుంది. 

ఆకుకూరలతో..

క్వినోవాను బచ్చలికూరతో ఉడికించుకోవాలి. దానిలో అవోకాడోను క్రీమ్​గా చేసి.. దానిలో కీరదోస, గుమ్మడికాయ సీడ్స్ వేసుకుని బాగా కలపాలి. దీనిని రుచిని పెంచుకునేందుకు దానిలో కాస్త నిమ్మరసం వేసి బాగా కలపండి. ఇది రిఫ్రెష్​గా ఉండడమే కాకుండా.. ఎక్కువ సమయం కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. 

ఈ రెసిపీలు పూర్తిగా పోషకాలు, న్యూటెంట్ర్స్​తో నిండి ఉంటాయి. ఇది మెరుగైన జీర్ణక్రియను అందిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాల్​ను తగ్గించు గుండె ఆరోగ్యానికి హెల్ప్ చేస్తుంది. డయాబెటిస్ ఉన్నవారిలో గుండె సమస్యలు రాకుండా కాపాడుతుంది. దీనిలోని డైటరీ ఫైబర్ బరువు తగ్గడంలో హెల్ప్ చేస్తుంది. క్యాన్సర్ వచ్చే రిస్క్​ను తగ్గిస్తుంది.  

Also Read : ఎముక విరిగినప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది.. ఆ ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదట

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయిన టాలీవుడ్ ప్రముఖులుసునామీ బీభత్సానికి 20 ఏళ్లు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్న మత్స్యకారులుఅయ్యప్ప భక్తుడిపై దాడి, మదనపల్లి బస్టాండ్ వద్ద ఉద్రిక్తతగుంతలమయమైన రోడ్లు, డ్రోన్‌లతో వింత నిరసనలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
BJP: బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
బీజేపీకి విరాళాల పంట - ఒక్క ఏడాదిలో 2,244 కోట్లు ఖాతాలో జమ - పాపం కాంగ్రెస్ !
Revanth Reddy on Benefit Shows: బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
బెనిఫిట్ షోలు ల్లేవ్... టాలీవుడ్ పెద్దలకు మరోసారి తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి
Pushpa 2 Collection: మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
మూడు వారాలకే ఇండియన్ సినిమా బాక్సాఫీస్‌‌కు సరికొత్త ఫిగర్‌ని పరిచయం చేసిన పుష్పరాజ్.. ఇదీ పుష్పగాడి రేంజ్
Bhikkanur SI Suicide: ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
ఎస్‌ఐ, మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యలకు కారణం వివాహేతర బంధమే - మూడో వ్యక్తి కూడా ఎందుకు చనిపోయాడంటే ?
Roja Comments: చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
చిత్తూరు జిల్లా అధ్యక్షుడి మార్పుతో రోజాలో నూతనోత్సాహం- అందరికీ వడ్డితో తిరిగి ఇచ్చేస్తామని కామెంట్
Chennai rape Case: చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
చెన్నై యూనివర్శిటీ అత్యాచారం కేసులో ట్విస్ట్ - రోడ్ పక్కన బండి వాడు కూడా !
Congress India Map Controversy: కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
కశ్మీర్ లేకుండా ఇండియా మ్యాప్‌తో కాంగ్రెస్ ఫ్లెక్సీలు - కుట్రేనని బీజేపీ తీవ్ర విమర్శలు
Ambati Rambabu Vs Revanth Reddy: రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి
రేవంత్ రెడ్డిని కెలుకుతున్న రాంబాబు- పూర్తి పరిష్కారానికి "సోఫా" చేరాలంటూ సోషల్ మీడియా పోస్టు 
Embed widget