అన్వేషించండి

Food for Bone Healing : ఎముక విరిగినప్పుడు ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది.. ఆ ఫుడ్స్ మాత్రం అస్సలు తీసుకోకూడదట

Bone Fractur : ప్రమాదంలో ఎముకకు పగులు ఏర్పడినప్పుడు అది మానడానికి వారాలు, నెలలు, సంవత్సరాలు కూడా పట్టొచ్చు. అయితే చికిత్సతో పాటు కొన్ని ఫుడ్స్ కూడా బోన్ ఫ్రాక్చర్ నుంచి కోలుకోవడానికి దోహదం చేస్తాయి.

Bone Healing and Recovery : అనుకోని ప్రమాదాల్లో లేదా కొన్ని సందర్భాల్లో ఎముకలు విరిగిపోతూ ఉంటాయి. వయసు పెరిగే కొద్ది కూడా ఈ ఎముకల సమస్యలు ఎక్కువ అవుతూ ఉంటాయి. అయితే విరిగిన ఎముక పూర్వ స్థితికి రావడానికి దోహదపడే అంశాల్లో చికిత్స తర్వాత ఫుడ్​ ప్రధానమైనదిగా చెప్తారు. వైద్య చికిత్సతో పాటు.. మెరుగైన పౌష్టికాహారం తీసుకుంటే సమస్య త్వరగా తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. బోన్ ఫ్రాక్చర్ అయినప్పుడు ఏయే పోషకాలు, ఖనిజాలు శరీరానికి అవసరమవుతాయో.. ఏ ఫుడ్స్​ని తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం. 

కాల్షియం

ఎముక ఏర్పడేందుకు అవసరమైన ఖనిజ లవణాల్లో ముఖ్యమైనది కాల్షియం. అందువల్ల బోన్ ఫ్రాక్చర్, బోన్ క్రాక్‌ నుంచి కోలుకోవడంలో కాల్షియం ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాల్షియం కోసం కంగారు పడాల్సిన పనిలేదు. చాలా ఆహార పదార్థాల్లో కాల్షియం లభిస్తుంది. ముఖ్యంగా పాలు, పెరుగు, రాగులు, బ్రకోలి, పాలకూర, తెల్ల నువ్వుల్లో కాల్షియం పుష్కలంగా లభిస్తుంది. అందువల్ల వీటిని మీ రోజు వారీ ఆహారంలో తప్పక చేర్చుకోండి. 

విటమిన్ డి 

కాల్షియం ఉండే ఆహార పదార్థాలు తీసుకుంటే సరిపోదు. కాల్షియం శోషణ ప్రక్రియలో డి విటమిన్ చాలా కీలక పాత్ర పోషిస్తుంది. శోషణ ప్రక్రియ సమర్థవంతంగా జరిగి ఎముకలు దానిని స్వీకరించాలంటే విటమిన్ డి తప్పక తీసుకోవాలి. అప్పుడే మీ ఎముకల కూర్పు సక్రమంగా జరిగి పూర్వ స్థితిని సంతరించుకుంటాయి. మరి విటమిన్ డి పోషకం ఏ ఆహారంలో లభిస్తుందని ఆలోచిస్తున్నారా? ఉదయం పూట ఒక అర గంట సూర్యరశ్మి పడేలా కాసేపు ఎండలో ఉండండి. అలాగే పుట్టగొడుగులు, పాల ఉత్పత్తులు, గుడ్డులోని పచ్చసొన, కొవ్వు ఎక్కువగా ఉండే చేపలు తీసుకోవడం ద్వారా విటమిన్ డి పొందవచ్చు.

ప్రొటీన్

ఎముకలు పూర్వ స్థితి సంతరించుకోవడంలో కండరాలు బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. అలాగే కాల్షియం శోషణలో కూడా ప్రొటీన్ తోడ్పడుతుంది. చికెన్, గుడ్లు, మాంసం, శనగలు వంటి వాటిల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉంటుంది.

