By: Haritha | Updated at : 09 Jul 2022 08:58 AM (IST)
(Image credit: Pixabay)
డయాబెటిక్ రోగులు ఏం తిన్నాలన్నా ముందుగా అందులో చక్కెర ఉందో లేదో తెలుసుకోవాలి, జీఐ విలువ తక్కువగా ఉండే ఆహారాన్నే తినాలి. ఏది తినాలన్నా, తాగాలన్నా చాలా షరతులు వర్తిస్తాయి వారికి. ఉదయాన లేవగానే టీ, కాఫీలు తాగకుండా తెల్లవారదు చాలా మందికి.మధుమేహులు రోగులకు అంతే. అయితే చాలా మంది ఆర్టిఫిషియల్ స్వీట్‌నర్లు కలుపుకుని టీ, కాఫీలు తాగేస్తారు. కానీ వాటిని వాడడం ఆరోగ్యానికి అంత మంచిది కాదని అధ్యయనాలు చెబుతున్నాయి. అయితే వీరికి మంచి ఎంపిక గ్రీన్ టీ.దీన్ని తాగడం వల్ల మధుమేహులకు చాలా మేలు చేస్తుంది.
గ్రీన్ టీ ఎందుకు మేలు?
గ్రీన్ టీలో పాలీఫెనాల్స్ అనే పదార్థాలుంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడే యాంటీ ఆక్సిడెంట్లను కలిగి ఉంటాయి. ఇది మధుమేహం ఉన్న వారిలో గుండె జబ్బులు వచ్చే అవకాశాలను చాలా మేరకు తగ్గిస్తుంది. అలాగే జీర్ణ వ్యవస్థ మెరుగ్గా పనిచేసేందుకు సహకరిస్తుంది. ముఖ్యంగా రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇన్సులిన్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. కాబట్టి గ్రీన్ టీని వీరు రోజూ తాగడం వల్ల మేలే జరుగుతుంది. ముఖ్యంగా టీ, కాఫీ కన్నా గ్రీన్ టీ తాగడం చాలా మంచిది. ఎపిడెమియోలాజికల్ అధ్యయనాల ప్రకారం గ్రీన్ టీ వినియోగం టైప్ 2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
అతిగా తాగితే అనర్థమే
గ్రీన్ టీ మితంగా తాగితే ఎన్నో రకాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది. రోజుకు మూడు కప్పులకు మించి మాత్రం తీసుకోకూడదు. అంతకుమించి తాగితే మాత్రం దుష్ప్రభావాలు తప్పవు.
1. గ్రీన్ టీలో కూడా కెఫీన్ ఉంటుంది. దీన్ని అధికంగా తాగడం వల్ల శరీరానికి అవసరమైన దానికన్నా అధికంగా కెఫీన్ అందుతుంది. దీంతో తలనొప్పి వస్తుంది.
2. గ్రీన్ టీ నుంచి అందే కెఫీన్ నిద్రకు దూరం చేస్తుంది. అధికంగా తాగితే నిద్రలేమి సమస్య బాధిస్తుంది.
3. గ్రీన్ టీలో టానిన్లు పుష్కలంగా ఉంటాయి. అందుకు గ్రీన్ టీ అధికంగా తాగితే ఈ టానిన్లు కూడా పొట్టలో యాసిడ్లను పెంచుతాయి. మలబద్ధకం కూడా పెరిగిపోతుంది.
4. అతిగా గ్రీన్ తాగడం అనేది శరీరంలో ఇనుము లోపించేలా చేస్తుంది. తద్వారా రక్తహీనత సమస్య మొదలవుతుంది.
5. అధికంగా గ్రీన్ టీ తాగడం వల్ల కాలేయ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇది కాలేయ గోడలను దెబ్బతీస్తుంది.
కాబట్టి గ్రీన్ టీ ఉదయం ఒక కప్పు, సాయంత్రం ఒక కప్పు తీసుకోండి చాలు. అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.
Also read: హీరో విక్రమ్‌కు ఛాతీ నొప్పి? గుండె నొప్పి - ఛాతీ నొప్పి వేరు వేరా? ఏది ఏంటో ఎలా తెలుసుకోవాలి?
Also read: మగవారు జాగ్రత్త పడాల్సిందే, పెరిగిపోతున్న ప్రొస్టేట్ క్యాన్సర్ కేసులు
Viral Video: చిరుతతో ఆటలేంట్రా నాయనా? అదేమైనా కుక్క పిల్లా, తోకపట్టుకుని లాగుతున్నావ్?
స్పైసీ ఫుడ్ తిన్న తర్వాత కడుపులో మంటగా ఉందా? ఇవిగో ఆయుర్వేద చిట్కాలు
టాయిలెట్లో టైంపాస్? గంటలు గంటలు కూర్చుంటే చెప్పుకోలేని రోగం వస్తుందట!
30 Days Water Challenge: 30 డేస్ వాటర్ ఛాలెంజ్ - ఈ ట్రెండ్ ఫాలో కావద్దు, ప్రాణాలు పోతాయ్, ఎందుకంటే..
70 ఏళ్ల వయస్సులో బిడ్డకు జన్మనిచ్చిన బామ్మగారు, 54 ఏళ్ల కల ఫలించిన వేళ!
iPhone 14: ఐఫోన్ 14 సిరీస్ లాంచ్ తేదీ లీక్ - నెల కూడా లేదుగా!
Harish Rao : అప్పట్లో పొగడ్తలు ఇప్పుడు విమర్శలా ? - షెకావత్‌కు హరీష్ కౌంటర్ !
WhatsApp New Feature: వాట్సాప్‌లో డిలీట్ అయిన మెసేజ్‌లను మళ్లీ చూడొచ్చు.. ఎలాగో తెలుసా?
Dil Raju: ఓటీటీలో 8 వారాల తరువాతే సినిమాలు - టికెట్ రేట్లు కూడా తగ్గిస్తాం : దిల్ రాజు