అన్వేషించండి

Kitchen Tips: పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే ఇలా నిల్వ చేయండి

అందరి ఇళ్లలోనూ తప్పకుండా రొట్టెలు చేసుకోవడానికి వంట గదిలో పిండి ఉంటుంది. మరి దాన్ని ప్యాక్ తెరిచిన తర్వాత కూడా ఎక్కువ రోజులు తాజాగా ఉంచుకోవాలంటే ఇలా చేయండి.

భారతీయులు తమ భోజనంలో రోటీ లేదా చపాతీ తప్పకుండా తీసుకుంటారు. అందుకే ఇంట్లోకి ఎక్కువ పిండిని కొంటూ ఉంటారు. సూపర్ మార్కెట్ కి వెళ్ళారంటే చాలా మంది ఐదు కేజీల పిండి బ్యాగ్స్ కొనుగోలు చేస్తారు. అది అయితే ఎక్కువ రోజులు వస్తుందని. వాటితో రోటీలు చేసుకుంటారు కానీ ఆ పిండిని భద్రం చేసే విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా ఉంటారు. ప్యాకింగ్ ఓపెన్ చేసిన తర్వాత దాన్ని సరిగా భద్రపరచకపోతే అది పాడైపోతుంది. పురుగులు పట్టడం, వాసన రావడం జరుగుతుంది. అసలు పిండి ఎంత కాలం తాజాగా ఉంటుందో తెలుసా? మీరు సరైన జాగ్రత్తలు పాటిస్తే ఏడాది వరకు దాన్ని భద్రం చేసుకోవచ్చు. పిండి బ్యాగ్ సరిగా క్లోజ్ చేయకుండా వదిలేస్తే దాని రుచి కూడా పాడవుతుంది. దానితో చేసిన పదార్థాలు తింటే వ్యాధుల బారిన పడిపోతారు. అందుకే పిండి తాజాగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఇలా చేయండి.

పిండి ఎంత కాలం తాజాగా ఉంటుంది?

⦿పిండి బ్యాగ్ తెరిచిన తర్వాత జాగ్రత్త చేయకపోతే 2-3 నెలల వరకు మాత్రమే తాజాగా ఉంటుంది. ఆ తర్వాత దాని రుచి, వాసన మారిపోతుంది. అందుకే దాన్ని పొడి, గాలి చొరబడని కంటైనర్ లో నిల్వ చేసుకోవాలి. ఇలా చేశారంటే అది కనీసం 2 ఏళ్ల వరకు చక్కగా పాడైపోకుండా ఉంటుంది.

⦿తడి చేతులతో పిండిని ఎప్పుడూ తాకకుండా చూసుకోవాలి. తడిగా ఉన్న కంటైనర్ లో అసలు పెట్టకూడదు. తేమ ఉండటం వల్ల దాని రుచి, ఆకృతి పాడైపోతుంది.

⦿గింజలు, ధాన్యాల నుంచి వచ్చిన పిండితో పోలిస్తే శుద్ధి చేసిన పిండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. బాదం, ఓట్స్, మిల్లెట్ తో చేసిన పిండి సరిగా నిల్వ చేస్తే సుమారు ఏడాది పాటు రుచిగా ఉంటుంది.

ఇలా ఉంటే పిండి చెడిపోయినట్టే

⦿పిండి వాసన ద్వారా అది చెడిపోయిందని తెలుసుకోవచ్చు. ఎటువంటి రకం అనేదానితో సంబంధం లేకుండా అసహ్యమైన వాసన వచ్చినా, మురికిగా కనిపించినా దాన్ని ఉపయోగించకూడదు. ఆ పిండి పాడైపోయిందని అర్థం .

⦿మరొక గుర్తు పిండి రంగు మారిపోవడం. గింజల రకాన్ని బట్టి పిండి రంగు కూడా ఉంటుంది. గోధుమలు అయితే లేత గోధుమ రంగు ఉంటుంది. అల్ పర్పస్ పిండి అయితే మెత్తగా తెల్లగా ఉంటుంది. పిండి పసుపు రంగులోకి మారితే మాత్రం దాన్ని వాడకండి.

⦿పిండిలో ముద్దలు ముద్దలుగా కనిపిస్తే మాత్రం దాన్ని పారేయాలి. తేమ చేరడం వల్ల బ్యాక్టీరియా చేరిపోతుంది. పిండి కలర్ లో కనిపించే పురుగులు వచ్చేస్తాయి. అవి చాలా చిన్నగా ఉండటం వల్ల గుర్తించడం కూడా కష్టం అవుతుంది. అందుకే పిండి కాస్త తేడాగా అనిపించినా దాన్ని బయట పారేయడం మంచిది. ఇదే కాదు గడువు తేదీ ముగిసిన తర్వాత వాసన రావడం లేదు కదా అని పిండి వాడటం కూడా ఆరోగ్యానికి మంచిది కాదు.

గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.

 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియాఅమెరికాలో అదానీపై అవినీతి కేసు సంచలనంసోషల్ మీడియాలో అల్లు అర్జున్ రామ్ చరణ్ ఫ్యాన్ వార్ధనుష్‌పై మరో సంచలన పోస్ట్ పెట్టిన నయనతార

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP News: పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
పెన్షన్ దారులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - కీలక మార్గదర్శకాలు జారీ
BRS Vs BJP: అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
అదానీ అంశాన్ని బీజేపీతో ముడిపెట్టి బీఆర్ఎస్ విమర్శలు - గట్టి కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి
Rains: ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
ఏపీకి మరోసారి అల్పపీడనం - ఆ 2 రోజులు భారీ వర్షాలు, తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత
AP News: ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
ఏపీలో ఎన్టీపీసీ భారీ పెట్టుబడులు - 1.06 లక్షల మందికి ఉద్యోగావకాశాలు, సీఎం చంద్రబాబు సమక్షంలో ఒప్పందం
Ram Charan: మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
మైసూరులో రామ్ చరణ్ సినిమా షూటింగ్... చాముండేశ్వరి మాత ఆశీస్సులతో RC16 Movie షురూ
Mechanic Rocky Review - 'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
'మెకానిక్ రాకీ' రివ్యూ: అమ్మాయిలు, ప్రేమలు కాదు... అంతకు మించి - విశ్వక్ సేన్ యాక్షన్ కామెడీ ఫిల్మ్ ఎలా ఉందంటే?
IND vs AUS 1st Test: ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
ఆస్ట్రేలియాతో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్‌- ప్లేయింగ్ 11లో నితీశ్‌కు చోటు 
Sabarimala Temple 18 Steps: శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
శబరిమల ఆలయంలో 18 మెట్లు దాటాలంటే ముందు ఈ విషయాలు తెలుసుకోవాలి!
Embed widget