Sore Throat to Coma : ఇదేందయ్యా ఇది.. గొంతు నొప్పితో కోమాలోకి వెళ్లిపోవడమేంటి? అసలు ఏమి జరిగింది
Coma Patient Experience : గొంతు నొప్పి అనేది చాలా సాధారణం. సీజన్లు మారినప్పుడు ఇది ఎక్కువగా వస్తుంది. అయితే ఓ వ్యక్తి గొంతు నొప్పితో కోమాలోకి వెళ్లిపోయాడట. అది ఎలా జరిగిందంటే..
Ghost Boy By Martin Pistorius : పిల్లల నుంచి పెద్దల వరకు గొంతు నొప్పి అనేది చాలా కామన్‌గా ఉంటుంది. ముఖ్యంగా జలుబు చేసినప్పుడు, దగ్గు సమయంలో, సీజన్ మారినప్పుడు గొంతు నొప్పి వస్తుంది. మందులు వాడినా.. కాస్త శ్రద్ధ తీసుకున్నా, ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నా నొప్పి తగ్గుతుంది. కానీ ఓ వ్యక్తికి మాత్రం కోమాలోకి వెళ్లిపోయాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా పదేళ్లకు పైగా కోమాలో ఉన్నాడు. ఇంతకీ అతను కోమాలోకి ఎందుకు వెళ్లాడు? దాని తర్వాత జరిగిన సంఘటనలు ఏంటి వంటి విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
స్కూల్ ఏజ్‌లోనే కోమాలోకి..
దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌కు చెందిన మార్టిన్ పిస్టోరియస్ గొంతు నొప్పితో కోమాలోకి వెళ్లిపోయాడు. ఓరోజు స్కూల్ నుంచి ఇంటికి వస్తున్నప్పుడు గొంతు నొప్పి వచ్చిందట. అప్పుడు అతనికి 12 సంవత్సరాలు. మొదట్లో ఫ్లూగా భావించినా.. తర్వాత అతని పరిస్థితి వేగంగా క్షీణించింది. ఫలితంగా అతను కోమాలోకి వెళ్లిపోయాడు. క్రిప్టోకోకల్ మెనింజైటిస్, బ్రెయిన్ ట్యూబర్క్యులోసిస్తో అతను కోమాలోకి వెళ్లినట్లు వైద్యులు తెలిపారు. ఈ విషయంలో ఏమి చేయలేమని కూడా చెప్పారు. కానీ అతని తల్లిదండ్రులు మార్టిన్‌ను సంరక్షణ కేంద్రంలో ఉంచారు.
అప్పుడు చాలా భయపడిపోయాను..
కోమాలో ఉన్న సమయంలో తన చుట్టూ ఏమి జరిగేవో అన్ని గుర్తున్నట్లు మార్టిన్ తెలిపాడు. మాట్లాడాలని ఉన్నా నోరు కదలలేక, కమ్యూనికేట్ చేయలేక చాలా భయపడిపోయినట్లు మార్టిన్ తన అనుభవాన్ని పంచుకున్నాడు. నాలుగు సంవత్సరాల తర్వాత స్పృహ వచ్చినా మాట్లాడలేకపోయానని చెప్పాడు. తన 16వ సంవత్సరంలో గడ్డం షేవ్ చేయాలా? వద్దా? అని తన దగ్గర జరిగిన డిస్కషన్‌ను కూడా అతను గుర్తు చేసుకున్నాడు. టీవీ, తన దగ్గర ఎవరైనా మాట్లాడితే.. ఆ మాటాలు విని.. ప్రపంచంలో ఏమి జరుగుతుందో తెలుసుకున్నాని తెలిపాడు.
అన్ని గమనిస్తూనే ఉన్నాను.. కానీ
నా చుట్టూ జరిగే అన్ని విషయాలు నాకు తెలిసినా.. అక్కడ నేను ఉన్నాను అనే ఫీలింగ్‌నే అందరూ మరచిపోయారని.. ఇలా ఒంటరిగా ఉండిపోతానేమోనని భయపడినట్లు చెప్పాడు. సంవత్సరాలు గడుస్తున్నా.. తనలో చలనం రాలేదని వెల్లడించాడు. కోమా నుంచి బయటకు వచ్చాక.. నేను మళ్లీ ఆ లైఫ్‌లోకి వెళ్లకూడదని కోరుకున్నట్లు మార్టిన్ తెలిపాడు. అనంతరం కంటి కదలికలతో వస్తువులను గుర్తించే టెస్ట్‌లో విజయం సాధించడంతో అతని పేరెంట్స్ స్టీఫెన్ హాకింగ్ ఉపయోగించిన కమ్యూనికేషన్ సాఫ్ట్‌వేర్‌తో కూడిన కంప్యూటర్ను కొన్నారని పేర్కొన్నాడు.
ఇప్పుడతనో సైంటిస్ట్
తర్వాత కాలంలో అతను సింథటిక్ ప్రసంగం ద్వారా కమ్యూనికేట్ చేయడం నేర్చుకున్నాడు. వెబ్సైట్ అభివృద్ధి చేయడంలో ప్రావీణ్యం సంపాదించాడు. యూనివర్సిటీ నుంచి పట్టభద్రుడు కూడా అయ్యాడు. తన సోదరితో కలిసి జోన్‌ను కలుసుకున్నాని.. ఆ తర్వాత సంవత్సరం 2008లో వివాహం చేసుకున్నట్లు తెలిపాడు. వీరికి 2018లో ఓ బాబు కూడా జన్నించాడని తెలిపారు. ప్రస్తుతం మార్టిన్ కంప్యూటర్ సైంటిస్ట్, వెబ్ డెవలపర్‌గా ఉద్యోగం చేస్తున్నట్లు వెల్లడించాడు. అతని జీవిత కథను ఘోస్ట్ బాయ్ అనే పుస్తకం పేరుతో విడుదల చేశారు.
Also Read : సమస్యల్లో చిక్కుకున్న పేద ప్రజలకు సేవచేయడమే లక్ష్యం.. రెడ్ క్రాస్ డే 2024 థీమ్, దాని వెనుకున్న చరిత్ర ఇదే