జింక్

ఎముకల బలోపేతానికి జింక్ కూడా చాలా అవసరం. జింక్ సమృద్ధిగా ఉంటే ఎముకలు పునరుజ్జీవం చెందుతాయి. చిక్కుళ్లు, తృణ ధాన్యాలు, గుమ్మడి, పొద్దుతిరుగుడు, అవిసె గింజలు వంటి విత్తనాల్లో జింక్ పుష్కలంగా లభిస్తుంది.

విటమిన్ సి, ఐరన్

విరిగిన, పగిలిన ఎముకను పూర్వ స్థితికి చేర్చడంలో విటమిన్ సి, ఐరన్ తన వంతు కృషి చేస్తుంది. కొల్లాజెన్ ఉత్పత్తి వల్ల ఇది సాధ్యమవుతుంది. అలాగే ఎముకులకు ఆక్సిజన్ అందించడంలో ఐరన్ తోడ్పడుతుంది. విటమిన్ సీ కోసం ఉసిరి, నిమ్మ, నారింజ, బొప్పాయి, జామ వంటి పండ్లు తీసుకోండి. ఐరన్ కోసం గోంగూర, తోటకూర, పాలకూర, చేపలు, లివర్, చిక్కుళ్లు వంటివి తీసుకోండి. పండ్లలో యాపిల్, దానిమ్మ, ద్రాక్ష వంటి వాటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది.

విటమిన్ కె 

విరిగిని ఎముకలోని ఆస్టియోకాల్సిన్ పటిష్టం అయ్యేందుకు కె విటమిన్ అవసరం. ఇది ఆకు కూరలు, బ్రకోలి, క్యాలిఫ్లవర్, గుడ్లు, చేపలు, బ్లూబెర్రీలు, రేగు పండ్లు, ద్రాక్ష పండ్లు, తృణ ధాన్యాల్లో లభిస్తుంది.

పొటాషియం

మీరు మూత్ర విసర్జనలో ఎక్కువగా కాల్షియం కోల్పోకుండా ఉండాలంటే పొటాషియం అనే ఖనిజ లవణం అవసరం. అరటి పండ్లు, ఆలుగడ్డలు, విత్తనాలు, మాంసం, పాలల్లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. తద్వారా కాల్షియం కాపాడుకోవచ్చు.

వీటికి దూరంగా ఉంటే మంచిది..

విరిగిన ఎముకలు పూర్వ స్థితికి రావాలంటే కొన్ని ఆహారాలకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆల్కహాల్, కాఫీ, అధికంగా ఉప్పు తీసుకోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం వంటి వాటికి దూరంగా ఉండాలి. ఇవన్నీ మీ జీవక్రియను ప్రభావితం చేసి విటమిన్ల శోషణను ప్రభావితం చేస్తాయి. కాల్షియం తగ్గడానికి కారణం అవుతాయి. అలాగే ధూమపానం కూడా ఎముకకు రక్త ప్రవాహాన్ని అడ్డుకుంటుంది.

Also Read : ఇదేందయ్యా ఇది.. గొంతు నొప్పితో కోమాలోకి వెళ్లిపోవడమేంటి? అసలు ఏమి జరిగింది

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబుమళ్లీ కెలుక్కున్న వేణుస్వామి, అల్లు అర్జున్ జాతకం కూడా

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Viral News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్-  భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం- బీటెక్ స్టూడెంట్, వివాహిత అఫైర్- భార్య ఎదుటే ప్రియుడ్ని చితక్కొట్టారు!
Allu Arjun: షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
షాకింగ్... తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోయిన అల్లు అర్జున్
Hyderabad IAF Airshow: ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
ఆదివారం భారీ ఎయిర్ షో, హైదరాబాద్‌లో ఆ ఏరియాలో ట్రాఫిక్ ఆంక్షలు
Embed widget